ప్రపంచీకరణ భూతం

ప్రపంచీకరణ భూతం

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

పచ్చని పంటభూములను పశ్చిమ దేశపు కంపెనీలకై
ఇచ్చి, బొటాబొటిన్ ధనము నేదొ ముఖంబున గొట్టి రైతుకున్ –
హెచ్చు ’కమీషనుల్’ గొనెద రిప్డు దళారి ప్రభుత్వ నాయకుల్!
బిచ్చమునెత్తె జాతికిని వెన్నెముకైనటువంటి రైతయో!!

”దున్నెడి వానిదే పొలము – దోపిడి నొప్ప” మటంచు జెప్పి, రై
తన్నల కోసమై నిలిచి దండిగ పోరిరి నాటి నాయకుల్!
కన్నుల గానగా స్థలము – ’కబ్జ’ యొనర్చుచు ’సెజ్జు’ పేర, రై
తన్నల వెన్నునే విరుచు త్రాష్టులు.. దుష్టులు.. నేటి నాయకుల్!!

నేటి ’హైటెక్కు’ కాలాన నిజము! చూడ –
’క్యాప్టలిస్టుల’ కే సర్వ కార్య సిద్ధి!
మధ్య, క్రింది తరగతుల మానవులకు
బ్రతుకు ’లోటెక్కు’ నై పూర్తి భ్రష్టమయ్యె!

కరవు తినగ ముద్ద – కల వెన్నొ ’సెల్ ఫోన్లు’!
కరవు త్రాగునీరు – కలదు ’కోకొ’!
డబ్బటన్న నిపుడు ’డాలరే’ అయిపోయె!
చేతి వృత్తులన్ని చితికిపోయె!

ఎక్కడొ విదేశముల మరి
ఎక్కువయిన ’పెట్రొలు’ వెల – ఇక్కడ నకటా!
ఎక్కువనై అన్ని ధరలు –
దిక్కును కనరాక కూలు దీనుల బ్రతుకుల్!

భూమిని నమ్మి రెక్కలను ముక్కలొనర్చెడి యన్నదాతలున్;
వేమరు కష్టముల్ సలిపి వృత్తి కళన్ వికసించువార లిం
కేమియు చేయలేక, బ్రతికింక ప్రయోజనమేమి లేదటన్ –
భామను, పిల్లలన్ విడచి ప్రాణములన్ బలిపెట్టి రక్కటా!

ఈ ’ప్రపంచీకరణ’ మందు నెదుగుచుంద్రు
మిద్దెపై ధనవంతులు మిద్దె గట్టి!
నిలువ దేశాన కాసింత నీడ లేక
రాలిపోవులే పేదల బ్రతుకు లింక!

          —***—

ప్రకటనలు

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. anrd
  జన 20, 2012 @ 12:25:03

  చక్కటి పోస్ట్ ను అందించినందుకు కృతజ్ఞతలండి.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  జన 20, 2012 @ 18:54:58

  THANK YOU – ‘anrd’ GARU!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: