కలల రేడు …

 

 

 

అతడు తలను ఒక ప్రక్కగా వాల్చి ఊపితే
ప్రేక్షక ప్రపంచాలు ఉర్రూతలూగేవి.
అతడు చిరునవ్వులు చిందిస్తే
వీక్షక హృదయాలు పులకించిపోయేవి.
అతడు “పుష్పా! ఐ హేట్ టియర్స్!” అంటే
అభిమానులు మనోధైర్యాన్ని పెంచుకొనేవారు!
అతడొక అంతులేని ప్రేమికుడు –
కన్నె పిల్లల కలల రేడు –
అతని కోసం ఉప్పొంగిన ప్రణయ జలధి తరంగాలెన్నో!
అతని ప్రేమ దాహార్తి తీర్చిన ఒక్క మంచి నీటి చుక్క లేదు!
కోట్లాది మంది అతని విరహంలో వేసారుతున్నా-
అతడు ఏకాకిగానే మిగిలాడు
తన ఊహా సుందరి నిరీక్షణలో!
అతడు ప్రణయ మధువును ప్రేమించాడు!
తుదకు మృత్యు గరళం అతణ్ణి వరించింది!!

అతడు ప్రేమ రవి!
ఒక భావ కవి!!

అతనికి మరణం లేదు –
అవును …
వెండి తెర వెలుగుతున్నంత వరకు
అతనికి మరణం లేదు!

నా అభిమాన నటుడు “రాజేశ్ ఖన్నా” పరమపదించిన వేళ … సంతాపంగా …

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. చిన్ని ఆశ
  జూలై 20, 2012 @ 15:59:36

  అవునండీ, వెండితెర వెలుగుల్లో రాజేష్ ఖన్నా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటారు.
  బాగా రాశారు ఆయన స్మృతిగా….

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  జూలై 22, 2012 @ 13:59:15

  “చిన్ని ఆశ” గారు! ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: