‘ఆంధ్రామృతం’ వారి అభినందన

 chinta

ఇటీవల ఒక సాహిత్య సభలో ‘ఆంధ్రామృతం’ బ్లాగరు శ్రీ చింతా రామకృష్ణారావు గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా నా ‘వరాహ శతకం’ గ్రంథాన్ని ఆయనకు బహూకరించాను. ఆయన దానిని చదివి, ‘కంద – గీత – గర్భ చంపక మాల’ పద్యంతో కూడిన ఒక లేఖను నాకు మెయిల్ చేసినారు. ఆ లేఖను సాహిత్యాభిమానుల కోసం ఈ పోస్ట్ ద్వారా  అందిస్తునాను.

 

– డా. ఆచార్య ఫణీంద్ర    

——————————————————————————————————————

ప్రియ మిత్రులు ఆచార్య ఫణీంద్రులకు!
స్మిత పూర్వ భాషీ! శుభాభినందనలు.
మీరు రచించిన విలక్షణ సమన్వితమైన, సామాజిక ప్రయోజన బాహుళ్యమును సూచించే “వరాహ శతకము” ఆమూలాగ్రము చదివితిని.
మీ వరాహ శతకము సంఘ సంస్కరణా దృక్పథం కలిగి నేటి రచనలందు మేటియై ప్రముఖుల ప్రశంసార్హమైనది. మీ సామాజిక దృక్పథానికి, హృదయవైశాల్యానికి ఎంతో సంతోషిస్తూ, మిమ్ములను మనసారా అభినందిస్తున్నాను.

కంద – గీత – గర్భ చంపక మాల:-

ప్రశమన జాతికిన్ మితి నివారణ జేసెడు మేలుగా ‘వరా
హశతకమే’. పఠించి వర ప్రార్థిత సత్ఫల సిద్ధి కోర గా
దశ కనఁజేయు. చేకొనగ తక్షణ మిచ్చును కోరినంత శాం
తి, శుభములన్. మహా మహిమ దేల్చును మీ కృతి. మాన్యతేజసా!

చంపక గర్భస్థ కందము:-

మన జాతికిన్ మితి నివా
రణ జేసెడు మేలుగా వరాహ శతకమే,
కనఁ జేయు, చేకొనగ త
క్షణ మిచ్చును కోరినంత శాంతి, శుభములన్.

చంపక గర్భస్థ గీతము:-

మితి నివారణ జేసెడు మేలు గావ.
చివర ప్రార్థిత సత్ఫల సిద్ధి కోర
కొనగ తక్షణ మిచ్చును కోరినంత.
మహిమ దేల్చును మీ కృతి మాన్యతేజ.

పునరభినందనలతో
బుధజన విధేయుఁడు,
మీ
చింతా రామ కృష్ణా రావు.
సెల్ నెంబర్. 9247238537.

——————————————————————————————————————

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: