“పక్క రాష్ట్రాల తల్లంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయ గీతం పాడే హక్కెక్కడిది?”

నిజమే! ఆ చిత్రంలో తెలంగాణ ప్రస్తావనే లేదు. “తెలంగాణ కావాలా? వద్దా?“ అన్న డైలాగ్ తప్ప తెలంగాణ ఉద్యమాన్ని గురించి ఎక్కడా కమిట్ కాకుండా జాగ్రత్త పడ్డారు. కుటిలత్వంతో “ఆ ఉద్యమాన్ని గురించి పరోక్షంగా స్ఫురింపజేయడమే తప్ప, నేరుగా చెప్పలేదే?“ అని తప్పించుకొందామని అనుకొన్నారు. సరే! ఒప్పుకొన్నా.

మరి ఆ చిత్రంలో చెప్పిన ఉద్యమం పేరేమిటి? – “తెలుగు ఉద్యమం“. ఆ డైలాగేమిటి? “పక్క రాష్ట్రాల తల్లంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయ గీతం పాడే హక్కెక్కడిది?”!
అంటే … ఆ డైరెక్టర్ విమర్శిస్తున్నది – తమిళ తల్లితో పడక ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరిన ‘పొట్టి శ్రీరాములు‘ గారినా? ’తెలుగు తల్లి‘ని ‘తెలుగు సంస్కృతి‘ని పవిత్రంగా భావించిన నాటి ‘ప్రకాశం పంతులు‘ వంటి తొలి తరం నాయకులనా? ‘విశ్వనాథ సత్యనారాయణ‘గారి వంటి కవులనా? లేక ‘తెలుగు తల్లి‘ కి విగ్రహ రూపం కల్పించి, ఆ భావనను విశ్వ వ్యాప్తం చేసాడని మనం గర్వంగా చెప్పుకొనే మలితరం నాయకుడు ‘ఎన్.టి.ఆర్’ గారినా? లేక తమిళుల నుండి వేరుపడి ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాడిన నాటి మహనీయులను ఈనాటి ‘రాజ్ ఠాక్రే’ను ఒకే గాటిన కట్టినట్టా? దీనికి ఆ దర్శకుడు ఏం సమాధానం చెప్పుతాడు? ఇతర రాష్ట్రాల వారిని తమ రాష్ట్రం నుండి వెళ్ళగొట్టాలనే రాజ్ ఠాక్రే అభిప్రాయం ఎంత తప్పో, ఇతర రాష్ట్రం వాడు వచ్చి, ఆ రాష్ట్ర రాజధానిని ‘ఉచ్చ పోయిస్తా‘ననడం అంతకన్న ఘోరమైన నేరం. ఇలాంటి చిత్రాలు రూపొందించే దర్శకునికి ఏ మాత్రం సామాజిక బాధ్యత ఉందో తెలియడం లేదా?

ఈ మాత్రం ఇంగిత జ్జానం లేకుండా,తెలంగాణ వాదులు ఏ నిరసన తెలిపినా దానికి గుడ్డిగా వ్యతిరేకంగా మాటాడే కొందరు సీమాంధ్ర నాయకుల ( కొందరు బ్లాగర్లు సైతం) బుర్రలు మోకాళ్ళలో ఉన్నట్టా? అరికాళ్ళలో ఉన్నట్టా? పైగా ఈ చిత్రంలో సందేశం ఉందని వీళ్ళు వాగుతుంటే – తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, తెలుగు తల్లిని ఆరాధించే నాలాంటి తెలంగాణ కవుల గుండెలు మండిపోతున్నాయి.

నేను ఇదివరకే కొన్ని పోస్టుల్లో ప్రశ్నించాను. తెలంగాణ తల్లిని గౌరవిస్తే, తెలుగు తల్లిని ద్వేషించినట్టా? తెలుగు తల్లిని ఆరాధిస్తే భారత మాతను ద్వేషించినట్టా? … అని. అప్పుడు అంతా సమాధానం చెప్పకుండా తప్పుకొన్నారు. ఇప్పుడదే అంశం తెర పైకి వచ్చింది. మరి సీమాంధ్ర తెలుగు కవులు స్పందించరే? సరే! చిత్రంలో తెలంగాణ గూర్చి ఏమన లేదు. అయితే తెలుగు తల్లి గురించి అవాకులు చెవాకులు పేలవచ్చా?

తెలుగు తల్లికి పిచ్చి వాదనల మసి పూసినా తెలుగు వారు నోరు మూసుకోవడం .. పైగా సందేశం అని చంకలు గుద్దుకోవడం – కన్న తల్లికి చేస్తున్న ద్రోహం.

– డా. ఆచార్య ఫణీంద్ర

16 వ్యాఖ్యలు (+add yours?)

 1. కచరా
  అక్టో 21, 2012 @ 11:06:20

  సూటిగా అడిగినవ్, మీకు డాక్టరేట్ ఇచ్చింది ఎవరు? ఏ సబ్జెక్ట్లో ఇచ్చిన్రు?

  స్పందించు

 2. satya
  అక్టో 21, 2012 @ 12:47:05

  సినిమా అనేది కేవలం ఒక ఫిక్షన్. ఎవర్ని ఉద్దేశించి అనలేదు అని ఒకపక్క చెప్తుంటే, ప్రకాశం ని అన్నారా, పొట్టి శ్రీరాములు ని అన్నారా, అని లొల్లి దేనికి? పోని మీకు నచ్చినట్లు అనుకోండి, దానికి ఇక్కడెవ్వరు బాధ పడరు.. ఈ ప్రశ్నలు మనకు బేమాను నాయకులు, బేథాళ మాంత్రికులు అన్నప్పుడు ఉదయించవా? ఎందుకు తెలంగాణ వాదులకి ఇంత ఉలికిపాటు? పోని ఎన్‌టీఆర్ నే అన్నాడనుకుందాం.. కాని ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వెళ్ళబుచ్చే స్వేచ్చ ఉంది ఈ దేశం లో.. దాన్ని గౌరవించటం ఇంగితం.. అంతేగాని దాడులు చెయ్యటం ఇంగిత ఙ్ఞానం ఏంటండి బాబు? ఇది తప్పని, ఘోరమైన నేరం అని బ్లాగుల్లో కూర్చొని తీర్మానించటం రాజ్యంగాన్ని చులకన చెయ్యటమే.. అది అసలైన నేరం.

  స్పందించు

 3. satya
  అక్టో 21, 2012 @ 12:49:12

  పోని ఇదే టపా లో అన్నది తెలుగు తల్లి ఉద్యమాన్ని అయితే మీరెందుకు చొక్కాలు చించుకుంటున్నార్రా అని మీ ఉద్యమకారులని అడగలేదేమి?

  స్పందించు

 4. Dr.Acharya Phaneendra
  అక్టో 21, 2012 @ 14:45:50

  ఒక విశ్వ విద్యాలయం డాక్టరేట్ ఏ సబ్జెక్టులో ఇచ్చినా అది డాక్టరేటే. అసలు సబ్జెక్ట్ మీద మాట్లాడకుండా నా పి.హెచ్.డి సబ్జెక్ట్ పై వెటకారాలు మాట్లాడినప్పుడే దిగజారుడు స్థాయి అర్థమవుతున్నది. అంతగా నా సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకొంటే ఆంధ్ర దేశం లో ఏ పద్య కవిని అడిగినా చెప్పుతాడు. ‘అసలు సబ్జెక్ట్’ మీద మాట్లాడ లేని కచ్రా గాళ్ళు పర్సనల్ అటాక్ కి దిగుతారు.

  సత్య గారు!

  దాడులను ఎవరూ సమర్థించడం లేదు. కాని ఫిక్షన్ అని చెప్పి ఏది పడితే అది చూపిస్తే వాక్కు ద్వారానైన నిరసన తెలుపక పోగా, పైగా సమర్థించడం ఎంత వరకు న్యాయం? తెలుగు తల్లిని అవమానిస్తే అదేదో మీ ఆస్తి అన్నట్టు మాట్లాడుతారేంటి? ఏం? మేం తెలుగు వాళ్ళం కామా? వేరే రాష్ట్రం కోరినంత మాత్రాన తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి మావి కాకుండా పోతాయా? ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందు మాకవి లేవా?ప్రతి ఉద్యమంలో మిత వాదులు, అతి వాదులూ ఉంటారు. అందరినీ ఒకే గాటిన కట్టడం మీ అవివేకాన్ని సూచిస్తున్నది. మేము తెలుగు తల్లైనా, తెలంగాణ తల్లైనా, భారత మాతైనా … మాతృ భావనతోనే చూస్తాం. తెలుగు తల్లిని అవమానిస్తే మీరు రాజకీయ స్వార్థంతో దులిపెసుకొని పోగలరేమో! మేము ఆత్మాభిమానం గలవాళ్ళం. సహించ లేము.
  మీ 2వ ప్రశ్నకు సమాధానం నా పోస్ట్ లోని మొదటి పేరాలోనే ఉంది. ఆవేశపడకుండా బాగా చదివి, అర్థం చేసుకొని కామెంట్ వ్రాస్తే బాగుంటుంది కదా!

  స్పందించు

 5. తాడేపల్లి
  అక్టో 21, 2012 @ 15:32:08

  పూరీ తీసిన సినిమాకి ఆంధ్రా ఏరియావాళ్ళ మద్దతు కూడా లేదు. ఎందుకంటే అతను నేరుగా తెలుగుతల్లిని కూడా అవమానించాడు. అతనికి థాయి లాండు తల్లిమీద (ముఖ్యంగా బ్యాంగ్‌కోక్ తల్లి మీద) తప్ప ఏ తల్లిమీదా గౌరవం లేదు. అయితే ఆంధ్రా ఏరియాలో ఎక్కువశాతం విషయాల పట్ల violent reactions ఉండవు గనుక దానికి ఆంధ్రా ఏరియావాళ్ళు మద్దతిస్తున్నారని తెలంగాణవాళ్ళు భ్రమపడుతున్నారు.

  స్పందించు

 6. Dr.Acharya Phaneendra
  అక్టో 21, 2012 @ 15:39:45

  తాడేపల్లి గారు!
  ధన్యవాదాలు!

  స్పందించు

 7. gowri
  అక్టో 21, 2012 @ 15:42:02

  akkada cinema lo oka vedhava politician telugu talli ani cheppi udyamam chestunnadu kaabatti vaadini argument lo gelavadaniki nee talliki vere tallulu ante padada annadu director…deentlo teludu tallini vimarshincham ekkada undi…telugu tallini vaadi swarthaniki vaadukuntunna oka vedhava ki cheppina answer ni pattukoni telugu taalini avamaanichadu anadam correct kadu…

  స్పందించు

 8. Dr.Acharya Phaneendra
  అక్టో 21, 2012 @ 16:00:01

  గౌరి గారు!

  డైలాగులో విలన్ తో ” నీకు పడదు” అనలేదు. “నీ తల్లికి (అంటే తెలుగు తల్లికి) పడదు” అన్నాడు.
  ఆంధ్ర ప్రదేశ్ లో పక్క రాష్ట్రాల తల్లిని పడదు అన్నది ఎప్పుడూ లేదు. చిత్తూరులో తమిళులతో సహజీవనం చేస్తున్నారు. విశాఖలో ఒరిస్సా వాళ్ళను ఆదరిస్తున్నారు. హైదరాబాదులో అందరినీ అక్కున జేర్చుకొన్నారు. ఆ డైలాగుతో ‘తెలుగు తల్లి’ ని, అంటే ఆమె పిల్లలైన తెలుగు వారందరినీ అవమానించినట్టు కాదా?కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి వ్రాస్తే … డైలాగులు అలాగే రూపు దిద్డుకొంటాయి మరి. వాగ్దేవితో ఆటలా?

  స్పందించు

 9. venkat
  అక్టో 21, 2012 @ 19:30:51

  18 న రిలీజ్ అయిన సినిమా కి, 19 న నమస్తే తెలంగాణా ,కెసిఆర్ గారు మరియు అతని అనుచరులు చెప్పేంత వరకు కూడా మన స్వతంత్ర విధ్యార్ది (?) నాయకులకి, తెలంగాణా ప్రజలకి వాళ్ళు ఎంత దారుణంగా అవమానిన్చాబడుతున్నారో తెలియకపోవడం దారుణం. ఒక ఇడియట్ సినిమా తీసిన పూరి కి , వాడి సినిమాకి ఇంత పబ్లిసిటి ఇవ్వడం , తెరవెనక జరిగే రాజకీయాలని గుర్తుకు తేకపోవడం
  విశేషమే.

  స్పందించు

 10. Dr.Acharya Phaneendra
  అక్టో 21, 2012 @ 22:23:06

  వెంకట్ గారు!

  తెలంగాణలో ఉద్యమోన్ముఖులైన విద్యార్థులు, ఉద్యోగులు, నాయకులు సినిమాలు చూడడం మానివేసి చాలా రోజులయింది. ఉద్యమ నాయకులకు, పత్రికకు కూడా పది జిల్లాలలో సినిమా చూసిన సామాన్య ప్రజలు రియాక్టయి చెప్పితే తెలిసింది. తరువాత ఉద్యమ నాయకులు సినిమా చూసి నిర్ధారణ చేసుకొన్నాక, నిరసనలు ప్రారంభించారు. ఇందుకు ఒక రోజైనా సమయం పడుతుంది కదండి. ఇక పబ్లిసిటీ అంటారా? రాముడెంత ప్రసిద్ధి పొందాడో, రావణుడు కూడా అంత ప్రసిద్ధి పొందడం సహజమే కదా! అయితే నెగటివ్ పబ్లిసిటి … నెగటివే కదా!

  స్పందించు

 11. Rangaraju
  అక్టో 21, 2012 @ 22:56:10

  Telugu talla..evadiki talli ani KCR annappudu meeru ekkadiki vellipoyaru mastaru ? Pratyeka rashtram kavalante itara prantala samskrutulanu,acharalanu avahelana cheyyadamena?

  స్పందించు

 12. Dr.Acharya Phaneendra
  అక్టో 21, 2012 @ 23:36:14

  రంగరాజు గారు!
  నా పాత పోస్టులు చూస్తే, నేను అప్పుడూ ఇప్పుడూ ఇక్కడే ఉన్నానని మీకు అర్థం అవుతుంది.
  కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం వల్ల, అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోనూ నాయకులు కొన్ని సార్లు అతిగా రియాక్టయ్యారని, ఇంకా అవుతున్నారని మీకు ఇంకా అర్థం కాకపొతే “మీరే ఎటు వెళ్ళిపోయారో?” అనుకోవలసి వస్తుంది.
  ఇప్పటికైనా ఈ విద్వేషాలు తొలగిపోవాలంటే, వెంటనే తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలసి ఉండాలని మా వంటి మితవాదుల ఆకాంక్ష!

  స్పందించు

 13. Jai Gottimukkala
  అక్టో 22, 2012 @ 01:10:49

  ఫణీంద్ర గారూ, వాళ్ళు ఏమన్నా అన్నా మనకు నష్టం లేదు. ఎవరు ఎంత దెప్పపొడిచినా తెలంగాణకు పోయేదేమీ లేదు. ఎవరో వెకిలి వేషాలు వేస్తె బలహీనపడే స్థాయిలో తెలంగాణా ప్రజలు లేరు.

  ఈ తరహా చిల్లర విషయాలకు రెచ్చిపోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశ్యం. అనవసరంగా వారికి పబ్లిసిటీ ఇవ్వాల్సిన ఖర్మ మనకెందుకు?

  There is no need for us to over react on this trivial matter.

  స్పందించు

 14. Dr.Acharya Phaneendra
  అక్టో 22, 2012 @ 07:02:52

  ‘Jai Gottimukkala’ garu!

  తెలంగాణ ఉద్యమాన్ని దెప్పి పొడిచినా లేదని బుకాయించనివ్వండి. ఎందుకంటే. దాన్ని పకడ్బందిగా చేసే తెలివి వాళ్లకు లేదు. దాన్ని ఒప్పుకొనే ధైర్యం కూడా వాళ్లకు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షలోని న్యాయబద్ధతను,ధర్మబద్ధతను ఎదిరించి ప్రశ్నించేందుకు వాళ్ళ దగ్గర ఏ పాయింటూ లేదు. కాని, దొంగ తెలివితో ఆ పని చేయాలనుకొన్నా, దానికి అకారణంగా తెలుగు తల్లిని అవమానించడం ఎందుకు? దానికి కుహనా సమైక్యవాదం మత్తులో మునిగి జోగుతూ, తామూ తెలుగు వారమే అని కూడా మరచిపోయి సీమాంధ్రులు మిన్నకుండడం ఏంటి? పైగా దాంట్లో సందేశం ఉందని మెచ్చుకోవడం ఏంటి? ఒక తెలుగు కవిగా ఒళ్ళు కంపర మెత్తి నా నిరసనను తెలియజేసాను. కుటిల నీతి పనికి రాదని చెప్పాను. రాష్ట్రాలుగా విడిపోయినా మానసికంగా సమైక్యంగా ఉండాలని తెలియజెప్పాను. నిజమైన సమైక్యత అంటే అదీ అని చాటాను.అది నేను చేసిన ప్రయత్నం. ఇక చర్చకు స్వస్తి!
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించు

 15. Samanyudu
  అక్టో 22, 2012 @ 18:31:50

  దయచేసి నేను వ్రాసిన కామెంట్ ని తొలగించిన కారణం చెప్పగలరు

  స్పందించు

  • Dr.Acharya Phaneendra
   అక్టో 22, 2012 @ 20:27:58

   saamaanyudu gaaru!

   మీ కామెంటే కాదు. నాకు సమర్థనగా వచ్చిన మరో 4 (మొత్తం 5) కామెంట్లను కూడా తొలగించాను. కారణం అవన్నీ ‘చర్చకు స్వస్తి’ అన్నాక పోస్ట్ అయ్యాయి.
   ఇక మీ పోస్ట్ తొలగించడానికి ప్రధానంగా మరో 3 కారణాలున్నాయి.
   1. మీరు “రామాయణమంతా విని, రామునికి సీత ఏమవుతుంది?” అన్నట్టు మళ్ళీ ఉద్యమం తొలి రోజుల్లో చేసి, చేసి, కాలం చెల్లిన చర్చను తిరగదోడుతున్నారు.వీటికి సమాధానాలు నా పాత పోస్టుల్లో, వాటికి సంబంధించిన చర్చల్లోగాని, ఆనాటి వివిధ పత్రికల్లో వచ్చిన చర్చల్లోగాని, దొరుకుతాయి.
   2. మీరు నాకు నాలో లేని అభిప్రాయాలను అంటగట్టి, ఆ పునాదిపై వాదించాలని చూస్తున్నారు.అది తప్పు.
   3. ఏ విధంగా చూసినా అది ప్రస్తుత పోస్టుకు సంబంధించిన చర్చనుండి ప్రక్కకు తప్పించేలా ఉంది.
   ఇంకా అంతగా చర్చించాలని ఉంటే, మీ కామెంటును నా dr.acharya_phaneendra@yahoo.com కు మెయిల్ చేయండి.

   స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: