భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం!

నేను చూసిన గొప్ప చిత్రాలలో ఇది ప్రత్యేకమైనది. ‘టైటానిక్‘ లాంటి చిత్రం సృష్టించడం ‘హాలివుడ్‘ కే సాధ్యం కావచ్చు. కాని “మేము మా స్థాయిలో అంతటి గొప్ప చిత్రం నిర్మించగలం-“ అని నిరూపించిన గొప్ప చిత్రం – ‘జర్నీ‘! ప్రమాదాలు .. ప్రణయాలు … అనుబంధాలు …. సమాజ సేవలు….. అన్నీ సమపాళ్ళలో కలగలిపి పండించిన రసవత్కావ్యం- ‘జర్నీ‘!!

అంతే కాదు – ఇది సామాజిక బాధ్యతను ఎత్తి చూపే చిత్రం. ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం. ట్రాఫిక్ పోలిస్ విభాగం పూనుకొని ప్రజలందరికీ ఈ చిత్రాన్ని ఉచితంగా చూపాలి. ఒక ACCIDENT ఎంతో మంది జీవితాలను ఎలా దౌర్భాగ్య స్థితికి నెట్టుతుందో కళ్ళకు కట్టే చిత్రం.

రెండు బస్సుల ఢీ ..అవసరానికి తగినంత గ్రాఫిక్స్… తెలివైన చలాకీ పిల్ల- ప్రియుడు మరణిస్తే బేలగా రోదించడం … డెత్ బెడ్ పైనున్న ప్రియురాలితో- నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే నాయకుడు …. తొలిచూపుల ప్రేమ తొలి గడియలలోనే- బ్రతుకు తెల్లవారిన విద్యార్థిని ….. 15 B …… 37 G …….. చివరలో GO SLOW అన్న SIGN BOARD సందేశం  …….. కంట తడి పెట్టని ప్రేక్షకులుంటారా?

మధుమతి పాత్రధారిణి నటన ..హృదయాలకు హత్తుకొనే స్క్రీన్ ప్లే … శరవణన్ దర్శకత్వ ప్రతిభ … చిత్రం చూసాక, ఆ క్షణం – ”మేము భారతీయులం” అని గర్వించిన వేళ్ళ మీద లెక్కపెట్టదగిన కొన్ని మధుర క్షణాలలో ఇదీ ఒకటి అనిపించింది. అవును – నిజం! ’జర్నీ’ – భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం!

– డా. ఆచార్య ఫణీంద్ర

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. Dr.Acharya Phaneendra
  అక్టో 20, 2013 @ 07:46:28

  ఈ రోజు నా పాత పోస్టులను ఒకసారి తిరిగి చూస్తూ, ఈ పోస్టును మళ్ళీ చదివాను.
  తమిళులు కూడ భారతీయులే … మన సోదరులే … వారు ఒక గొప్ప చిత్రాన్ని నిర్మిస్తే – మనమూ గర్వించాలి … వారిని వేనోళ్ళ ప్రశంసించాలి … అన్న ఉదాత్త, నిష్పాక్షిక, నిస్వార్థ భావజాలంతో, నిజాయితీతో కూడిన ఔదార్యం గల ఒక్కడంటే ఒక్క తెలుగువాడు కూడ ఈ పోస్టుకు సంఘీభావం పలుకుతూ వ్యాఖ్య పెట్టకపోవడం నిజంగా తెలుగు బ్లాగర్ల మానసిక దౌర్భాగ్యమేమో … అనిపించింది.

  స్పందించు

 2. తాడిగడప శ్యామలరావు
  అక్టో 20, 2013 @ 10:31:44

  ఫణీంద్రగారు,

  మీరొక్క విషయం మరచారు. బ్లాగర్లు ఒక టపాను చదవాలీ అనుకోవటానికి అనేక కారణాలుంటాయి. అలాగే ఒక టపాను చూడకపోవటానికీ అనేక కారణాలుంటాయి.

  కొందరు కొన్ని కొన్ని బ్లాగుల్ని సెలక్ట్ చేసుకొని అవే తరచుగా చూస్తారు. కొందరు కొన్ని విషయాలకు సంబందించిన టపాలే చదవటానికి ఇష్టపడతారు. కొందరు అప్పుడప్పుడు మాత్రమే బ్లాగులు చూస్తారు. కొందరు ఒకటి రెండు బ్లాగుల్లో అతితరచుగా దర్శనం ఇస్తున్నా మిగతా బ్లాగుల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ‌ చూడరు. కొందరు బ్లాగులు వ్రాస్తుంటారు కాని ఇతరుల బ్లాగుల జోలికి పోనే పోరు. కొందరు అగ్రిగేటర్లలో (ఎక్కువ మంది చదివినవి వంటి వర్గీకరణల ద్వారా) వచ్చిన రేటింగులు చూసి అటువంటీ టపాలే చదువుతారు. కొందరు బ్లాగర్లు తమతమ టపాలకు ఈ-మెయిల్ ప్రచారం చేసుకుంటున్నారు – అవి చూసి కొందరు చదువరులు వాటినే తెరుస్తున్నారు. చాలా మంది పనుల వత్తిడి వలన బ్లాగుల్లో‌ పాతటపాలనూ వెదకి తరచి చూసేంత తీరిక కలవారు కాదు – బ్లాగర్లలో హెచ్చు శాతం మంది IT ఉద్యోగులే అనుకుంటాను.

  ఇలా సవాలక్ష కారణాల వలన అందరూ అన్ని బ్లాగులనూ దర్శించటమూ‌ లేదు, తెలిసిన బ్లాగులే ఐనా వాటి టపా లన్నింటినీ చదవటమూ‌ లేదు.

  ఒక‌ టపాను చదివి ఆనందించిన వారిలో అత్యధికులు తమ ఆనందాన్ని ఒక వ్యాఖ్యరూపంలో టపా రచయితకు తెలియజేయటానికి బధ్ధకిస్తున్నారు. వారిలో చాలామంది ప్రత్యేకంగా నేను అడగవలసింది కాని చెప్పవలసింది కాని లేనప్పుడు అనవసరంగా వ్యాఖ్య ఉంచటం దేనికీ అనుకుంటున్నారని నా అభిప్రాయం. అలాగే ఒక టపా చదివి దానిలో విషయం తమకు అంగీకారం‌కాకపోయినా, “పోనిద్దూ ఎవరి అభిప్రాయం వారిది” అని ఏమీ‌ వ్యాఖ్యానించకుండా ఉండే వాళ్ళే అదికం. ఈ రెండు తరగతుల వాళ్ళల్లోనూ అధికులు బ్లాగర్లే‌ కదా.

  అందు చేత కొన్ని కొన్ని మంచి టపాలకు వ్యాఖ్యలు రాకపోవటాన్ని “తెలుగు బ్లాగర్ల మానసిక దౌర్భాగ్యమేమో” అనుకోవద్దని నా విజ్ఞప్తి.

  నా విషయానికి వస్తే, మీ టపా ప్రచురించబడిన కాలానికి నేను రోజుకు పన్నెండు గంటల పైచిలుకు వృత్తిభారంలో బ్లాగుప్రపంచానికి దూరంగా ఉన్నాను. అప్పట్లో‌నాకు ఎక్కువ బ్లాగులతో‌ పరిచయం కూడా లేదు. చలనచిత్ర రంగానికి సంబంధించిన అంశాలపై మరీ‌ అంత ఆసక్తీ నాకు లేదు కాబట్టి ఒక వేళ నా దృష్టిలో పడినా ఆ టపాను నేను చదివే వాడిని కానేమో.

  అదీ‌కాక, ఎప్పుడు ఎవరి వలన ఏమాట వస్తుందో అని బ్లాగుప్రపంచజీవు లంతా పొరపాటున మంచి టపాలు తమ దృష్టికోణం నుండి తప్పిపోకుండా శ్రధ్ధవహించటం అంత సులభమైన విషయమూ కాదు.

  మిమ్మల్ని నొప్పించాలని కాదు, నా అభిప్రాయం మీకు తెలియ జేయాలని మాత్రమే ఈ వ్యాఖ్య వ్రాసాను.

  స్పందించు

 3. Dr.Acharya Phaneendra
  అక్టో 20, 2013 @ 11:47:06

  శ్యామలరావు గారు!

  మీరు చెప్పిన విషయాలన్నీ కొంత మేరకు వాస్తవమైనా, ఈ టపా విషయంలో కాదని చెప్పగలను. ఆ రోజు ఆ టపాను వీక్షించిన వారి సంఖ్య రెండు వందల పై చిలుకే! అది నా టపాల సగటు వీక్షకుల సంఖ్య కంటే చాల ఎక్కువే! ఆందులో కొంతమందికి మీరన్నట్టు ఆ విషయం తమకు అంగీకారం‌ కాక, “ఎవరి అభిప్రాయం వారిది” అని వదలి వేసారనుకొన్నా – మిగితా వారిలో కనీసం ఒక్కరంటే ఒక్కరు నన్ను సమర్థిస్తూనో, విభేధిస్తూనో ఒక్కటంటే ఒక్క వ్యాఖ్య చేయకపోవడం … ఆ రోజు కాకపోయినా, ఈ రోజు …. ’అసాధారణం!’ అనిపించింది.
  ఈ రోజు మిమ్మల్నే చూడండి – ఒక చిన్న వ్యాఖ్యకు వెంటనే ఎలా స్పందించారో!
  ఒకరి తప్పును వ్యాఖ్యానించడానికి కలిగిన స్పందన … ఒకరి ఒప్పును వ్యాఖ్యానించడానికి కలుగక పోవడమే – మానసిక దౌర్భాగ్యం!
  కాదంటారా?

  స్పందించు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: