28 సెప్టెం 2013
by Dr.Acharya Phaneendra
in తెలుగు సాహిత్యం
1930 ల కాలంలో ఒకానొక సీమాంధ్ర కవి దురహంకారంతో “నిజాం రాష్ట్రములో తెలుగు కవులు పూజ్యము” అని ఒక వ్యాసంలో పేర్కొన్నప్పుడు – తెలంగాణ వైతాళికులు, సుప్రసిద్ధ సాహితీమూర్తి కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి గారు ఎంతో బాధపడి, సుమారు 400 మంది ఆనాటి తెలంగాణ కవుల వివరాలు, కవితలను సేకరించి తమ సంపాదకత్వంలో “గోలకొండ కవుల సంచిక” పేరిట ఒక అమూల్యమైన గ్రంథాన్ని రూపొందించి, ప్రచురించి, తగిన సమాధానాన్ని క్రియా రూపంగా ఇచ్చారు.


మాది పండిత కుటుంబం. మా మాతామహుల(మా అమ్మకు నాన్నగారు), పితామహుల(మా నాన్నగారి నాన్నగారు) వివరాలు మరియు వారి కవితలు ఆ సంచికలో విశేషంగా ప్రచురించబడినవి. ఆ సంచికలోని ఆ వివరాలను ఈ క్రింద పొందుపరచినాను.
– డా. ఆచార్య ఫణీంద్ర
మా పితామహుల వివరాలు, వారి కవిత:


మా మాతామహుల వివరాలు, వారి కవిత:



శ్రీ ఆచి రాఘవాచార్య శాస్త్రులు గారు మా అమ్మకు తాతగారు. వారి వివరాలు:

దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే
Previous తెలంగాణ శిష్ట వ్యావహారికం – చర్చ Next ఘనంగా జాషువా జయంతి ఉత్సవాలు …
సెప్టెం 28, 2013 @ 09:41:36
ఫణీంద్ర గారూ, మీరు అటువంటి గొప్పవారి కుటుంబంలో పుట్టడంతో ధన్యులయ్యారు. మీరు వారి అడుగుజాడలలో నడవడం గర్వకారణం.
అంతర్జాలంలో గోలకొండ కవుల సంచిక దొరుకుతుందా? గ్రంధాలయాలకు వెళ్ళడం కుదరని వారికి సాఫ్ట్ కాపీ ఉంటె బాగుంటుంది
Thanks a lot sir..
సెప్టెం 28, 2013 @ 11:26:12
జై గొట్టిముక్కల గారు!
మీ అభిమానానికి అనేక ధన్యవాదాలు!
గోలకొండ కవుల సంచికను ఇటీవలే తెలంగాణ ఉద్యమ నాయకులు, చారిత్రిక పరిశోధకులు జితేంద్ర బాబు గారి బృందం పునర్ముద్రించారు. కాని అంతర్జాలంలో ఉందో.. లేదో తెలియదు. నేను 1934 నాటి ప్రతి నుండి పై భాగాలను జిరాక్స్ చేసుకొన్నాను.
సెప్టెం 28, 2013 @ 12:34:43
alanti panidht kutumbamu lo puutina meeru nijangaa bhagulu … vari spoorthi tho telangana sahithya inkaaa mundhu ku povalani ashisthunnanu
సెప్టెం 28, 2013 @ 14:07:57
DLI (http://www.dli.ernet.in/) has scans of 1934 print – search for “Golakonda Kayula Sanchika”
The scans given above are not from the 1934 print but from the recent (DTP) print with ముద్రారాక్షసాలు.
Regards,
VSTSayee.
సెప్టెం 28, 2013 @ 21:19:25
chandu garu!
dhanyavaadaalu!
సెప్టెం 28, 2013 @ 21:26:09
Sayee garu!
May be… I told what the person (who helped me in arranging these xerox copies) told me. I have not seen the original.
Any how, thanks for the information given to me.
సెప్టెం 28, 2013 @ 21:29:26
Jai Gottimukkala garu!
Please see the information given by Sri VSTSayee for your requirement.
DLI (http://www.dli.ernet.in/) has scans of 1934 print – search for “Golakonda Kayula Sanchika”
సెప్టెం 30, 2013 @ 11:25:56
VSTSayee గారూ & ఫణీంద్ర గారూ, చాలా థాంక్సండీ
సెప్టెం 29, 2013 @ 11:31:45
Sir
There is nothing like durahamkaramu. You are sharing this info!!! while we appreciate this why do you people mention about adavi bapiraju, who hailed from bheemavaram and who was editor for meejan, the magazine which used to highlight the atrocities of nizam?
సెప్టెం 29, 2013 @ 12:13:47
Mr. Kiran!
You can not show one or two exceptions and wipe out the discrimination shown by majority of Seemandhra people for all the years. Much was discussed about this in my past posts. If you are interested, you please see them.
సెప్టెం 30, 2013 @ 04:43:34
Syamalaradhuylu,
Namaskaram Phaneendra garu,
Golkonda Kavulu pusthakamunu nenu chadhivanu. Dhanilo Madapati Hanumantha Rao gari tho patu chala mandhi Seemandhra Kavulani kooda Suravaram Pratap Reddy garu prachurincharu. Appatilo ayana Hyderabad pranthamulo krushi chesina varini (anaga Madapati Hanumantha Rao vanti varini) mariyu, Srivaishnava paramparaku chendhina Tanjore, Mysore, Seemandhra varini kooda perukonnaru.
Ika Mudumbai garu, evaraithey ee pusthakamunaku parokshamuga karanabhoothulo, vari vamsamu Tamil desamunaki chendhinadhi. Varu vasthavaniki Tamilulu. Varu Sri Vaishnava parampara ki chendhina varu.
http://en.wikipedia.org/wiki/Mudumbai
Vanamamalai Varadacharyulu Varu kooda Tamil Nadu ki chendhina Sri Vaishnavulu.
http://en.wikipedia.org/wiki/Sri_Vanamamalai_Perumal_Temple
Sri Ramanujacharyulu varu unna rojulalo, 74 mandhi Sri Vaishnavulani veru veru gramalaki pampi Sri Vaishnava tatvanni chataru.
Ee prapancheekarana nepadhyamulo Inka chala marpulu vasthayi.
సెప్టెం 30, 2013 @ 07:30:46
శ్యామలారాధ్యులు గారు!
సురవరం ప్రతాప రెడ్డి గారు ఆ గ్రంథంలో ఆనాడు నిజాం రాష్ట్రంలో నివాసం ఏర్పర్చుకొన్న కవులను పరిచయం చేసారు. వారిలో కొందరి మూలాలు సీమాంధ్రకు చెంది ఉండవచ్చు. అయితే ఏమిటట? ఆనాడైనా… ఈనాడైనా… సీమాంధ్ర మూలాలు ఉండి కూడ ఇక్కడ నివాసం ఏర్పర్చుకొని, మాతో సఖ్యంగా సహజీవనం చేస్తున్న వారిని మేము మా వారిగానే చూస్తాం. సమస్యంతా మమ్మల్ని అవహేళన చేస్తూ, ఆధిపత్యం ప్రదర్శించే సీమాంధ్రులతోనే. అత్యధికులు అలాంటి వారు కావడం వలన సమస్య పెద్దదై ఇంతవరకు వచ్చింది.
ఇక రామానుజుల వారి శిష్యులైనంత మాత్రాననో, లేక తమిళనాడు మూలాలు ఉన్నంత మాత్రాననో తమిళులు కారు. ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళులు తెలుగులు కలిసే ఉండేవారు. మీ వాదన చూస్తే త్యాగరాజును తమిళుడనేట్టున్నారు. అలాగే నేను శ్రీ వైష్ణవుడను, కాని నాది తమిళ మాతృ భాష కాదే!
ఆనాడు దురహంకారాన్ని ప్రదర్శించిన ముడుంబై వారు తెలుగు కవియే!
సెప్టెం 30, 2013 @ 11:32:03
శ్యామలారాధ్యులు గారూ, 17వ పేజీలో సురవరం ప్రతాప్ redid గారు కవుల గురించిన నియమాలు రాసారు, మీరు చదవలేదేమో.
“కవి నిస్సంశయముగా నిజాము రాష్ట్రవాసియై యుండవలయును”
అనేది మొదటి నియమం. పరిచయం లో తదుపరి పేజీలలో జిల్లాల & కులాల వారీగా కవుల సంఖ్యా తెలిపారు. ఇక అనుమానాలకు ఆస్క్రారం ఎక్కడిది?
సెప్టెం 30, 2013 @ 13:05:17
డాక్టర్ ఫణీంద్ర గారు, తెలంగాణా కవులపైన దురహంకార పూరిత వ్యాఖ్య చేసిన “సీమ” కవులు/రచయితలు ఎవరైనా ఉన్నారా? తెలుసుకోవాలని అడుగుతున్నాను.
సెప్టెం 30, 2013 @ 15:38:46
ఆచార్య ఫనీంద్ర గారు!
కవితా పాండిత్యము విలసిల్లిన ఇంట మీరు జన్మించి కవి దిగ్గజులగుట మీ పూర్వ జన్మ విశేషమే.
సురవరం ప్రతాప రెడ్డి గారి నాటి క్రుషి ఎంతో శ్లాఘనీయము.
తెలంగాణాలో కవులకు కొదవ ఏనాడూ లేదు – ఆ నాడు నిజాం రాజ్యంలో ఉండి వెలుగు చూడలేక పొయారు (ఒక కరపత్రం ప్రచురించటానికే భయపడ్డ కాలమది)
తెలంగాణా పత్రికల లేమి అప్పుడూ ఇప్పుడూ ఉండి వెలుగు వెలగక పోయిన తెలంగాణా కవి రత్నాలెందరో కలరన్నది సత్యం.
అయినా అందులో ముద్రితం కాని కొందరు ప్రాచీన కవులు కలరు (ఉదా: కొలనుపాక వాస్తవ్యుడైన శివయోగి శివాచార్యుడు – క్రీ.శ.900 ప్రాంతానికి చెందిన వీరు సిద్దాంత శిఖామని అనే గొప్ప వీరశైవ సిద్దాంత గ్రంధాన్ని రచించారు)
అలాగే నాడు తెలంగాణా ప్రాంతమున నివసిస్తున్న నాటి వర్తమాన కవుల వివరాలనే వారు కోరారు – అందులో వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారూ కొందరు చేరారు, అలాగే వివరాలు పంపక మిగిలి పోయిన తెలంగాణా కవులూ చాలా మందే ఉన్నారు.
సెప్టెం 30, 2013 @ 16:12:03
వారిలో కొందరి మూలాలు సీమాంధ్రకు చెంది ఉండవచ్చు. అయితే ఏమిటట?
Some people who came from Seemandhra (not the tamil mudumbai) must have said something? So what? (meeru cheppina “ayithey emitata”) Does it mean all Seemandhrites are that way. When regionalism strikes the brain all circuits will dim out. That is what has been happening with the Tvadis.
Some people who are from Telangana said some things? So what? Does it mean all Telanganites are that way. We are wise (wisdom is different from education) enough to say No.
There are several great seemandhra people who worked for the upliftment of Telangana people. How many Telangana people have ever uplifted the lives of Seemandhra people. You can count none and if you are lucky may be 1% of the seemandhra people who did good things in your region.
You said once to someone that Potturi Venkateswara Rao, Volga etc are for Telangana. Are you greater than them?
I ask you, Dasaradhi Rangacharya in his open heart with RK has said he is not for Telangana state as it is only politically motivated. Are you greater than him?
I do not oppose Telangana but I oppose the hypocrisy and lies.
సెప్టెం 30, 2013 @ 20:35:21
రవి గారు! జయంత్ రెడ్డి గారు!
తెలంగాణా కవులపైన దురహంకార పూరిత వ్యాఖ్య చేసిన “సీమ” కవులు/రచయితలు ఎవరైనా ఉన్నారో… లేదో… నాకు తెలియదు. నన్ను అభిమానించిన, గౌరవించిన ప్రతి సీమాంధ్రుని నేను ఎంతో గౌరవించాను. నన్ను అవహేళన చేసిన ప్రతి సీమాంధ్రునికి నేను తగిన విధంగా బుద్ధి చెప్పి, నోరు మూయించాను. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఏ ప్రాంతంపైన ద్వేషం లేదు. అయితే సీమాంధ్రులలో అత్యధికులకు తెలంగాణ భాష పట్ల, సాహిత్యం పట్ల చిన్న చూపు ఉన్న విషయం వాస్తవం. నా చిన్ననాటి నుండి నా భాష, పాండిత్యాన్ని చూసి … నాది తెలంగాణ అయ్యుండదని నా తోనే వాదించిన వారున్నారు. అది ఎంత బాధాకరం! అది అలా ఉండనీయండి.
గోలకొండ కవుల సంచిక రూపొందడంలో నేపథ్యాన్ని నేను వివరించినా… తెలంగాణ ఉద్యమ కారణాలలో ఆ భాషా సాహిత్యాలపై చూపిన చిన్న చూపు కూడ ఒకటి అని నేను చెప్పినా … అది నేను వ్యక్తిగత అభిప్రాయాలతో చెప్పిందేమి లేదు. అది చరిత్ర! చరిత్రగా శాశ్వతంగా మిగిలిపోతుంది. అది ఒకరు చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. దీనికి వ్యక్తిగతంగా సజ్జనులైన కొందరు సీమాంధ్రులు బాధపడవచ్చు. వారి పట్ల నాకు సానుభూతి ఉంది. కాని దానికి మనమేమీ చేయలేం.
బ్రిటిష్ వారు భారతీయులను రెండు వందల ఏళ్ళ పాటు బానిసలుగా పాలించారు అన్నది చరిత్ర. అందులో సి.పి.బ్రౌన్, అనిబిసెంట్, ఆర్థర్ కాటన్ వంటి సత్పురుషులు కూడ ఉంటారు. కాని – “ఎవరో కొంత మంది పాలకులు తప్పు చేస్తే … అందరినీ అంటారా?” అని ఒక సామాన్య బ్రిటిష్ పౌరుడు బాధ పడితే ఏం చేయగలం? We can’t help it !
సెప్టెం 30, 2013 @ 21:15:53
మల్లికార్జున స్వామి గారు!
మీరన్నది “అక్షర సత్యం”!
అన్నీ అనుకూలంగా ఉన్న ప్రాంతంలో, అందునా పాలకులలోని అధికారులే (సి.పి. బ్రౌన్ వంటి వారు) స్వయంగా స్థానిక భాషా సాహిత్యాల అభివృద్ధికి పూనుకొన్నప్పుడు … మేము ఉద్ధరించామనుకొనే వారి కన్న – పాలకుల అనేక ఆంక్షల మధ్య, విభిన్న భాషల మధ్య ఒక భాషగా ఉండి, కనీసం విశ్వవిద్యాలయాలలో మాతృభాషను చదువుకొనే అవకాశం కూడ లేని ప్రాంతంలో తమ మాతృభాషను, సాహిత్యాన్ని వందల ఏళ్ళ పాటు కాపాడుకొన్న వారు ఏ రకంగా చూసినా గొప్ప వారే! ఈ కనీస ఇంగిత జ్జానం లేకుండా అలాంటి వారి పట్ల స్వభాషీయులే ఎవరైనా చిన్న చూపు చూసినా … అవహేళన చేసినా … వారికి సిగ్గు లేదనుకోవాలి. అంత కన్న మనమేం చెప్పగలం?
ఒక్క సారి ఆలోచించండి … ఒక కేశవ పంతులు నరసింహ శాస్త్రి, ఒక సురవరం ప్రతాప రెడ్డి, ఒక వట్టికోట ఆళ్వార్ స్వామి, ఒక వానమామలై వరదాచార్యులు, ఒక దాశరథి, ఒక కాళోజి, ఒక నారాయణ రెడ్డి వంటి సాహితీ మూర్తులు, ఇంకా ఎందరెందరో ప్రచారం లేక మరుగున పడిన మహనీయులు ఎలాంటి పరిస్థితులలో ఎంత పట్టుదలతో, ఎంతటి కృషితో అంతటి స్థాయికి ఎదిగి ఉంటారు? కష్ట పడి ఒక విశాలమైన ప్రాంతంలో తెలుగు భాషను, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆ మహనీయులకు ఏమిచ్చి తెలుగు భాష ఋణం తీర్చుకోగలదు?
ఏం చేస్తాం? మన ఆవేదన, ఆవేశం కొందరికి అర్థం కాదు!
అక్టో 01, 2013 @ 09:36:09
Phaneendra garu,
Meeru Andhra anna padhamu antha abhimanamu ga vadutharu kadha mari ekkada choosina Tvadhulalo aa padhamantey antha dhweshamu endhuku. Chivariki mee Karimnagar jilla Tvadhulu kooda adhey dhoranilo unnaru. Dasaradhi garu kooda Andhraku Telangana paryayamu (Andhra is a synonym of Telangana) kadha ani antha baga chepparu kadha ayina Tvadhulu adhi quote chesthu kooda Andhrulu idhi adhi ani antunnaru. Theliyaka leka dhweshamu aney oka karumabbu vari alochanani kammindha.
అక్టో 01, 2013 @ 17:23:06
>>తెలంగాణా కవులపైన దురహంకార పూరిత వ్యాఖ్య చేసిన “సీమ” కవులు/రచయితలు ఎవరైనా >>ఉన్నారో… లేదో… నాకు తెలియదు.
తెలియకుండా “సీమాంధ్రులు” అని సీమ వారిని ఆంద్రులను ఒకే గాటన కట్టి ఎందుకు ఆడిపోసుకుంటారు?
>>అయితే సీమాంధ్రులలో అత్యధికులకు తెలంగాణ భాష పట్ల, సాహిత్యం పట్ల చిన్న చూపు ఉన్న >>విషయం వాస్తవం.
తీరాంధ్రులకు ఉందేమో కానీ సీమ వారికి తెలంగాణా సాహిత్యకారుల పట్ల చిన్నచూపు లేదు. మీకు తెలియని వాటిని జెనెరలైజ్ చేయకండి.
అక్టో 01, 2013 @ 20:10:36
రవి గారు!
మీరు “గోలకొండ కవుల సంచికకు సంబంధించి, సీమ ప్రాంతీయులు ఎవరైనా తెలంగాణా కవులపైన దురహంకార పూరిత వ్యాఖ్య చేసారా?” అని అడిగితే … నాకు తెలియదు అన్నాను కాని, సీమ ప్రాంతీయులంతా పత్తిత్తులు అని నేను అనలేదే? అనేక సందర్భాలలో తాము తప్పుగా వాదిస్తూ, వాదనలో నిలువ లేక, నన్ను హేళన చేసిన వారిలో సీమ వారు ఉన్నారు. తీరస్థాంధ్రులు ఉన్నారు. ఒక తెలంగాణ వాడు ఉన్నప్పుడు… మీరు, మీరు ఒక్కటేగా! మళ్ళీ నేను కొత్తగా చెప్పాలా? గుండె మీద చేయి వేసుకొని చెప్పండి … “కాదు” అని! అంతెందుకు? 2009 కు ముందు వాడకంలో లేని “సీమాంధ్రులు” అన్న పదబంధాన్ని, ఆ తరువాత మీ రెండు ప్రాంతాల వారు కూడ బలుక్కొని రూపొందించుకొన్నదే కదా! మరి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమాయికంగా – ” “సీమాంధ్రులు” అని సీమ వారిని ఆంద్రులను ఒకే గాటన కట్టి ఎందుకు ఆడిపోసుకుంటారు? ” అని అడుగుతా రేమిటి?
అక్టో 01, 2013 @ 21:16:46
శ్యామలారాధ్యులు గారు!
’ఆంధ్ర’ శబ్దం ప్ర్రాచీన కాలం నుండి భాషాపరంగా తెలుగుకు పర్యాయ పదమన్నది తెలంగాణ సాహిత్యకారులందరికీ తెలుసు. ’ఆంధ్ర మహాభాగవతం’, ’కాకతీయాంధ్రులు’ అన్న పదబంధాలు తెలంగాణలో పుట్టినవే కదా! తొలి తెలుగు రాజులు ’ఆంధ్ర శాతవాహనులు’ మొదట 225 సంవత్సరాలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల రాజధానిగా పాలించాక, ఆ తరువాత ఇప్పటి సీమాంధ్రకు విస్తరించి అమరావతిని కొత్తగా రాజధానిగా నిర్మించుకొని మరో 225 సంవత్సరాలు పాలించారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందు నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్న తెలంగాణ ప్రజా సంఘాలలో ’ఆంధ్ర మహాసభ’ అగ్రగామి. 1956 కు ముందే హైదరాబాదులో తెలంగాణ ప్రజలు ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం’, ’ఆంధ్ర సారస్వత పరిషత్తు’ సంస్థలు ఏర్పర్చుకొని తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసారు.
సమస్యంతా సీమాంధ్రులు తామే అసలైన ఆంధ్రులమన్నట్టు వ్యవహరించడం, తెలంగాణ వారిని చిన్న చూపు చూడడం వలన వచ్చింది. దాని వలన తెలంగాణలోని సామాన్యులకు ’ఆంధ్ర’ శబ్దం పట్ల విముఖత ఏర్పడింది.
ఇప్పటికీ … నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్న ’ఆంధ్ర మహాసభ’ మా వాళ్ళదే అని నాతో వాదించే సీమాంధ్ర మూర్ఖులు ఉన్నారు. నేను వాళ్ళతో “మీరు ఆంధ్రా వాళ్ళు … మేము ఆంధ్రులం” అని చమత్కరించి, వదిలేస్తుంటాను.
సరే … ఇదంతా ఒక వాదం. ఇది క్రీ. పూ. 225 నుండి నేటి చరిత్ర వరకు సంబంధించినంత వరకు సముచితమే అని నాతో పాటు చాల మంది తెలంగాణ సాహిత్యవేత్తలు అంగీకరిస్తారు.
కాని క్రీ. పూ. వేల సంవత్సరాలకు ముందు ఆంధ్రులు వేరు … తెలగలు ( తెలంగాణ మూల పురుషులేమో! ) వేరు … అని ప్రసిద్ధ సీమాంధ్ర రచయిత శ్రీ ఏటుకూరి బలరామమూర్తి గారి వాదన. నేను దానిని కూడ అంగీకరిస్తాను.
అక్టో 01, 2013 @ 21:45:20
శ్యామలారాధ్యులు గారు!
పైన రవి గారి వాక్యం చూడండి – “సీమ వారిని ఆంద్రులను ఒకే గాటన కట్టి ….. ” అన్నారు. అంటే సీమ వారు ఆంధ్రులు కానట్టు. ఇదిగో ఈ confusion ఇప్పుడు తెలంగాణ వారిలో కూడ వ్యాపించింది. దీనికంతటికీ కారణం సకలాంధ్రులలో బలంగా ఉన్న అనైక్యత. కృష్ణా, గుంటూరు వాళ్ళు ఉత్తరాంధ్రులను అవమానిస్తారు. మళ్ళీ వాళ్ళంతా ఒక్కటై రాయలసీమ వాళ్ళను హేళన చేస్తారు. మళ్ళీ సీమాంధ్రులంతా ఒక్కటై తెలంగాణ వాళ్ళను చులకనగా చూస్తారు. ఇక ఎక్కడుంది సమైక్యత? ఉత్తరాంధ్రులు, సీమ వాళ్ళు ఈ అవహేళనలకు అలవాటు పడ్డారేమో! తెలంగాణ వాళ్ళు మాత్రం దేన్నైనా సహిస్తారు కాని … అవహేళనను కాదు!
అయినా ఇలా తగువులాడుకొంటూ ఎన్నాళ్ళు కలసి ఉంటారు? కుటుంబం పెద్దదైనప్పుడు విభజన సాధారణం. ఇప్పుడు అందుకే రాష్ట్ర విభజన సమర్థనీయం!
అక్టో 02, 2013 @ 07:29:13
రవి గారు!
ఇంతకీ … తెలంగాణా కవులపైన దురహంకార పూరిత వ్యాఖ్య చేసిన ’ముడుంబై’ కవి గారు తీరస్థాంధ్రుడని ఎలా నిర్ధారించారు? ఏమో! ఆయన సీమ ప్రాంతీయుడే కావచ్చు!
మీ వాదన వలన ఒక నిర్ధారణ మాత్రం జరిగింది – మీరు సీమ ప్రాంతీయులని!
అక్టో 02, 2013 @ 08:31:35
శ్యామలారాధ్యులు గారు!
“Dasaradhi garu kooda Andhraku Telangana paryayamu (Andhra is a synonym of Telangana) kadha ani antha baga chepparu” అన్నారు.
దాశరథి గారు “అంత బాగా చెప్పడం” కాదు … ఆవేదనతో చెప్పారు. సీమాంధ్రులు ’ఆంధ్ర’ శబ్దాన్ని 13 జిల్లాలకే పరిమితం అన్నట్టు వ్యవహరించడం … తెలంగాణ తొమ్మిది జిల్లాలను (ఇప్పుడు అవే పది జిల్లాలయ్యాయి) వేరుగా చూడడం … చూసాక ఆయన కలత చెంది ఇలా అన్నారు –
“కమ్మని నా తెలంగాణ తొమ్మిది జిల్లాలేనా?
సకలాంధ్రకు తెలంగాణ పర్యాయం కాదా?”
హృదయమున్న వాడికి ఆ కవితా పంక్తులలోని ఆవేదన అర్థం అవుతుంది!
దాశరథి అంతటి వారికే సీమాంధ్రుల వ్యవహారం ఆవేదన కలిగిస్తే … ఇక మా వంటి సామాన్య సాహిత్యకారుల సంగతేమిటి? ఇంకా తెలంగాణలో సామాన్యుల సంగతేమిటి?
మీరన్నట్టు తెలంగాణ సామాన్యులలో ఆంధ్ర శబ్దం పట్ల “ద్వేషం” కూడని దైనా, దానికి మూల కారణాలను కూడ తెలుసుకొని సరిదిద్దవలసి ఉండింది. కాని చాల మంది సీమాంధ్రులలో ఇప్పటికీ ఆ మార్పు కనిపించదు.
అంతెందుకు? అంతర్జాలంలోని “ఆంధ్ర, తెలంగాణ వాదనల”లో సైతం చాల మంది సీమాంధ్రులు అవహేళనలతో జయిద్దామని చూసేవారే కానీ … దశాబ్దాలుగా జరుగుతున్న పొరబాట్లను ఆత్మీయంగా అర్థం చేసుకొన్నవారు ఎంత మంది?
గతంలో… జరిగిన చర్చలలో నా అభిప్రాయాలను నిష్పక్షపాతంగా చెప్పినప్పుడు – నన్ను “తెలబాన్” అని దూషించి, “నువ్వెందుకు కాల్చుకొని చావడం లేదు?” అని ప్రశ్నించిన సీమాంధ్రులు లేరా?
నాకే కాదు … ఇలాంటి ఎన్నో మానసిక గాయాలయిన తెలంగాణ సామాన్య ప్రజలు వాటిని సులువుగా మరవగలరా? ప్రతిక్రియగా వారూ దూషించి సీమాంధ్రులను బాధిస్తారు.
ఈ ద్వేషాలను ఇలా పెంచుకొంటూ కలసి ఉండే కన్న, విడిపోయి సుహృద్భావాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయడం ఉత్తమం!
సెప్టెం 04, 2015 @ 06:47:29
yes you said correct sir
అక్టో 28, 2013 @ 15:23:22
sri Dr Acharya phanindra garu,
Namaskaramulu.This blog is giving very valuable information about telugu kavulu and more over about golkonda kavulu.
The main problem is due to political leaders who ruled the state.The main communal groups centralised political power in their families and community.With political power they centralised economic power in their families.These political
families earned huge wealth with political power and enjoying the benefits.The BC,SC,ST,MINORITIES AND ECONOMICALLY poor people has no share in that wealth. The wealth was centralised at hyderabad. All other districts in andhra,royalaseema,telangana area
are in the same economic status.
More over three social communities are controlling all the p;litical power in three areas.These three communities only catch pwer in united or bifurcated state.
Unless the downtodden people unite and fight against political corrupt rulers there is no possibility for a change..
This can only be achieved by Telugu writers and poets.
dhanyavadamulu
అక్టో 29, 2013 @ 07:37:32
Sri M.L.Narasimha Rao garu!
I agree with your opinion to some extent. But you have to agree with the opinion of Dr. B.R. Ambedkar. He said, Small States Structure is the solution for the above problem.
Thank you very much!
జన 16, 2014 @ 13:10:12
ఫణీంద్ర గారూ, మీ స్పూర్తితో మరియు మీరు సాయి గారు ఇచ్చిన సాయం వాళ్ళ, నేను కూడా గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడ్డ మా తాతాజీ కవిత్వాన్ని వెతకగలిగాను.
http://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html
Thanks a lot sir!
ఫిబ్ర 04, 2014 @ 15:24:00
Dear Sri Dr.Acharya Phaneendra garu,
We are looking for the writings of బండి_వెంకట్రామిరెడ్డి , who belongs to kandukur,Khamam-dist.If you come acorss these books ‘కైకేయి కామ్యసిద్ది’ (పౌరాణికం) , ‘సుందరీ తిలకం’ , Kindly help to send us the details @ dpbandi10@gmail.com. We are planning to re-print/Digitalize those books.
Also,Are these books books availble with you? Please advise.
దీపాల పిచ్చయ్య శాస్త్రి ‘సాహిత్యసమీక్ష,
Golkonda kavula sanchika
Details of the writer:
https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF
Page from Golkonda kavula sanchika:
https://drive.google.com/file/d/0B85YUX1rLF-hSnNVRFZoQmZaa184N21VNm9MSEk2VG1NZEFv/edit?usp=sharing
Thank you Sir,
Regards
Durga Prasad
నవం 21, 2018 @ 23:29:34
Namaskaram sir
NSA Peru rajashekar reddy Naukri charutra patla Charla is tam undhi. Dayachesi Karimnagar Jill a charithraku sambandhinchina books evaina untested suggest cheyagalaru. Wiki lo mariyu Lonnie pusthakalalo vedhikanu Kani poor this charithra dorakatam ledu. Udaharanaku korutla lo unna gadi mariyu Kota pakkana manchineeti Bavi mariyu Polasani poulasthiswaralayam jagityala Kota mariyu konagattu damapuri devalaya charithra lantivi dayachesi Sahara padagalaru