పాడవే చెలి!

పాడవే చెలి! [గీతం]

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

[2003లో అనుకొంటాను – ’సిలికానాంధ్ర’ (యు.ఎస్.ఏ.) వారు అంతర్జాతీయ స్థాయిలో ’తెలుగు గేయ కవితల పోటీ’ నిర్వహించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ’న్యాయ నిర్ణేత’గా వ్యవహరించిన ఆ పోటీలో నా ఈ లలిత గీతం పురస్కారాన్ని పొందింది. నేను రచించిన వాటిలో, నాకు బాగా నచ్చిన గీతాలలో ఇది ఒకటి. ఆస్వాదించండి.]

పాడవే చెలి! తీయ తీయగ –
పరవశము నందీయగ!
పరవశము నందీయగ!!

వివిధ భాషల వెలయ జేసిన
మధుర కవితల మధువులన్నీ –
ఒక్కచో కలబోసి గ్రోలుచు
మక్కువను మది తీర్చుకొనునటు –
పాడవే చెలి! …

తీపి గొంతుక తీగ సాగుచు
హృదయ సీమల నెల్ల తాకుచు –
తాకు తాకున తన్మయత్వపు
పూల పుప్పొడి రాల జేయగ –
పాడవే చెలి! …

వేడి వేసవి వీధి సాగుచు
నీడ పట్టున నిలిచినంత –
మలయ పవనం మేను తాకిన
మధురమౌ అనుభూతి కలుగగ –
పాడవే చెలి! …

-***—

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. kastephale
  జన 29, 2012 @ 18:06:12

  ఆనందంగా వుంది.

  స్పందించండి

 2. padmarpita
  జన 30, 2012 @ 00:27:27

  బాగుందండి

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  జన 30, 2012 @ 10:11:31

  kastephale garu!
  padmarpita garu!

  aneka dhanyavadalu!

  స్పందించండి

 4. రవి
  జన 30, 2012 @ 20:47:23

  చాలా బావుందండి. చక్కని రాగం కూర్చితే మంచి పాట కూడా అవుతుంది.

  అప్రస్తుత ప్రశంస: బాపు బొమ్మ – చాలా కాలం క్రితం ఈ బొమ్మను ఓ పత్రికలో చూశాను. మా అమ్మ పోలికలతో ఉండటం చూసి ఆశ్చర్యంతో ఆ పేపర్ కటింగు ను చాలా కాలం నాతో పెట్టుకున్నాను.. అదే బొమ్మ మీ బ్లాగులో రంగుల్లో చూడ్డం చాలా ఆనందంగా ఉంది.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జన 30, 2012 @ 21:06:00

  Thank you Ravi garu!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: