ఘనంగా జాషువా జయంతి ఉత్సవాలు …

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం – “తెలుగు అకాడమి”, “పద్మభూషణ్ డా. గుర్రం జాషువా పరిశోధన కేంద్రం” ఆధ్వర్యంలో జాషువా మహా కవి 118 వ జయంతి ఉత్సవాలను హైదరాబాదు జూబిలీ హాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించింది. మొదటి రోజు జరిగిన “శత కవితా వసంతం” కవి సమ్మేళనంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం అందుకొని, నేను జాషువా కవీంద్రునిపై నా కవితను వినిపించాను. ఆ కవితను, ఇతర వివరాలను సాహిత్యాభిమానుల కోసం అందిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

j1

ఓ మహా కవీ … !

రచన : ’కవి దిగ్గజ’ డా. ఆచార్య ఫణీంద్ర

j2

నీ కవితా వధూటి రమణీయ ముఖాంబుజ దివ్య రూప రే
ఖా కమనీయ వైఖరుల గాంచి, “భళీ, భళి” యన్న వారె నీ
దే కులమన్న ప్రశ్న వెలయిం చవమానము సల్పుటన్ – వినన్
బాకున గ్రుమ్మినట్లగును! వారి నొకింత క్షమించు జాషువా!

బ్రదికిన యన్ని నాళ్ళు కుల బాధిత సంఘమునన్ కలమ్ముతో
వదలక పోరు సల్పుచును – వర్ణ వివక్షను జూపు వారికిన్
హృదయములో కళుక్కుమను నేదొ వివేచన గల్గ జేయగా
కదిలితి వీవె – అభ్యుదయ కావ్య రసైక విధాత! జాషువా!

ఒక్కడ వీవె జాషువ! మహోన్నత నవ్య పథంబు జూపుచున్
దిక్కులు మార్చి అభ్యుదయ దీప్తుల నిల్పితి తెల్గు పద్యమున్!
తక్కిన వారలెల్ల నదె తాతల నాటి పురాణ వీధులన్
స్రుక్కిరి గాదె! నీ విటుల చూపిన బాటను సాగి పోయెదన్!

పద్యము ప్రాతదౌ ననక ప్రక్రియలందు వివక్ష యేలటన్,
పద్య కవిత్వమందె నవ పద్ధతి నభ్యుదయాత్మకంబుగా
హృద్య కృతుల్ రచించి, గణనీయ ప్రశస్తిని పొందినట్టి ఓ
అద్యత నాంధ్ర పండిత మహా కవి జాషువ! నీకు మ్రొక్కెదన్!

పచ్చి బాలెంతరాలు మా భరత మాత
ముచ్చటన్ కని పెంచిన ముద్దు బిడ్డ!
సుకవి జీవించు ప్రజల నాలుకల పైన!
నీవు జీవింతు వట్టులే నిక్క మెపుడు!

— *** —

కవి సమ్మేళనంలో ప్రాతినిధ్యం వహించిన నాకు బహూకరించిన జ్ఞాపిక :

j3

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: