ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌముడు …

నా పి.హెచ్.డి. అంశం- “19 వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత” పరిశోధనలో భాగంగా నాకు తారసపడిన తొలి క్రైస్తవ వాగ్గేయకారుడు -“పురుషోత్తమ చౌదరి”.
ఆయన త్యాగరాజుకు సమకాలికుడు కావడం విశేషం.

ఈ ’క్రిస్మస్’ పర్వదిన సందర్భంగా ఆ మహాకవిని గురించి లోగడ ఒక సంచికలో ప్రచురించబడిన నా ప్రత్యేక వ్యాసాన్ని సాహిత్యాభిమానుల కోసం ఇక్కడ అందిస్తున్నాను.

క్రైస్తవ సోదరులందరికీ “క్రిస్మస్” పర్వదిన శుభాకాంక్షలతో –

డా. ఆచార్య ఫణీంద్ర

pc1

pc2

pc3

9 వ్యాఖ్యలు (+add yours?)

 1. కోడీహళ్లి మురళీమోహన్
  డిసెం 24, 2012 @ 22:37:42

  ఈ వ్యాసం ఇదివరకే మూసీ పత్రికలో చదివియున్నాను. తొలి తెలుగు క్రైస్తవ కవి పురుషోత్తమ చౌదరిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!

  స్పందించు

 2. Dr.Acharya Phaneendra
  డిసెం 25, 2012 @ 08:45:49

  కోడీహళ్లి మురళీమోహన్ గారు!
  అవునండీ – ఈ వ్యాసం ’మూసీ’ మాస పత్రికలో కూడా అచ్చయింది.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించు

 3. n chandrasekhar
  డిసెం 25, 2012 @ 10:48:13

  మంచి వ్యాసం చదివాను. నాకొక చిన్న సందేహం. అసలు వాగ్గేయకారుడు అంటే ఎవరు?? ఏ లక్షణాలు, అర్హతలు వాగ్గేయకారులకు ఉండాలి, దయచేసి వివరించగలరు.

  నమస్కారం

  స్పందించు

 4. Dr.Acharya Phaneendra
  డిసెం 25, 2012 @ 14:47:24

  చంద్రశేఖర్ గారు!
  వ్యాసం బాగుందన్నందుకు ధన్యవాదాలు!
  మీరడిగిన ప్రశ్న మీరు తెలిసే అడుగుతున్నారో .. లేక తెలియక అడుగుతున్నారో .. నాకు తెలియడం లేదు.
  అయినా మీరు అడిగారు కాబట్టి చెప్పడం నా విధి.
  ఒక కవి అటు గేయ కవిత్వంలోను, ఇటు సంగీతంలోను నిష్ణాతుడై, అటు రాగాన్ని, ఇటు భావాన్ని సమన్వయం చేస్తూ గాన యోగ్యమైన రచనను రూపొందించి, స్వయంగా గానం చేస్తూ ప్రజా బాహుళ్యానికి అందిస్తే – అతడు వాగ్గేయకారుడని పిలువబడుతాడు.
  ప్రాచీన కాలంలో ‘అన్నమయ్య’, ‘రామదాసు’, ‘త్యాగయ్య’ల వంటి ప్రముఖులను వాగ్గేయకారులుగా తెలుగు సాహిత్యంలో గుర్తించారు. కొందరు ఆధునికులు, ‘గద్దర్’ వంటి వారిని కూడా వాగ్గేయకారులుగా పేర్కొంటున్నారు.
  అయితే ఈ లక్షణాలన్నీ అక్షరాల కలిగిన కవి ‘పురుషోత్తమ చౌదరి’. ఇప్పటికీ ఆయన కీర్తనలను ఆయన రూపొందించిన రాగాలలోనే అనేక చర్చిలలో భక్తులు భక్తి పారవశ్యాలతో పాడుకొంటున్నారు. మత వివక్షతో అప్పటి తరంలో అత్యధికులు ఆయనను నిర్లక్ష్యం చేసినా, ఆధునిక కాలంలో విశాల హృదయులుగా మనం ఆ తప్పును సరిదిద్దవలసి ఉన్నది.

  స్పందించు

  • chandra
   డిసెం 26, 2012 @ 12:05:48

   నాకు వాస్తవంగానే సాహిత్యంలో ప్రవేశం లేదు. గత సంవత్సర కాలమ్నుండి, పంచ కావ్యాలలోని (మను చరిత్ర 3 అధ్యాయాలు మాత్రమె పూర్తి చేసాను) ముఖ్యమైన పద్యాల అర్ధం తెలుసుకోవడం, కొన్నిటిని బట్టి కొట్టి మాత్రమే తెలుసు. మీ వివరణ చాలా బాగుంది. కానీ త్యాగయ్య అన్నమయ్య, రామదాసు ల సరసన గద్దరు గారి సాహిత్యాన్ని చెర్చవచ్చా అంటే, ఒక పెద్ద రచ్చకు, పెడ అర్ధాలకు దారి తీస్తుందన్న భయంతో మౌనం పాటిస్తున్నాను.

   స్పందించు

 5. Dr.Acharya Phaneendra
  డిసెం 31, 2012 @ 22:06:21

  మొట్టమొదట – ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని ఈ రోజే హైదరాబాద్ చేరుకోవడం వలన … ఆలస్యంగా పై వ్యాఖ్యను స్వీకరించవలసి వచ్చింది.
  ఇక విషయానికి వస్తే … “’చంద్ర శేఖర్’, ’చంద్ర’ ఒకరేనా?” అని నాకు సందేహం!

  ఒకరే అయితే … నా సమాధానం ఇది –
  “మీరు మొదట అడిగింది వాగ్గేయకారుని లక్షణాలు ..
  ఆ లక్షణాలు చెప్పి, ఆ ప్రకారంగా ‘పురుషోత్తమ చౌదరి’ వాగ్గేయకారుడా.. కాదా …అన్నది మనం చర్చించాలి.
  ఆ లక్షణాలు ‘గద్దర్’ కి కూడా సరిపోవడం వలన కొందరు ఆధునికులు ఆయనను వాగ్గేయకారుడని పేర్కొంటున్నారు – అన్నానే తప్ప, అది నా సమగ్రాభిప్రాయం అని చెప్పలేదే!
  ఆ విషయంలో నా అభిప్రాయం – అవునంటే అవును … కాదంటే కాదు. ఎందుకంటే అది భక్తి సాహిత్యం కాదు కాబట్టి.
  ‘పురుషోత్తమ చౌదరి’ విషయంలో అట్లా అనడానికి లేదు. మతం వేరయినంత మాత్రాన, అది భక్తి సాహిత్యం కాకుండా పోదు. కాదంటే మనం మత ఛాందసులం అని ఒప్పుకోక తప్పదు.
  ఇదంతా చర్చించకుండా, మీరు ‘పురుషోత్తమ చౌదరి’ పై చర్చను వదిలి ‘గద్దర్’ పై చర్చించడం … చర్చను ప్రక్క దారి పట్టించడమే అవుతుంది కదా!”

  ఇక మీరిరువురు వేరయితే … ‘చంద్ర’ గారికి నా సమాధానం ఇది –
  ” త్యాగయ్య అన్నమయ్య, రామదాసు ల సరసన గద్దరు గారి సాహిత్యాన్ని చేర్చవచ్చా ? ” అని అడిగారు.
  ఎవరి సాహిత్యం సరసనో ఇంకొకరి సాహిత్యాన్ని చేర్చాలన్న నియమం ఏదైనా ఉందా?
  ఆ లెక్కన ‘నన్నయ’, ‘తిక్కన’ల సరసన ‘శ్రీశ్రీ’ని చేర్చవచ్చా?
  ఎవరి సిద్ధాంతాలు వారివి! ఎవరి ప్రతిభ వారిది! ‘ముఖే ముఖే సరస్వతీ’ అని ఊరికే పెద్దలు అన్నారా?”

  స్పందించు

  • chandra
   జన 02, 2013 @ 15:28:37

   అంత పొడుగు పేరు టైపు చెయ్యలేక, చంద్ర అని వ్రాసాను. రెండూ నేనే. నేను క్రైస్తవానికి మారిన చౌదరి గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. గద్దర్ గారి గురించి కూడా నా మనసులో మాట వుంచుకోలేక చెప్పాను. ఎంత ఎక్కువ మంది వాగ్గేయ కారులు మన భాషలో వుంటే అంత మంచిదే కదా? ఇవ్వాల్టి నుండి నేను గద్దర్ గారిని వాగ్గేయ కారునిగా భావిస్తాను.

   స్పందించు

 6. chandra
  జన 02, 2013 @ 15:33:50

  నెను కూడా ప్రపంచ మహాసభలకు వచ్చాను. బహుశా మిమ్మల్ని ప్రధాన వేదిక మీదకు అహ్వానించినపుదు మీరు ఎరుపు రంగు స్లీవ్ లెస్స్ స్వెటర్ వేసుకొని వున్నారు. చిన్న చిన్న లోపాలు మినహాయించి సభలు బాగా జరిగినవి (నేను చూసిన మొట్ట మొదటి సభలు ఇవే)

  స్పందించు

 7. Dr.Acharya Phaneendra
  జన 06, 2013 @ 12:00:20

  చంద్ర గారు!
  ఒకరన్నారని మీరు మీ అభిప్రాయాలను, నిర్ణయాలను మార్చుకోకూడదు.
  అన్నీ విన్నాక, మీలో మీరు తర్కించుకొని మీ మనస్సాక్షి ఏది ప్రబోధిస్తే – దానిని మీ అభిప్రాయంగా భావించుకోవాలి. బహుశః మీరట్లాగే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటే – మంచిదే!
  ఇక ప్రపంచ తెలుగు మహాసభలలో మీరు అనుకొన్న వ్యక్తి నేను కాదు. నేను బంగారు రంగులో ఉన్న సిల్క్ జుబ్బా వేసుకొన్నాను. స్వెట్టర్ ధరించలేదు.
  మీరన్నది నిజమే – భోజనాల కాంట్రాక్టర్ కక్కుర్తి, కవి పండితులను గుర్తించి గౌరవంగా మాట్లాడని వాలేన్టిర్ల, పోలిసుల అసభ్య ప్రవర్తన, నిర్వహించిన విశ్వ విద్యాలయంలో కిలోమీటర్ల మేర ఎట్లాంటి ప్రయాణ సౌకర్యం కల్పించక పోవడం వంటి లోపాలను మినహాయిస్తే, 4వ ప్రపంచ మహా సభలు చాలా బాగా జరిగాయనే చెప్పాలి.

  స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: