విశ్వనాథ – పుట్టపర్తి – ఒక ఆసక్తికర విషయం!!!

ఈ మధ్య కీ.శే. ఆచార్య తిరుమల గారి సంపాదకత్వంలో మూడు దశాబ్దాల క్రితం వెలువడిన “ఆధునిక కవిత – అభిప్రాయ వేదిక” అన్న గ్రంథాన్ని సంపాదించి చదువుతున్నాను.
అందులో ఆసక్తికరమైన అంశాలు చాల ఉన్నాయి. అన్నిటి కంటె చాల ఆసక్తికరమైన అంశం – ’కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణపై ’సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు వ్యక్తీకరించిన అభిప్రాయం. దీనిని సాహిత్యాభిమానులతో పంచుకోవాలనిపించింది. ఇదేదో వారి 

VP1అభిమానులకు, వీరి అభిమానులకు తగవులు పెట్టాలని కాదు. ఇరువురు మేధావుల మధ్య అభిప్రాయ భేదాలు ఎలా మొలకెత్తుతాయో అవగతం చేసుకోవడానికి మాత్రమే.

– డా. ఆచార్య ఫణీంద్ర 

VP2

VP3

VP4

1 వ్యాఖ్య (+add yours?)

  1. తాడిగడప శ్యామలరావు
    ఫిబ్ర 15, 2013 @ 20:08:40

    విశ్వనాథపై రాళ్ళు పడటం అనేది యేమీ క్రొత్తవిషయం కాదు. ఆ పని చాలా మందే చేసారు. అందులో లబ్ధప్రతిష్టులూ బోలెడు మంది ఉన్నారు. ఈ విషయం అందరికీ‌తెలిసినదే కాబట్టి క్రొత్తగా యెవరూ‌ బాధ పఏదీ యేమీ‌ ఉండదు. ముఖే ముఖే సరస్వతీ యని వాగ్దేవి ఒక్కొక్కరి యందు ఒక్కొక్క విభూతితో ప్రకాశించటం కద్దు. అయినా యెంత గొప్పవారయిన అవతలి ఫలానా కవినో పండితుడినో న్యూనత పరిస్తే అది వారికే కొంత అప్రతిష్ట కావచ్చును. ఎందుకంటే ఓర్వలేనితనం అన్న అపప్రథ వస్తుంది కాబట్టి.

    మాటవరసకు విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షాన్ని విమర్శిస్తూ శ్రీశ్రీ మొల్ల రామాయణం నిలుస్తుంది విశ్వనాథది నిలవదూ అనేశారు. రంగనాయకమ్మగారైతే మార్క్సిష్టు మతవిమర్సనాథోరణికి నడుంబిగించి అసలు రామాయణమే పెద్ద విషవృక్షం అనేశారు. ఒక కొత్త సత్యనారాయణ చౌదరి గారు విశ్వనాథ రామయణం అంతా తప్పులతడక అంటూ దండయాత్ర చేసారు. అయినా విశ్వనాథవారి కీర్తికి యీ వైరివీరులవలన వచ్చిన కళంకం యేమీ కనిపించదు.

    స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: