జాబిలి కుమిలింది …

జాబిలి కుమిలింది … ( విషాద గీతం)

రచన: డా.ఆచార్య ఫణీంద్ర

జాబిలి కుమిలింది –
తరిగింది!
మేఘం ఉరిమింది –
కరిగింది!
నీ హృదయం పగిలింది గానీ …
కన్నీరైనా ఒలకవేమి?        || జాబిలి ||

నీ కన్నులలో కాటుక నలుపే
లోకం నిండిందా?
నీ గుండెలలో వేదన బరువుకు
భూమే కుంగిందా?
ఓ ఆకాశమా!
నీ ముఖమెందుకు నల్ల బారె?
ఈ ఆశల తారక …
నేడెందుకు నేల జారె?        || జాబిలి ||

ఆత్మీయత – అనుబంధం –
అంతా ఒక మిథ్యేనా?
ఆచారం – సంప్రదాయం –
అంతా ఒక రొచ్చేనా?
ఓ హోమ కుండమా!
నీ అగ్నిని నియంత్రించు!
అది ఒక చితి మంటగా
కాకుండా నిలువరించు!        || జాబిలి ||

కరుగని ఈ రాతిరికి
ఉదయం వస్తుందా?
కడు చిక్కని చీకటికి
వెలుగే ఇస్తుందా?
ఓ నవ రవి బింబమా!
నీ వెక్కడ దాగున్నావు?
ఈ మానవ జాతిని
నీ వెప్పుడు మేల్కొలిపేవు?        || జాబిలి ||

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: