“తిక్కన సోమయాజి”

“రసస్రువు”, “శివానంద మందహాసము” – ఇత్యాది మహా ప్రబంధాల కర్త, “ప్రౌఢ పద్య కళానిధి” బిరుదాంచితులు ఆచార్య వి.యల్.యస్. భీమశంకరం గారు నెలకొల్పిన ” V.L.S. Scientific & Literary Foundation ” యొక్క కార్యవర్గంలో కొన్నేళ్ళ క్రితం నన్ను “సాహిత్య సలహాదారు” పదవిలో నియమించారు. ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో ప్రధానమైనది – భీమశంకరం గారి దివంగత సతీమణి “శ్రీమతి వేము అన్నపూర్ణమ్మ” స్మారక పద్య కవితా పురస్కార ప్రదానం.

గత సంవత్సరం ఈ పురస్కారం ప్రముఖ పద్య కవయిత్రి “శ్రీమతి చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ” గారికి అందించడం జరిగింది.

ఈ సంవత్సరం ఈ పురస్కారానికి ప్రముఖ పద్యకవి “శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి” గారు ఎంపిక చేయబడ్డారు. వచ్చే నెల ( జులై 2013 ) లో నిర్వహింపబడనున్న ఈ పురస్కార ప్రదాన సభలో పురస్కృత కవికి సమర్పించనున్న సన్మాన పత్రాన్ని రచించమని భీమశంకరం గారు నన్ను కోరారు. 

సాహిత్యాభిమానుల పఠనార్థం ఆ ప్రశంసా పద్యాలను ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

puvvada2

         ప్రముఖ పద్య కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారికి                 

శ్రీమతి వేము అన్నపూర్ణ” జ్ఞాపక పద్య కవితా పురస్కార ప్రదాన

             సందర్భంగా సమర్పించు సన్మాన పత్రము 

             అభినందన మందార మాల

     నాటి మహా కవీంద్రులగు నన్నయ, తిక్కన, ఎర్రనాదులన్

     మేటిగ నిల్చు తిక్కనకు మిక్కిలి కోరిక గల్గెనేమొ తాన్

     నేటి సమాజమందు నవనిన్ జనియింప మరొక్కమారు – మా                                              

     బోటుల భాగ్యమై మరల బుట్టెను తిక్కన సోమయాజిగాన్!

           

              ‘పువ్వాడ శేషగిరి కవి

               పువ్వులటు కవితల నాడు పూచెన్! సుతుడౌ 

              ‘పువ్వాడ తిక్కనఇపుడు!

              ‘పువ్వాడకులమున తెలుగు పువు వాడదహో!

 

              కమ్మని ధార, రసమ్ముల 

              జిమ్మెడి భావము, పదాల చేరిక మరియున్ 

              తమ్ముల కోమలతను ప 

              ద్యమ్ముల నిలిపెదవు తిక్కనార్యా‘! సుకవీ!

 

              ‘తెనుగు తోటలో ఆమ్రపాలిని విహరణ 

              సలుపజేతు; ‘వక్షర ధామముజిగీష

              తోడ దుందుభిమ్రోయజేతువు;’సువర్ణ

              సౌరభమువ్యాప్తి జేతువు సార్థకాఖ్య!

 

              నీదు ప్రతిభ మెచ్చి, నీరాజనములిచ్చి,

              ‘వేము అన్నపూర్ణపేర నున్న 

              పద్య సుకవితానవద్య పురస్కృతి 

              నిత్తు మిదియె! స్వీకరింపుడయ్య! 

 

                       —  @@@ —

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఆత్రేయ
  జూన్ 28, 2013 @ 09:28:45

  మా నాన్నగారి ద్వారా మా కుటుంబానికి మంచి మిత్రులు
  అయిన శ్రీ సోమయాజి అంకుల్ గురించిన ప్రశంసా వ్యాసం చదవటం
  నాకు చాల ఆనందం కలిగించింది.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  జూన్ 29, 2013 @ 21:01:45

  ఆత్రేయ గారు!
  పదేళ్ళ క్రితం అనుకొంటాను … ’సోమయాజి’ గారి ఒక గ్రంథంపై నేను వ్రాసిన సమీక్ష ఒక పత్రికలో ప్రచురితమైనప్పుడు ఆయన మా ఇల్లు వెదుక్కుంటూ వచ్చి నన్ను అభినందించారు. ఇప్పుడు ఇలా ఈ సంస్థ సలహాదారుగా నేను పురస్కారానికి ఆయన పేరు సూచించడం, కమిటీ ఆమోదించడం ఆనందాన్ని కలిగించింది. ఆయనపై నా పద్యాలను చూసి స్పందించినందులకు మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: