అడిగిన అంశాలపై ఆశు పద్యాలు

gvp

ఇటీవల “టోరి” రేడియోలో లైవ్ ప్రోగ్రాంలో అడిగిన అంశాలపై తొలిసారిగా ఆశువుగా పద్యాలు చెప్పినప్పుడు అక్కడక్కడా కొన్ని తప్పులు దొరిలాయి. వాటిని సరిదిద్ది, ఆ పద్యాలకు మెరుగులు దిద్ది ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఏమిటొ! ఆ రోజు నా మైండ్ “ఆటవెలది” కే ట్యూన్ అయి ఉన్నట్టుంది. ఒక్క పద్యం మాత్రం కందంలో వచ్చింది. అదీ ఆశువులో అంత సంతృప్తిగా రాలేదు. మెరుగులు దిద్దాక, “ఆంజనేయుని తొలిసారి చూచిన సీతాదేవి మనోభావాల” పై చెప్పిన ఆ పద్యం హృద్యంగా రూపు దిద్దుకొంది.
మా గురువు గారు నండూరి రామకృష్ణమాచార్య గారు అన్నట్టు- ఆశువుగా చెప్పిన పద్యానికి, ఆలోచనతో చెక్కిన పద్యానికి చాల తేడా ఉంటుందన్నది అక్షర సత్యం.

– డా. ఆచార్య ఫణీంద్ర

“సెల్ ఫోన్” పై పరిచయ కర్త ’రమేశ్’ పద్యం చెప్పమన్నప్పుడు :

ఒకరి మాట వినగ నొకరు దూరము నుండి,
శాస్త్రవేత్త లిడిన సాధనమ్ము –
’దూర వాణి’ ఒక మధుర భాషణపు భూష!
చేయి, చెవికి నడుమ చేరియుండు!

“అరవింద” అన్న కాలర్ తనపై పద్యం చెప్పమన్నప్పుడు :

పాట పాడగలుగు పండితోత్తమురాలు –
నటన ఎరిగినట్టి నారి యామె!
అమృత హృదయురాలు – ’అరవింద’ యను శ్రోత!
మంచితనము పరిమళించు మహిళ!

“రాంబాబు” అన్న కాలర్ “పనికి ఉపాధి” పథకంపై చెప్పమన్నప్పుడు :

పని దొరకక పేద పస్తులుండుట మాన్ప,
ప్రభుత పూని మంచి పథక మొకటి
కూర్చ వలయు వాని కూడు, గుడ్డను జూడ –
పనికి ఒసగవలె ఉపాధి సతము!

“శిల్ప” అన్న కాలర్ మానవాళికి ఒక మంచి సందేశ పద్యం చెప్పమన్నప్పుడు :

ఎదుటి వారి యొక్క ఎడద నొప్పింపక,
మంచి తనము నెపుడు పంచవలయు!
సత్య మార్గమందు సంచరింప వలయు!
ధర్మ నిరతి నెపుడు దాట వలదు!

“శ్రీనివాసులు” అన్న కాలర్ ’టోరి’ రేడియోలో ప్రసారమయ్యే “ఇడ్లి – బర్గర్” ప్రోగ్రాంపై పద్యం చెప్పమన్నప్పుడు :

విశ్వమందు గలుగు విశులెల్లరు గూడి
మాటలాడుకొంద్రు మనసు విప్పి –
ఎంత చక్కగుండు ’ఇడ్లి-బర్గ’రను ప్రో
గ్రాము, రెంటి రుచుల రంగరించి!

“జె.పి.” అన్న కాలర్ ఆంజనేయుని తొలిసారి చూచిన సీతాదేవి మనోభావాలపై
పద్యం చెప్పమన్నప్పుడు :

వచ్చిన ఓ వానరమా!
వచ్చితి వెవ్వారు పంప? పగవా డంపన్
వచ్చిన మాయవొ? సత్యమొ?
తెచ్చితొ సందేశము పతి దేవుని దూతై!

పరిచయ కర్త “రమేశ్” తనపై పద్యం చెప్పమన్నప్పుడు :

కలదు మీకు మధుర గంభీర కంఠమ్ము-
పలుకుచుంద్రు తీపి పలుకు లెన్నొ!
శ్రేష్ఠమైన వక్త! శ్రీ రమేశాఖ్య! మీ
కందజేయుదు నభినందనముల!

— *** —      TORI

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: