చలివేంద్రము

చలివేంద్రము

రచన: ‘పద్య కళాప్రవీణ’  డా. ఆచార్య ఫణీంద్ర 

ఎక్కడికోయి ఓ పథిక! ఎండలు మండుచునుండ, దేహమే 

ఉక్కిరి బిక్కిరైన సరె! ఊరక సాగుచునుందు వేల? నీ

నిక్కిన నీరసం బుడిగి, నీవు నొకింతగ  నూరడిల్లగా 

గ్రుక్కెడు మంచి నీళ్లివిగొ! గొంతును తడ్పుము చల్ల చల్లగాన్!

 

కాలిన కంద గడ్డయె ముఖంబయొ పాపము! బాటసారి! నీ 

కాళులు, సేతులున్, ముఖము కడ్గుము శీత జలంబు తోడ – నీ 

కాల మొకింత గడ్పుమిట! కమ్మగ త్రావుము మంచి తీర్థమున్!

చాల శ్రమించి తెండ పడి సాగుచు – ఇంచుక సేద తీరుమా!

 

ఎండ కాలమందు మండు మధ్యాహ్నాన 

దారి బోవు వాని దైన్య మెరిగి,

దాత యొకడు నిలుప ధర్మాత్ముడై నన్ను-

పుడమి, సేవ కొరకు పుట్టు దాన!

 

చలివేంద్రము నా నామము!

ఇల వేడిమి తాళ లేని ఎందరికో నే 

జలమందించుచు నుందును –

జల దానము కన్న మిన్న జన్నము గలదే?

 

బాణము గ్రుచ్చినట్లు ప్రతి భాను మయూఖము మేను తాకగా 

ప్రాణము తల్లడిల్లు జన వాహిని దాహము తీర్చినంతటన్ –

ప్రాణము లేచి వచ్చి, సుధ పానము చేసిన స్ఫూర్తి గల్గదే!

ఏను పరోపకారమున కీ భువి నిట్లు ప్రతీక గానొకో!

 

తనివి దీర, నేనందింప త్రావి నీరు 

తరలి పొమ్మింక హాయి నీ దారిలోన –

మదిని గుర్తుంచు కొనెదేని, మరతువేని, 

తీర్చితిని దాహమని నాకు తృప్తి చాలు!

 

ఏ వేసవినం దైనను 

నీవీ దారిని తరలిన, నీరము కొరకై 

రావోయి నాదు చెంతకు –

సేవింపగ సతము నేను సిద్ధము సుమ్మీ!

 

— $$$ —  

 

 

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

  1. అర్కసోమయాజి
    మే 06, 2012 @ 08:20:11

    ఆచార్యా!ఫణీంద్రార్య!మీ కవితల్ గ్రోలుచు సేదతీరితి ప్రపాశాలా విహారుండనై.

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    మే 06, 2012 @ 08:55:23

    అర్క సోమయాజి గారు!
    సాహితీ మత్తేభ ప్రశంసనందుకొని సంతోషిస్తున్నాను.
    ధన్యవాదాలు!

    స్పందించండి

  3. రవి
    మే 06, 2012 @ 18:55:38

    వస్తువు, శబ్దసౌందర్యము రెండూ బావున్నాయండి. మరిన్ని వ్రాయవలసింది. చాలా తక్కువగా వ్రాశారు.

    స్పందించండి

  4. Dr.Acharya Phaneendra
    మే 07, 2012 @ 01:38:07

    ధన్యవాదాలు రవి గారు!
    సహజంగా పొంగి వచ్చిన భావాలంతే మరి! ప్రయత్నించి విస్తరిస్తే … గాఢత తగ్గుతుందేమో!
    ఏమయినా, మరోసారి ప్రయత్నిస్తాను లెండి!

    స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: