నలుబది వేలు …

నలుబది వేల వీక్షకులు నాదగు నీ రమణీయ ‘బ్లాగు’నున్

చెలగియు ప్రేమ మీర దరిశించిరి నేటికి – నాలుగేళ్ళలో 

పలు విధ శీర్షికల్ నిలిపి; పద్యము, గద్యము, గేయ మాదిగా 

గల బహు ప్రక్రియల్ వెలయ, కానుక లిచ్చిన తృప్తి నొందితిన్!

 

 

అందరికీ ‘వినాయక చతుర్థి’ శుభాకాంక్షలతో –

 

డా. ఆచార్య ఫణీంద్ర   

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. jyothi
  సెప్టెం 20, 2012 @ 05:36:46

  అభినందనలు, పండగ శుభాకాంక్షలు..

  స్పందించండి

 2. జ్యోతిర్మయి
  సెప్టెం 20, 2012 @ 10:20:09

  అభినందనలు ఫణీంద్ర గారు.

  స్పందించండి

 3. padmarpita
  సెప్టెం 20, 2012 @ 13:30:54

  అభినందనలు.

  స్పందించండి

 4. Phani Prasanna Kumar
  సెప్టెం 20, 2012 @ 17:10:17

  పలుకుల తేనెలూరు పలువన్నెలు చిందుచు విందుసేయు తా
  కులుకుచు నాట్యమాడు మది కోమలమౌ యనుభూతినింపు మీ
  పొలుపగు కావ్యకన్య విరబూసెను జాలపు పూలతోటలో
  నలుబదివేల తుమ్మెదలు నాణెపు తేనెల జుఱ్ఱుచుండగన్.

  స్పందించండి

 5. Phani Prasanna Kumar
  సెప్టెం 20, 2012 @ 17:50:36

  పలుకుల తేనెలూరు పలువన్నెలు చిందుచు విందుసేయు తా
  కులుకుచు నాట్యమాడు మది కోమలమౌ యనుభూతినింపు మీ
  పొలుపగు కావ్యపుష్పమది బూసెను జాలపు పూలతోటలో
  నలుబదివేల తుమ్మెదలు నాణెపు తేనెల జుఱ్ఱుచుండగన్.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  సెప్టెం 20, 2012 @ 22:52:02

  జ్యోతి గారికి –
  జ్యోతిర్మయి గారికి –
  పద్మార్పిత గారికి –
  హృదయ పూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  సెప్టెం 20, 2012 @ 23:19:34

  హృద్యంబుగ నల్లితివయ
  సద్యః స్ఫూర్తిని ఫణిప్రసన్నకుమారా!
  పద్యములో అభినందన –
  ఆద్యంతము నేను మురియ! అభివందనముల్!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: