మా అబ్బాయే విజేత!!!

నెల రోజులుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న RJ Hunt లో మా అబ్బాయి చి|| రోహిత్ గోవర్ధనం విజేతగా నిలిచాడని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ’యూనినార్’ నెట్ వర్క్ సంస్థ మరియు ’రేడియో సిటీ – 91.1′  సంయుక్తంగా నిర్వహించిన ఈ ’రేడియో జాకీ హంట్’ పోటీలో ముందుగా వందలాది కాలేజీలలో వేలాది విద్యార్థులనుండి వారు రేడియో జాకీ గా ఇచ్చే పర్ఫార్మెన్స్ ను బట్టి కాలేజీ టాపర్ లను ఎంపిక చేసారు. మళ్ళీ వారందరి పర్ఫార్మెన్స్ ను మరొకమారు వీడియో తీసి బెస్ట్ పదహారు మందిని ’సెమిఫైనలిస్ట్’లుగా ఎంపిక చేసి, వారి వీడియోలను ’ఫేస్ బుక్’ లో ఉంచి ఓటింగ్ ద్వారా, ’యూనినార్ నెట్ వర్క్’ లో ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా నలుగురు ’ఫైనలిస్ట్’లను ఎంపిక చేసారు.  మళ్ళీ ఆ నలుగురి పర్ఫార్మెన్స్ ను వీడియో తీసి, మరొకమారు ’ఫేస్ బుక్’ లో ఉంచి మళ్ళీ ఓటింగ్ మరియు ఎస్.ఎమ్.ఎస్. లను ఆహ్వానించారు. ఈ తుది సమరంలోనూ మా అబ్బాయి అత్యధికమైన లైకింగ్స్ తో అగ్ర స్థానంలో నిలవడంతో నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. పుత్రోత్సాహంతో పులకించిపోతున్న నేను మా అబ్బాయి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలను తెలుపుకొంటున్నాను. 

భాగ్య నగరంలోని ’గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ లో ప్రస్తుతం బి. టెక్ మూడవ సంవత్సరం ఫైనల్ ఎగ్జామ్స్ వ్రాస్తున్న మా అబ్బాయి అటు విద్యార్థిగా, ఇటు RJ గా చక్కని ఫలితాలు సాధించేలా అందరూ ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

uninor Uninor

The month long wait has ended. It’s time to announce the winner of our RJ HUNT. He is none other than super talented and extremely charming ‘Rohit’ from Geetanjali College.

rj

rj11

rj15

rj19

rj20

ప్రకటనలు

12 వ్యాఖ్యలు (+add yours?)

 1. Zilebi
  మే 17, 2013 @ 05:48:41

  మీరు రాసిన ఈ టపా కాలాన్ని బట్టి మీ అబ్బాయి సినీ హీరో అయ్యె చాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నది.

  He will shine as a refreshing face for cine world.

  శుభాకాంక్షలు

  జిలేబి

  స్పందించండి

 2. జలతారు వెన్నెల
  మే 17, 2013 @ 06:38:19

  Congratulations to Rohit ! I wish him all the best.

  స్పందించండి

 3. కోడీహళ్లి మురళీమోహన్
  మే 17, 2013 @ 07:38:22

  అభినందనలు!

  స్పందించండి

 4. Phani
  మే 17, 2013 @ 08:51:59

  మీకూ, మీ అబ్బాయికీ హార్థిక శుభాకాంక్షలు. 🙂

  స్పందించండి

 5. Jai Gottimukkala
  మే 17, 2013 @ 11:34:00

  Congratulations to Rohit!

  స్పందించండి

 6. తాడిగడప శ్యామలరావు
  మే 17, 2013 @ 18:33:24

  విజయం మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మీ అబ్బాయి చి. రోహిత్‌కు హృదయపూర్వక అభినందనలు.
  పుత్రోత్సాహపరవశులైన పితృదేవులకూ నా హృదయపూర్వక అభినందనలు.

  స్పందించండి

 7. గోలి హనుమచ్ఛాస్త్రి.
  మే 17, 2013 @ 21:56:39

  ఆర్యా ! ఆర్జే పదవి నధిరోహించిన మీ అబ్బాయికి అభినందనలు.

  మీ రోహిత్ హిత కరముగ
  నారోహించంగ వలయు నధికపు ‘ పోస్టుల్ ”
  ఆ రోజులు రావాలని
  ఈ రోజున కోరుచుంటి నీశుని భక్తిన్ !

  స్పందించండి

 8. Jyothi Valaboju
  మే 17, 2013 @ 22:36:23

  మీకూ, మీ అబ్బాయికీ హార్థిక శుభాకాంక్షలు.

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  మే 17, 2013 @ 23:10:49

  జిలేబి గారు!
  చందు గారు!
  జలతారు వెన్నెల గారు!
  కోడీహళ్లి మురళీమోహన్ గారు!
  ఫణి గారు!
  జై గొట్టిముక్కల గారు!
  తాడిగడప శ్యామలరావు గారు!
  గోలి హనుమచ్ఛాస్త్రి గారు!
  జ్యోతి వలబోజు గారు!

  మీ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

 10. అనూరాధ
  మే 18, 2013 @ 12:37:49

  మీ అబ్బాయికి నా శుభాకాంక్షలు. ఇటువంటి యువతరాన్ని చూస్తే ముచ్చట వేస్తుంది.

  స్పందించండి

 11. Dr.Acharya Phaneendra
  మే 18, 2013 @ 22:26:34

  అనూరాధ గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: