ఎన్నో అచ్చ తెనుగు పదాలను కాపాడుకొంటూ వస్తున్న తెలంగాణ మాండలిక భాష!

రెండు మూడు రోజుల క్రితం ఒకటి రెండు బ్లాగులలో తెలంగాణ తెలుగు(మాండలిక) భాషపై వ్యాసం, ఖండన చూసాక – 2007 లో “మూసీ” సాహిత్య మాస పత్రికలో నేను వ్రాసిన వ్యాసం గుర్తుకు వచ్చింది. ఆ వ్యాసాన్ని సాహిత్యాభిమానుల కొరకు ఈ బ్లాగు ద్వారా పునః ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

tm1

tm2 tm3

tm4

ప్రకటనలు

12 వ్యాఖ్యలు (+add yours?)

 1. కోడీహళ్లి మురళీమోహన్
  సెప్టెం 22, 2013 @ 06:44:17

  ఉద్యమానికి ఆవేశం ప్రధానం.
  భాషకు ఆలోచన ప్రధానం.
  బాగా చెప్పారు/చెప్పేరు/చెప్పినారు.

  స్పందించండి

 2. తాడిగడప శ్యామలరావు
  సెప్టెం 22, 2013 @ 08:36:05

  గోదావరిజిల్లాల్లో కూడా ఆనపకాయ అంటారు సొరకాయను.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  సెప్టెం 22, 2013 @ 10:08:26

  మురళీమోహన్ గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  సెప్టెం 22, 2013 @ 10:08:48

  శ్యామలరావు గారు!
  ఇలాంటి చర్చలు ఆ మాస పత్రికలో కూడ తరువాతి సంచికలలో చాల జరిగాయి. వాటన్నిటినీ ప్రచురిస్తాను. సమాధానం మీకు వాటిలో దొరుకుతుంది.

  స్పందించండి

 5. Jai Gottimukkala
  సెప్టెం 22, 2013 @ 15:44:39

  తెలంగాణా భాషలో ఉరుదూ ప్రభావం ఎక్కువుందని అనుకోవడం కేవలం అపోహ మాత్రమె. అన్ని ప్రాంతాల తెలుగులో ఉరుదూ మాటలు దాదాపు సమానం.

  తెలంగాణా భాషలో ఇంకెక్కడా కనిపించిన అచ్చ తెలుగు పదాలు కోకొల్లలు. మీరు చెప్పిన ఏరాలు లాంటి వాటితో బాటు, ఆమ్మ (పెద్దమ్మ), బర్రె, అక్కర, ఆగం, అంగీ, లాగు లాంటివి వేలాది పదాలు ఉన్నాయి.

  కొంతవరకు రాయలసీమలో ఇదే పోకడ ఉంది. వాకిలి, బిర్రీన (తొందరగా), ఎనుము లాంటి పదాలు ఇంకెక్కడా వాడరు.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  సెప్టెం 22, 2013 @ 19:42:48

  జై గొట్టిముక్కల గారు!
  1860 వరకు నిజాం పాలనలోనే ఉండడం వలన సీమాంధ్ర ప్రాంతాలలో కూడా ఉర్దూ పదాలు ఉన్నాయి. అవి ఉర్దూ పదాలని తెలంగాణవారు విడమరచి చెప్పేవరకు తెలియని సీమాంధ్రులెందరినో నేను చూసాను. అయితే తెలంగాణ జిల్లాలలో ఉర్దూ ప్రభావం కొంచం ఎక్కువ అని అంగీకరించక తప్పదు. మొన్న మొన్నటి వరకు హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉండేది. “దవాఖాన, దావత్, దోస్త్, బంద్ చేయ్, ఖుల్లా పెట్టు, షెరీక్ అయిన” వంటి ప్రయోగాలు తెలంగాణలోనే ఇప్పటికీ ఎక్కువగా వినిపిస్తాయి. వీటినే కదా సీమాంధ్రులు అవహేళనగా పలికి వెటకారమాడేది. అయితే తెలంగాణ వారు పరభాషా పదాలను తెలిసి యథాతథంగా ప్రయోగిస్తారు. కాని సీమాంధ్రులు పరభాషా పదాలను మూల రూపాలకు అందనంతగా మార్చి, అవి తెలుగు పదాలనుకొని భ్రమిస్తారు. మా ఆఫీసులో జరిగిన ఒక సంఘటనను వివరిస్తాను వినండి.
  మా మిత్రుడొకడు ఆరోగ్యం బాగా లేదని ఆఫీసుకు ఆలస్యంగా వచ్చాడు. నేను ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొంటున్నాను. అంతలో ఒక సీమాంధ్ర మిత్రుడు వచ్చి ఆయనను “దావ్ఖానకు బొయినవ లేదా?” అంటూ వెటకారం ఆడాడు. అసలే అనారోగ్యంతో ఉన్న మా మిత్రుడు నొచ్చుకొన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఆ సీమాంధ్రునితో- “ఆయన దవాఖాన అంటాడు సరే! తెలుగులో మీరే మంటారు దానిని?” అన్నాను. ’ఆసుపత్రి’ అందామనుకొన్న ఆయన ఎందుకో కంగు తిని, “వైద్య శాల” అన్నాడు. “మీరు వ్యవహార భాషలో అలా అనరు. అన్నా అది తెలుగు కాదు… సంస్కృతం. తెలుగులో చెప్పండి.” అన్నాను. మరింత నీరసపడి “చికిత్సాలయం” అన్నాడాయన. “అదీ సంస్కృతమే. తెలుగులో చెప్పండి.” అన్నాను. అప్పుడు కాస్త సంశయిస్తూ – “ఆసుపత్రి” అన్నాడు. “ఆసుపత్రి తెలుగేనా?” అన్నాను. “తెలుగే కదా!” అంటూ నీళ్ళు నమిలాడు ఆయన. “అది తెలుగు కాదు. HOSPITAL అన్న ఆంగ్ల పదాన్ని నలిపి, కుదిపి, వంచి, కుంచించి, పిప్పి చేసి మీ సీమాంధ్రులు ’ఆసుపత్రి’గా చేసారు.” అని వివరించాను. ఇతరులను సునాయాసంగా హేళన చేసే ఆ పెద్ద మనిషికి నా మాటలు వినగానే చాల కోపం వచ్చింది పాపం! “అసలు దానికి తెలుగు పదమే లేదంటారా?” అన్నాడు ఆవేశంగా. “ఉందో… లేదో… తరువాత. మీరు ఇంతకు ముందు ’అసలు’ అన్న పదం అన్నారే… అది ఏ భాషా పదం?” అని అడిగాను నేను. ఆయన గొంతును పాతాళంలోకి జార్చి- “తెలుగే కదా!” అన్నాడు. “కాదు. అది ’అసల్’ అన్న ఉర్దూ పదం!” అని చెప్పాను. ఆయన ముఖంలో రక్తపు చుక్క లేదు. “నాకు చాల వర్క్ ఉందండి.” అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
  కాబట్టి తెలంగాణ మాండలికంలో ఉర్దూ పదాలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన మనమేమీ న్యూనత పడనక్కర లేదు. అనేక భాషల జ్ఞానం ఉన్నందుకు గర్వించాలి!

  స్పందించండి

 7. Matam Mallikharjuna Swamy
  సెప్టెం 22, 2013 @ 20:44:39

  వింటే తెలంగాణా పాల్కురికి సోమనాథుని నోటనే వినాలి వినసొంపైన అచ్చతెలుగు తేనే మాటలు. చాలా శ్రమించి రాశారు – ఎంతో అమూల్యమైన మాటలు చెప్పారు.

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  సెప్టెం 22, 2013 @ 23:14:18

  మల్లికార్జున స్వామి గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

 9. hari.S.babu
  సెప్టెం 23, 2013 @ 17:40:55

  మీ వ్యాసం పూర్తిగా చదివాను.బాగుంది. యెక్కడ పూర్తి వాదుక భాషని వాడాలి, యెక్కడ శిష్ట వ్యావహారికం వాడాలి అనే భాగం చాలా చక్కగా విశ్లేషించారు.పైన ఆ పెద్ద మనిషి తో పోట్లాట కూదా అదిరింది.

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  సెప్టెం 23, 2013 @ 20:33:26

  hari.S.babu garu!
  thank you!

  స్పందించండి

 11. గుండు మధుసూదన్
  సెప్టెం 26, 2013 @ 08:14:33

  డా. ఆచార్య ఫణీంద్రగారికి నమస్కారాలు. మీరు తెలంగాణ అచ్చ తెలుగు పదాలగూర్చి చర్చిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఉన్నత స్థాయికి చేర్చారు. అచ్చ తెలుగు పదాలు స్వచ్ఛమైన తెలంగాణ మాండలికం లోనే ఉన్నాయి. ఇప్పటికీ పల్లెల్లో మనం వినవచ్చు. సజీవమైన మన భాషను హేళన చేసే సీమాంధ్రులకు పెద్ద చెంపపెట్టు మీ వ్యాఖ్య! ఇలాంటి చర్చలే మన ఆత్మగౌరవాన్ని కాపాడతాయి. అభినందనలతో…

  భవదీయ మిత్రుడు,
  గుండు మధుసూదన్

  స్పందించండి

 12. Dr.Acharya Phaneendra
  సెప్టెం 26, 2013 @ 21:15:17

  గుండు మధుసూదన్ గారు!
  మీకు అనేక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: