ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

స్వాతంత్ర్య భారతికి ‘షష్టి పూర్తి‘ సంబరాలు జరుగుతున్నాయి
“ స్వరాజ్య ఫలాలతో చేసిన సురుచిరమైన కేక్ ను కట్ చేసి,
అందరికీ సమానంగా పంచుతాం “ అన్నారు అధినాయకులు
“ ఎప్పటిలాగానే సగభాగం మాది “ అన్నారు వెనుకబడిన వర్గాల వారు
“ సరే! సగభాగంతోనే సరిపెట్టుకొందాం! “ అనుకొన్నారు అగ్ర వర్ణాల వారు
“ మా భాగం వేరు చేసి ఇవ్వా “ లందొక మహిళ
“ మా సంగతేంటి? “ అన్నాడొక మైనారిటీ
” మతం మారినా, మా భాగం మాకే ఉండాలి “ అన్నాడు దళితుల్లో ఒకడు
“ మాలలు మాదిగలకు కలిపి ఒకే పెద్ద ముక్క ఇవ్వా “ లన్నాడొక మాల
“ అదేం కుదరదు – నాలుగు ముక్కలు చేసి, ఎవరి ముక్క వారికివ్వాలి “ అన్నాడొక మాదిగ
“ దళితులే వెనుకబడిన వారా? ఇతర వెనుకబడిన వర్గాలు లేవా? ” –
అన్నారు కులాల చిట్టా విప్పి కొందరు
“ కేక్ క్రీమును చప్పరించడానికి ‘క్రీమీ లేయర్ల‘ గొడవేంటి? ఎత్తేయాలి “ అన్నా రింకొందరు
“ తరువాత మిగిలేదెంతో – తగిలేదెంతో – మాకూ ఈ పంపకాల్లోనే వాటా ఇవ్వాలి ” –
అన్నారు కొత్త కులాల వారు

ఇలా … ” మేం వెనుకబడ్డ వాళ్ళం ” అంటే, ” మేం వెనుకబడ్డ వాళ్ళం ” అంటూ –
గుండీలు తెంపుకొని, చొక్కాలు చింపుకొని గుండెలు బాదుకొన్నారు అందరు!

ఇంతలో … సందట్లో సడేమియా అన్నట్టు – డబ్బులు గుప్పి, పైరవీలు నడపి,
దొంగ చాటుగా దొరికినంత మింగేస్తున్నారు బడా చోరులు!

” మనకే సరిపోదు – జనాల కేం పంచుతాం? ” అని గొణుక్కొన్నారు రాజకీయ నాయకులు
కత్తులతో కట్ చేసుకొండంటూ జనాలకు కత్తుల నందించారా వినాయకులు

కత్తులు దూసి, ” అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేస్తాం ” అన్నారా జనాలు

అందరూ ఒక్కసారి మొత్తం కేక్ పైబడి మాకంటే మాకంటూ పీక్కొంటున్నారు
మూతి కందిన వాడు పీకల దాకా మెక్కాడు
చేతి కందని వాడు నేల పాలు చేసాడు
ఆ కాట్లాటలో అందరి ముఖాలపై పడ్డాయి –
కేకు తాలూకు కక్కుర్తి మచ్చలు!

చేతగాని పేద చవట బ్రాహ్మడు మాత్రం, చవులూరినా –
” కేక్ అప్రాచ్యం! ’’ అనుకొని ముక్కు మూసుకొని
ఒక మూల ఉపవాస దీక్షకు పూనుకొన్నాడు!

( సమకాలీన దేశ పరిస్థితులను సరదాగా చిత్రించే ప్రయత్నం –
” నా వాటా నాకు కావాలి ” అని ప్రతి ఒక్కడూ పోరాడే పరిస్థితుల నుండి,
ఆ ప్రతి ఒక్కడికీ ” ఇది నీ వాటా – తీసుకో! ” అని మిగితా వారంతా ప్రేమగా అందించే
రోజులు రావాలని ఆకాంక్షిస్తూ – )

నా భారతీయ సోదర సోదరీమణులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో –

డా. ఆచార్య ఫణీంద్ర

— *** —

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. kastephale
  జన 26, 2012 @ 15:38:56

  వున్న విషయాన్ని బాగా చెప్పేరు. తెల్ల వాడు ప్రవేశపెట్టిపోయిన విభజించు పాలించు నేటి నాయకులకు వరమైపోయింది

  స్పందించండి

 2. padmarpita
  జన 26, 2012 @ 16:25:10

  సహజీవనము నేర్పి…
  సంఘర్షణలు ఆపి…
  సౌక్యమార్గము చూపి…
  సంతోషముతో మురిసి…
  ఎగరాలి మువ్వన్నెల జెండా!
  జైహింద్.
  మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

  స్పందించండి

 3. Dr. Acharya Phaneendra
  జన 27, 2012 @ 00:10:29

  kastephale garu!
  padmarpita garu!

  thanks a lot!

  స్పందించండి

 4. Nageswara Rao, NFC
  ఫిబ్ర 21, 2012 @ 22:46:12

  Phaneendra Garu,

  Mee Ee Kavitha akshara satyame.

  Saahitya sevalo meeku Aayuraarogyamastu.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  ఫిబ్ర 22, 2012 @ 08:05:51

  నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: