కవిసమ్మేళనం

vas1

2/5/2013 నాడు “నవ్య సాహితీ సమితి” నిర్వహించిన “వసంతోత్సవం”లో భాగంగా పలువురు సాహితీ మూర్తులకు పురస్కార ప్రదానంతోబాటు కవిసమ్మేళనం కూడ జరిగింది. నా అధ్యక్షతన జరిగిన ఆ కవిసమ్మేళనంలో మన “ఆంధ్రామృతం” బ్లాగరు శ్రీ చింతా రామకృష్ణారావు, శ్రీ వూసల రజనీ గంగాధర్, శ్రీ ఆలపాటి శ్రీనగేశ్ వంటి పది మంది కవులు పాల్గొన్నారు. కొన్ని పత్రికలలో ప్రచురితమైన ఆ కార్యక్రమ వివరాలను, నాతోబాటు కొందరు కవులు ఆలపించిన కవితలను ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ఈనాడు :

ks4

నమస్తే తెలంగాణ :

ks3

నా కవిత :

ks1

ks2

“ఆంధ్రామృతం” బ్లాగరు శ్రీ చింతా రామకృష్ణారావు కవిత :

vas3

శ్రీ ఆలపాటి శ్రీనగేశ్ కవిత :

విద్యుత్ సమస్య – సాధన
రచన: ఆలపాటి శ్రీనగేశ్
అంధకార సంక్షోభం నుండి జాజ్వల్యమాన సంక్షేమం దిశగా
సాగాలి మన పయనం… పథక, ప్రణాళికా బద్ధమైన ప్రయత్న పథం !
వ్యథను ఛేదించడానికి సమగ్ర విధానానికై చేద్దాం మేథో మథనం !
సాంప్రదాయేతర సహజ ఇంధన అన్వేషణం !
పవన ,సౌర శక్తి వనరుల సద్వినియోగం !
ఇద్దాం.. విద్యుత్ రంగ నిపుణుల పరిశోధనలకు ప్రాధాన్యం !
పొలాన్ని దుక్కి దున్నే బక్క చిక్కిన రైతన్న కరెంటు కరువు బరువుతో,
బ్రతుకు తెరువు చిక్కుల్లో పడి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు !
పరీక్షలకై అహోరాత్రాలు సింహంలా శ్రమించే విద్యార్థి
ఈ అంధకార పరీక్షకు అయోమయావస్థలో కుదేలవుతున్నాడు,
బెదిరే కుందేలవుతున్నాడు !
ఆసుపత్రుల్లొ.. అత్యవసర స్థితి లోని రోగి శస్త్ర చికిత్స జరుగక ,
ప్రాణాపాయ భయంతో లబోదిబోమంటున్నాడు !
చెప్పుకుంటూ పోతే ,వేధించే వెతల కతలు ఎన్నో .. !
సరఫరా కోతలతో ,పెరిగిన రుసుముల మోతలతో
గతుకుల గతి బ్రతుకుతో సతమతమవుతున్న సంసారసాగరపు ఎదురీతలెన్నెన్నో!
ఈ సమస్యకు ప్రజలు,ప్రభుత్వం , ప్రతిపక్షాలు
బాధ్యతాయుత భాగస్వామ్యస్ఫూర్తితో సమిష్టిగా జరపాలి శాశ్వత పరిష్కార సాధనం!
త్రిమూర్తి శక్తులు సంఘటితమై,ప్రత్యామ్నాయ ఉత్పత్తి ఆయుధంతో చేయాలి పరాక్రమ ప్రహారం !
తక్షణమే ఈ “తిమిరాసురుని” సంహారం !
వ్యాపింప జేయాలి “విజయ”నామ వత్సరంలో వెలుగు వెన్నెలల వీర విహారం !

—***—

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: