ప్రకృతికి ’సీమంతము’

ప్రకృతికి ’సీమంతము’

రచన : ’కవి దిగ్గజ’ డా. ఆచార్య ఫణీంద్ర

IMAG0279

IMAG0289

IMAG0312

IMAG0317

బ్రతుకునిడు ప్రకృతిని ’బతుకమ్మ తల్లి’గా
ఎంచెడు తెలగాణ యింతులెల్ల
భక్తి గొలిచి, ఆడి, పాడి మురియుచుంద్రు!
ప్రకృతి పూజ సలుపు పండుగిదియ!

గునుగు, తంగేడు వంటి పూలను వరించి,
ఏర్చి, కూర్చి, తెలంగాణ యింతి పేర్చి,
అమిత సుందరమ్ముగ ’బతుకమ్మ’ దీర్చి,
ప్రకృతికిటుల ’సీమంతము’ వరలజేయు!

అంగనలు గూడి యాడుట
సింగారించుకొని పట్టు చీరలు, రవికల్,
బంగారు నగల తోడన్ –
సాంఘిక సహజీవన ఘన సంస్కృతి గాదో!

భారత సంప్రదాయ ఋజువర్తన రీతులు, నీతి, ధర్మముల్,
పేరిమి గొన్నయట్టి ఘన వీర కథా కమనీయ భావముల్
కూరిచినట్టి దివ్య రస ఘోషితమౌ ’బతుకమ్మ పాట’లన్
నేరిచి యాడి పాడెదరు నెచ్చెలులై తెలగాణ జవ్వనుల్!

చెరువులం దౌషధగుణ మలరు సుమాల
చేర్చి, ప్రక్షాళనము సేయు శ్రేష్ఠమైన
శాస్త్ర దృక్పథమ్ము గలుగు సంస్కృతిదియ!
జయమిదె తెలగాణ సంస్కృతికిని!

                  — *** —

IMAG0319

IMAG0337

IMAG0340

IMAG0346

IMAG0348

IMAG0349

IMAG0380

IMAG0371

IMAG0368

IMAG0364

IMAG0361

IMAG0376

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. padmarpita
  అక్టో 13, 2013 @ 23:02:24

  ఎంతో చక్కగా విశ్లేషించారు…..

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  అక్టో 14, 2013 @ 07:10:10

  పద్మ గారు!
  మీకు ధన్యవాదాలు!
  విజయ నామ సంవత్సర విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!

  స్పందించండి

 3. మఠం మల్లిఖార్జున స్వామి
  అక్టో 14, 2013 @ 13:29:00

  ఎన్నోరీతుల ఎన్నో పండుగల రూపంలో ప్రకృతి పూజ చేసి కృతజ్ఞతలు తెలుపుకోవటం తెలంగాణా ప్రాంతంలో అనాది నుండి కలదు. ప్రకృతిలో దొరికే గునుగు, తంగేడి, ముత్యాల పువ్వు, పోక పువ్వు, పట్టుకుచ్చుల పువ్వులతో అందంగా అలంకరించి పెర్చేవారు – ఆ పెర్చటానికి ఎన్నో నియమాలు ఉండేవి – అదో పెద్ద టపానే అవుతుంది. మీ బతుకమ్మ కూడా సహజత్వంతో ప్రకృతిని స్ఫురింపజేస్తూ చాలా బాగుంది. రక రకాల పూల వలన కుంటలు, చెరువులు అమృతమయమవుతాయని చక్కగా తెలియజెప్పారు – ఎంతో బాగుంది మీ కవిత.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  అక్టో 14, 2013 @ 14:08:52

  మల్లికార్జున స్వామి గారు!
  మీకు ధన్యవాదాలు! విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: