సీమాంధ్ర సోదరులారా!

tel6

హైదరాబాదుతో 50 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకోలేక మీరెంత బాధ పడుతున్నారో మాకు తెలుసు. కాని కుటుంబాలు విడిపోతున్నప్పుడు కూడ ఇలాంటి బాధలు తప్పవు. 50 ఏళ్ళుగా మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి గాని మానసిక ఐక్యత కుదరనే లేదు. కాబట్టి ఇక విడిపోక తప్పదు.కాని విడిపోయే ముందు కూడ ఇంకా కుయుక్తులేనా? మాకు దక్కని హైదరాబాదు మీకూ దక్కకూడదు అన్న దుష్ట బుద్ధి తగునా? భౌగోళికంగా మా గుండెకాయగా ఉన్న హైదరాబాదును మానుండి ఎలా వేరు చేయమనగలుగుతున్నారు? పోని! 1956లో హైదరాబాదును మీరు మద్రాసు రాష్ట్రం నుండి పట్టుకొచ్చారా ? లేదే? అప్పటికే హైదరాబాదు మాది. అప్పటికే అసెంబ్లీ భవనాలు, హైకోర్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి లాంటి అన్ని వసతులున్న మా రాజధాని. 50 ఏళ్ళు రాజధానిగా ఉన్నందుకే మీరు వదులుకోలేకపోతే … మాకు హైదరాబాదు 400 ఏళ్ళుగా రాజధాని! మేమెలా వదులుకొంటాం? 50 ఏళ్ళుగా కలసి చేసుకొన్న అభివృద్ధి అని మీరు వాపొతున్నారు. మరి మేము 400ల ఏళ్లుగా చేసుకొన్న అభివృద్దే! దాన్ని ఎలా వదులుకోగలం? అంత సులువుగా కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని, లేదా వేరే రాష్ట్రం చెయ్యాలని అనడానికి మీకు మనసెలా ఒప్పింది? తెలుగువాళ్ళే నిర్మించిన చెన్నపట్నంపై హక్కును సాధించుకోలేక తమిళులకు అప్పగించి వచ్చారే? ఇప్పుడు హైదరాబాదుపై అంత హక్కుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అందులో న్యాయం ఉందా? 50 ఏళ్లుగా అప్పటికే మాదైన మా ఇంట్లో మీరు మాతో ఉండడానికి ఒప్పుకొన్నాం. ఆ ఇంటికి మీరు రంగులు వేయించి ఉండవచ్చు. ఫర్నిచర్ సమకూర్చి ఉండవచ్చు. అంతమాత్రాన విడిపోయేటప్పుడు ఆ ఇల్లే మీదవుతుందా? లేక మాకూ దక్కకుండా చేసిపోతారా? ఎంత దురాలోచన అది? గుజరాతీలు బొంబాయి గురించి ఇలాగే పేచి పెట్టినప్పుడు అంబేడ్కర్ “ఎప్పటికైనా ఓనర్ ఓనరే! టెనెంట్ టెనెంటే!” అన్న విషయం మీ మేధావులకు తెలియనిదా? హైదరాబాదులో ఉండే సీమాంధ్రులు ఇక ముందు తెలంగాణ పౌరులుగా ఇక్కడే ఉండిపోవచ్చు. సీమాంధ్ర ప్రాంతంలో ఉండే సోదరులు కూడ మా ఆత్మీయులుగా వస్తూ పోతూ ఉండవచ్చు. భారత రాజ్యాంగమే ఈ హక్కును ప్రతి భారతీయ పౌరునికి కల్పించింది. ఇప్పుడున్న ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించుకోవాలి గాని, విడిపోయే ముందు హైదరాబాదును మాకు కాకుండా చేసి వైషమ్యాలు పెంచుకోవచ్చా? కాస్త ఆలోచించండి.

namaste

– సగటు తెలంగాణవాది ప్రతినిధిగా

డా.ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

16 వ్యాఖ్యలు (+add yours?)

 1. Zilebi
  ఆగ 04, 2013 @ 07:16:44

  “భావావేశం పొంగి పొరలి టపా అయి పారంగ
  తెలంగాణా యే ఎగసేన్ మదీయ హృది తరంగాలుగా
  నా టపా అయ్యే నా హృది ఘోషయై
  వేడి గ నానా ‘రసాల్’ పంచగా
  రావే ‘తెలంగాణ తన్హాయీ ‘
  ‘తేల’ రస ధారా స్నాన పానంబులన్ !”

  జిలేబి

  స్పందించండి

 2. sreerama
  ఆగ 04, 2013 @ 08:18:03

  sodarulara antnae dwesham, visham kakkutunnaaru. meere randi, randi ani pilichi, manam kalisundaam antae, maa aasthulu ammukni mana raajadhhani, mana sontha vuru, mana telugu vaallu ani nammi vasthe, maa sarvaswam akkade dhara posthe,ippudu pondi, idi maadi maatrame, mmeku hakku laedu, maaku anni buildings eppudo vunnayi, IT industry kooda Nizam kaalamlone vundi anae sthaayilo abaddhaalu pracharam chesi, dongalu ani titti pommanadam bhavyama. Nizam enni buildings kattina, daanilo telangana prajalaku entha bhaagaswamyam vundo, telangana prajalni aa dari daapulaki kooda raanivvalaedu annadi jagamerigina satyam

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  ఆగ 04, 2013 @ 08:26:37

  చేదెక్కిన ’జిలేబీ’!

  ’ఆంధ్రము’ తెలుగు భాషకు పర్యాయ పదం.
  ’తెలంగాణము’ ఒక ప్ర్రాంతం.
  ఇది ఎరుగని అజ్ఞానం నీది.

  ఈ వెటకారమ్ము, నహం
  భావము, నీ యమిత మూర్ఖ వాచాలతయే
  మా వంటి వారి హృదులం
  దీ “వేర్పడు” భావమును మరింతయు బెంచున్!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  ఆగ 04, 2013 @ 09:29:56

  శ్రీరామ గారు!
  ఇలాంటి చర్చలు పన్నెండేళ్ళుగా జరిగి… జరిగి… మీ వాదనను ఏ జాతీయ పార్టీ సమ్మతించక, జాతీయ, అంతర్జాతీయ మేధావులు (అంతెందుకు ? చాలా మంది సీమాంధ్ర మేధావులు కూడా) అంగీకరించక, మన రాష్ట్ర పార్టీలు కూడ లోలోపల ఎన్ని రాజకీయాలు చేసినా… బహిరంగంగా సమర్థించలేక “మేము తెలంగాణకు అనుకూలమే” అంటేనే గదా కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది. అంతెందుకు? నా బ్లాగులోనే ఇదివరకు ఇలాంటి చర్చలు ఎన్నో జరిగాయి. అదేం తెలియనట్టు ’రామాయణమంతా విని రామునికి సీత ఏమవుతుంది?’ అన్నట్టుగా ఉన్నాయి మీ మాటలు.
  “Nizam enni buildings kattina, daanilo telangana prajalaku entha bhaagaswamyam vundo, telangana prajalni aa dari daapulaki kooda raanivvalaedu annadi jagamerigina satyam”
  అన్నారు.
  అందుకే గదా … అప్పుడు కూడ ప్రపంచ చరిత్రలోనే విశిష్టంగా పేర్కొనే ఉద్యమమైన ’తెలంగాణ రైతాంగ పోరాటం’ సలిపి తెలంగాణకు స్వాతంత్ర్యం సాధించుకొన్నాం. ఆ తరువాత అనేక సంవత్సరాలు మా తెలంగాణ వ్యక్తి ’బూర్గుల రామకృష్ణారావు’ ఇదే అసెంబ్లీ నుండి ముఖ్యమంత్రిగా పరిపాలన సలిపిన జగమెరిగిన సత్యం మీకే తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది.
  “meere randi, randi ani pilichi, manam kalisundaam antae…”
  ఇదొక పచ్చి అబద్ధం అలా అయితే మీరు ఎందుకు అన్ కండిషనల్ గా వచ్చి చేరారో.. మేము ఎందుకు మా రక్షణ కొరకు పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోన్నామో … మీరే చెప్పాలి. ఊరికే ఆవేశపడడం కాదు. లైబ్రరీలకు వెళ్లి 1953 – 1956 మధ్య మీ సీమాంధ్ర మహా సంపాదకుల ఆధ్వర్యంలో వెలువడిన ’ఆంధ్ర పత్రిక’ ప్రతులను తిరగేయండి. చరిత్ర తెలుస్తుంది.
  మేం ఎన్నడూ మీ మీద విషం కక్కలేదు. మీ నాయకులు మాతో కుదుర్చుకొన్న ఒప్పందాలను ఉల్లంఘిస్తే నిలదీసి, పోరాడి విజయం సాధించాం. మీరే (అందరూ కాకపోయినా చాల మంది) మా మీద వెటకారాలు వేళాకోళాలు ఆడి, ఏళ్ళ తరబడి అవమానించి మా హృదయాలను గాయపరిచారు. తాజా ఉదాహరణగా పైన ‘జిలేబీ’ వ్యాఖ్యను చూడండి.

  స్పందించండి

  • Prasad
   ఆగ 04, 2013 @ 10:37:35

   తెలంగాణా అంటే అర్ధం తెలుగు దేశము అని అర్ధం. ఇక తెలంగాణ భారత్ యూనియన్ లొ కలిసినది సర్దార్ పటెల్ పోలిస్ చర్య “ఆపరషన్ పోలొ” తో, తెలంగాణా ఆంధ్రప్రదెశ్ లో కలిసినది తెలంగాణా అసెంబ్లి తేర్మానంతోనే. మరి. ఆంధ్రప్రదెశ్ గా విలీనం చెందినపుడు మహరాష్ట్రా, కర్ణాటకలలో కలిసిపోయిన ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడరు. చారిత్రకంగా మూడు ప్రాంతాల తెలుగు వారు 18 వ శతాబ్ధం మద్యభాగం నుండి 1956 వరకు సుమారు 200 సంవత్సరాలు మాత్రమే విడిగా ఉన్న్నరు. నిజాంపాలకులు (నిజాం పాలకులు ఉజ్బకిస్తాన్ దేశం నండి భారత్ కు వలసవచ్చిన వారు) వారి స్వార్ధం కొరకు సీమాంధ్ర ప్రాంతాలను బ్రిటిష్ వారికి ధారదత్తం చేసినపుడు మొదటి సారిగా విభజించబడ్డారు. ఇప్పుడు ఒక ఈటాలియన్ తన తనయుడి పదవ్కోసం మరొకసారి విడదీయబొతోంది. హైదరాబు నగరాన్ని నిర్మించిన కులికుతుబ్షాహి వసంశస్తుల పాలనో కూడా తెలంగాణా సీమాంధ్రా ప్రాంతాలు కూడా భాగమే అన్నది చారిత్రిక సత్యం,

   స్పందించండి

   • Jai Gottimukkala
    ఆగ 05, 2013 @ 07:21:07

    @Prasad:

    “తెలంగాణా ఆంధ్రప్రదెశ్ లో కలిసినది తెలంగాణా అసెంబ్లి తేర్మానంతోనే”

    తీర్మానం ప్రవేశం పెట్టారు కానీ వోటింగ్ జరపలెదు. ఉండవల్లి తదితరులు చెబుతున్న మద్దతుదారుల సంఖ్యకు (వోట్లు కావు) ఆధారం కెవీ నారాయణ రావు గారు రాసిన పుస్తకం. ఆ పుస్తకానికి ఆధారం ఒక పత్రికలలో వచ్చిన వార్త. ఇంతకీ వోటింగ్ జరగకుండానే సదరు పాత్రికేయునికి ఆ సంఖ్య దొరికిందో బ్రహ్మ రహస్యం.

    ఇంతకీ అదేదో మహా గ్రంధమనుకునేరు సుమా. అలా అయితే పప్పులో కాలేసినట్టే. అది నారాయణరావు గారి పీహెచ్డీ థీసిస్ మాత్రమె.

    ఇకపోతే హైదరాబాద్ అసెంబ్లీ కొన్నేళ్ళ ముందే విశాలాంధ్ర కావాలనే తీర్మానాన్ని తిరస్కరించింది. ఈ విషయం పాపం ఉండవల్లి గారికి తెలియదో లేక గుర్తు రాదో?

 5. Dr.Acharya Phaneendra
  ఆగ 04, 2013 @ 12:19:45

  ప్రసాద్ గారు!
  “తెలంగాణా అంటే అర్ధం తెలుగు దేశము అని అర్ధం.” అన్నారు. నిజమే! మరి అంత చక్కని తెలుగు పదాన్ని కాదని, ఆనాడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలిపి ఏర్పర్చిన ఉమ్మడి రాష్ట్రానికి “తెలంగాణ” పేరు పెట్టమంటే ఎందుకు రాద్ధాంతం చేసారో … చెప్పగలరా?
  ’ఉత్తర ప్రదేశ్’, ’మధ్య ప్రదేశ్’ లాగా ’ఆంధ్ర ప్రదేశ్’ అన్న హిందీ ప్రభావం గల పేరు ఎవరి వల్ల పెట్టారో అది వివరించరే?
  మీరు చరిత్ర బాగానే చెప్పారు. మా ఉద్యమ ఫలితంగా ఈ మధ్య వాస్తవాలు తెలుసుకొంటున్నారు. ఇవన్నీ పదేళ్ళ క్రితం మేం వివరిస్తుంటే విన్నారా?అప్పుడు తెలంగాణ పదం వాడితేనే దోషం అన్నట్టుగా చూసారే?
  ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఇంకా చాల వాస్తవాలు తెలుసుకోవాలి మీరు. నెహ్రు చెప్పారని మోజువాణీ ఓటుతో తీర్మానం చేసారని, ఆ తీర్మానంతో బాటు పంపిన లేఖలో ఆనాటి మా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఇది తెలంగాణకు సూసైడల్ నోట్ అని వ్రాసిన సంగతి మీ అధ్యయనంలో కనిపించలేదా? ఈనాడు విభజన సమయంలో అధిష్ఠానం దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి ఎదుర్కొంటున్న పరిస్థితినే, ఆనాటి ఆంధ్రా లాబీయింగ్ ఫలితంగా నెహ్రు దగ్గర బూర్గుల ఎదుర్కొన్నారని తెలుసుకోండి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడిన హైదరాబాద్ సిటీ కాలేజ్ విద్యార్థులలో ఏడుగురు పోలీసు ఫైరింగులో మరణించారన్నది కూడా చరిత్రే. రాష్ట్రం ఏర్పడ్డాక పెద్ద మనుషుల ఒప్పందానికి సీమాంధ్ర నాయకులు తూట్లు పొడిచారన్నది చరిత్రే.దొంగ ముల్కీ సర్టిఫికేట్లతో ఎంతోమంది సీమాంధ్రులు అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలలో చేరారన్నదీ చరిత్రే. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ముల్కీ రూల్స్ సముచితమే అని తీర్పునిస్తే, దానిని సీమాంధ్ర నాయకులు దౌర్జన్యంగా రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయించింది చరిత్రే.
  ఆపైన 610 జి.ఒ ను, గిర్గ్లాని కమిషన్ రిపోర్టును సీమాంధ్ర నాయకులు అమలు కాకుండా చూసిందీ చరిత్రే. ఈ సీమాంధ్ర ప్రాంతమే ఒకప్పుడు విభజనోద్యమం నడిపి, ఇప్పుడు మాట మార్చి సమైక్య ఉద్యమం నడుపుతున్నదీ చరిత్రే.
  అరవై ఏళ్ల నుండి ఒకే లక్ష్యంతో “మా రాష్ట్రం మాకు కావాలి” అని ఉద్యమించి విజయం సాధించింది తెలంగాణ.
  చాల మంది సీమాంధ్ర మేధావులే మా విజయాన్ని అభినందిస్తున్నారు. ఆమోదిస్తున్నారు. ప్రతి సీమాంధ్ర పౌరుడు మా సోదరుడే. అందరూ ఇకనైనా అంతే హుందాగా ప్రవర్తిస్తారని మా ఆశ.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  ఆగ 04, 2013 @ 13:00:07

  ప్రసాద్ గారు!
  “ఆంధ్రప్రదెశ్ గా విలీనం చెందినపుడు మహరాష్ట్రా, కర్ణాటకలలో కలిసిపోయిన ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడరు.” అని బాగా గుర్తు చేసారు.
  వాళ్ళు మమ్మల్ని వదలి వెళ్ళేప్పుడు మమ్మల్ని అభినందించి ఉత్త చేతులతోనే వెళ్ళారు గాని, హైదరాబాద్ మాకే కావాలని, లేకపోతె మాకు దక్కనప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం కావాలని కిరికిరి పెట్టలేదు. 350 సంవత్సరాలు పన్నులు కట్టామని గాని, మా పెట్టుబడులు పెట్టామని గాని వాటాలు అడుగలేదు.
  350 ఏళ్ల సహజీవనంలో కూడా ఏనాడు మా మధ్య పొరపొచ్చాలు రాలేదు. మా స్వాతంత్ర్యోద్యమంలో కూడా మేం కలిసే పోరాడాం. ఆనాటి మా కాంగ్రెస్ నాయకుడు స్వామి రామానంద తీర్థ గారి మాతృభాష మరాఠీ. విడిపోయాక కూడా చాల మంది మరాఠీలు, కన్నడిగులు హైదరాబాదులోనే ఉన్నారు. వాళ్ళెప్పుడు మాకు అభద్రత అని చెప్పి మమ్మల్ని అవమానించ లేదు. ఇప్పటికి హాయిగా సహజీవనం చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మేం హైదరాబాదీలమని గర్వంగా చెప్పుకొంటారు. ఇక మేం బీదర్, ఔరంగాబాద్, గుల్బర్గా వెళితే అక్కడి వృద్ధులు మమ్మల్ని ఇంకా ప్రేమగా చూస్తారు. “హైదరాబాద్ కైసా హై?” అని అభిమానంతో అడుగుతారు.
  ఇక ఇప్పుడు మీరే చెప్పండి – మేం మహరాష్ట్రా, కర్ణాటకలలో కలిసిపోయిన ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడమో?

  స్పందించండి

 7. vennelarajyam
  ఆగ 04, 2013 @ 15:52:05

  యూటీ అయినా అభ్యంతరమేంటి పరిపాలించేది మన వాళ్లేగా

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  ఆగ 04, 2013 @ 17:04:53

  vennelarajyam గారు!

  యూ.టీ.లో ప్రజా ప్రతినిధులు (ఎమ్.ఎల్.ఏ.లు; ఎమ్.పి.లు) ఉండరు. కేంద్రం నియమించిన లెఫ్నెంట్ గవర్నర్ పాలనలో ఉంటుంది. నిధులన్నీ కేంద్రానికే వెళ్తాయి. ప్రతి ప్రణాళికకు కేంద్రం అనుమతి కావాలి.

  స్పందించండి

 9. Jai Gottimukkala
  ఆగ 04, 2013 @ 17:41:51

  అన్నా వాళ్లకు తెల్వకనా ఇంత లొల్లి? తెల్సి కూడా ఒప్పుకుంటలేరంటే ఏమనుకోవాలే?

  చిక్కడపల్లిలో ఉండే ఆంధ్రులు అడ్డం పడ్తలేరు. నిన్న ఎర్ర బస్సు దిగినోల్లె ఆగం చేస్తున్నరు. ఇది రియల్ మాఫియా ప్రభావం.

  ఇంకొకాయన హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని కావాలంటాడు. దేశానికి దీనితోటి ఏమి ఒరుగుదో చెప్పడు. ఇది వీళ్ళ యవ్వారం.

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  ఆగ 04, 2013 @ 22:36:06

  Jai Gottimukkala garu!

  That is why I have appealed our Seemandhra brothers to maintain decency by supporting the decision given by Union Govt.

  Thank you!

  స్పందించండి

 11. Dr.Acharya Phaneendra
  ఆగ 05, 2013 @ 07:34:34

  Jai Gottimukkala garu!

  అపీల్ చేయడం మన సంస్కారం. దానిపై ఎలా స్పందిస్తారన్నది వారి సంస్కారంపై ఆధారపడి ఉంటుంది.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 12. ఏ.సూర్య ప్రకాశ్
  ఆగ 05, 2013 @ 11:36:54

  deshaaniki rendu raajadhaanulu kaavaalani ippudu evainaa adigaaraa?rendu adhikaara kendraalu urgentgaa kaavaalani evvaredchaaru!undaleka undavalli udukumottanamto arustunnaadu tappa!

  స్పందించండి

 13. Dr.Acharya Phaneendra
  ఆగ 05, 2013 @ 19:10:20

  సూర్యప్రకాశ్ గారు!
  బాగా చెప్పారు! అందుకే గదా సీమాంధ్ర సోదరులను నేను –
  “మాకు దక్కని హైదరాబాదు మీకూ దక్కకూడదు అన్న దుష్ట బుద్ధి తగునా?” అని ప్రశ్నిస్తున్నది.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: