తెలంగాణ శిష్ట వ్యావహారికం – చర్చ

2007 జూన్ మాసంలో ’మూసీ’ మాస పత్రికలో ప్రచురితమైన “తెలంగాణ మాండలికంలో శిష్ట వ్యావహారికం లేదా?” అన్న నా వ్యాసం పై, ఆ తరువాత వచ్చిన జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల సంచికలలో విశేషమైన చర్చ జరిగింది. కొన్ని లేఖలలో సీమాంధ్రుల ఆక్రోషం, ఉక్రోషం తప్ప వస్తువులో సత్తువ కనిపించలేదు. వాటిని వదిలేసి, పండితులైన శ్రీ  పాణ్యం శేషశాస్త్రి గారి లేఖను, జగత్ప్రసిద్ధులైన కీ.శే. ఓగేటి అచ్యుత రామశాస్త్రి గారి కుమార్తె డా. ఓగేటి ఇందిరాదేవి (నాలుగయిదేళ్ళ క్రితం పరమపదించారు) గారి లేఖను, వాటికి నేనిచ్చిన సమాధానాన్ని ఈ టపాలో ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

tm1

tm2

tm3

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. M.V.Ramanarao
  సెప్టెం 26, 2013 @ 18:56:36

  ప్రతి ప్రాంతంలోను గ్రామ్య భాషకి,శిష్టవ్యావహారిక భాషకీ తేడా ఉంటుంది.ఉదాహరణకు,విశాఖపట్నంలో విద్యావంతులు మాటాడే భాషకి,అదే జిల్లాలో పల్లెల్లో చదువురాని వారి భాషకి భేదం ఉంటుంది.శిష్టవ్యవహారికంలో కూడా ఒక ప్రాంతానికీ ,మరొకప్రాంతానికీ సామ్యం,భేదం రెండూ ఉంటాయి.ఇదేమీ అంత వివాదాస్పదమైనవిషయం కాదు.

  స్పందించు

 2. Dr.Acharya Phaneendra
  సెప్టెం 26, 2013 @ 21:10:20

  రమణారావు గారు!
  కాని అది గ్రహించని సీమాంధ్రులు (ఇందులో పండితులుగా పేర్కొనబడుతున్న వారు కూడ ఉండడం దురదృష్టకరం) అనేకులు తెలంగాణ భాషను అవహేళన చేయడం, తెలంగాణ సాహిత్యాన్ని చిన్నచూపు చూడడం, తెలంగాణ కవులకు సమాన గౌరవాన్ని కల్పించకపోవడం – తెలంగాణ సాహితీవేత్తలను, ప్రజలను దశాబ్దాలుగా బాధించిన విషయం వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు కూడ ముడుంబ నరసింహాచార్య అనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక కవి “తెలంగాణాలో కవులున్నారా?” అని అవమానిస్తే… సురవరం ప్రతాపరెడ్డి వంటి మహోన్నత సాహితీమూర్తి (తెలుగులో ప్రప్రథమ కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత) ఎంతో బాధపడి, ఆనాటి తెలంగాణ ప్రాంతంలోని నాలుగు వందల మంది కవుల వివరాలతోబాటు వారి కవితలను కూడ చేర్చి, “గోల్కొండ కవుల సంచిక” ను ప్రచురించి తగిన సమాధానం చెప్పిన విషయం తెలుగు వారి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడ అత్యధిక సీమాంధ్రులు (కొందరు కాకపోవచ్చు) ఈ పద్ధతిని మార్చుకోలేదు. తెలంగాణ వేర్పాటు వాదానికి ఇదే ప్రధాన కారణమని చెప్పలేం గాని, ఇదీ ఒక కారణమన్నది జగమెరిగిన సత్యం. 2007 లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమవుతున్నప్పుడు ఆనాటి ఘర్షణ వాతావరణం… నా చేత ఇరువర్గాలకు అసలైన భాషాపరమైన సత్యాలను వివరించేందుకు ఈ వ్యాసాన్ని వ్రాయించింది.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించు

 3. M.V.Ramanarao
  సెప్టెం 27, 2013 @ 13:14:06

  ఆచార్య ఫణీంద్ర గారూ,ఒక్క తెలంగాణా భాషాసాహిత్యాలనేకాదు, కళింగసీమ,రాయలసీమ భాషాసాహిత్యాలను, సంస్కృతులను కూడా,కృష్ణా,గుంటూరు,ఉభయగోదావరి జిల్లాలవారు హేళన చేసేవారు.కాని ఇప్పుడా అతిశయం తగ్గిపోయింది లెండి.అందువలన ఆ సంగతి పట్టించుకోనక్కరలేదు.’ముంజేతి కంకణమునకు అద్దమేల?'(అందుకే మళ్ళీ గిడుగు,గురజాడ ,శ్రీశ్రీలగురించి,పెద్దన,బట్టుమూర్తి,కృష్ణదేవరాయల గురించి వ్రాయడం లేదు.

  స్పందించు

 4. Dr.Acharya Phaneendra
  సెప్టెం 28, 2013 @ 08:40:08

  రమణారావుగారు!
  నేను ఎప్పుడు ఏ సీమాంధ్ర సాహిత్యవేత్తతో ఈ ప్రస్తావన చేసినా – “ఒక్క తెలంగాణా భాషాసాహిత్యాలనేకాదు, కళింగసీమ, రాయలసీమ భాషాసాహిత్యాలను, సంస్కృతులను కూడా,కృష్ణా,గుంటూరు,ఉభయగోదావరి జిల్లాలవారు హేళన చేస్తారు” అంటారు. ఇది నన్ను చాల ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇదెలా ఉందంటే – “మీవాడు మా వాణ్ణి మర్డర్ చేసాడు” అంటే, “మీ వాణ్ణే కాదు… మా వాళ్ళను కూడా మర్డర్ చేసాడు లెండి. దానిని పెద్దగా పట్టించుకోకండి.” అన్నట్టుంది. “పట్టించుకోవాలా.. వద్దా…” అన్నది బాధ పెట్టినవాడు చెప్పడం కాదు. బాధ పడ్డవాడు నిర్ణయించుకొంటాడు. సహజంగా ఆత్మాభిమానం, పౌరుషం అధికంగా గల తెలంగాణ పౌరులు దేనినైనా సహిస్తారు కాని, అవహేళనను కాదు. మీరన్న దానిని బట్టి మీ ప్రాంతీయులకు ఆ లక్షణం అంతగా లేదేమో… అనుకోవలసి వస్తుంది మరి!
  ఇక ఇక్కడ గిడుగు, గురజాడ, శ్రీశ్రీ, పెద్దన, భట్టుమూర్తి, కృష్ణదేవరాయల ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కాదు. దానిని బట్టి “విషయాన్ని సూటిగా చర్చించలేనప్పుడు ఇలాగే పక్క దారులు పట్టించాలని ప్రయత్నిస్తుంటారు” అని భావించవలసి ఉంటుంది.

  స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: