మూడు వత్సరాలు .. ముప్పది వేల వీక్షణలు …

గత అక్టోబర్, నవంబర్ మాసాలలో సిస్టం ముందు కూర్చునే అవకాశమే చిక్కలేదు. నిన్న వర్డ్ ప్రెస్ లో నా బ్లాగు ట్రాఫిక్ విశ్లేషణ చూసాక గుర్తుకొచ్చింది – నవంబర్ మాసంలో నేను అంతర్జాలంలో ప్రవేశించి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయని.

*** BELATED HAPPY BIRTHDAY TO MY BLOG ***

ఈ మూడు సంవత్సరాలలో ముప్పయి వేలకు పైగా వీక్షకులు నా బ్లాగును సందర్శించారు. అంటే సగటున సంవత్సరానికి పది వేల చూపులు నా బ్లాగుపై పడ్డాయన్న మాట.
5 డిసంబర్ 2010 నాడు ఒకే రోజు అత్యధికంగా 183 మంది  నా బ్లాగును దర్శించారు. ఆ రోజు నేను ప్రచురించిన టపా – నా ’వరాహ శతకం’ కావ్యావిష్కరణ సభ విశేషాలతో కూడుకొన్నది.
జూలై 2009 నెలలో అత్యధికంగా 1840 వీక్షణలు నా బ్లాగుపై ప్రసరించాయి. ఆ మాసంలో నేను ప్రచురించిన టపాలు 14. ఆ టపాలలో నా ’వరాహ శతకం’ పద్యాలు, నేను రచించిన కొన్ని ’ఏక వాక్య కవితలు’, ’మహాకవి దాశరథి’ వచన కవిత, ’గాలి బ్రతుకులు’ హాస్య స్ఫోరక పద్యకవిత, ’మతమేదైనా.. కులమేదైనా..’ అభ్యుదయ గీతం ఉన్నాయి. వీటితోబాటు నా ’విజయ విక్రాంతి ( కార్గిల్ యుద్ధంపై దీర్ఘ కవిత )’ పై ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు అందించిన కావ్య సమీక్ష ఉంది.
2008లో నేను ప్రచురించిన టపాలు 5; ప్రసరించిన వీక్షణలు 432.
2009లో నేను ప్రచురించిన టపాలు 92; ప్రసరించిన వీక్షణలు 12243.
2010లో నేను ప్రచురించిన టపాలు 37; ప్రసరించిన వీక్షణలు 8393.
2011లో నేను ప్రచురించిన టపాలు 41; ప్రసరించిన వీక్షణలు 8879.
2012లో నేను ప్రచురించిన టపా 1; ప్రసరించిన వీక్షణలు 271.
మొత్తం మూడేళ్ళ మూడు నెలల్లో  ప్రచురించిన టపాలు 176; మొత్తం వీక్షణలు 30218.

ఇక ముందు కూడ బ్లాగు మిత్రులు నన్నిలాగే ప్రోత్సహిస్తూ, నా రచనలను ఆదరిస్తారని ఆశిస్తూ …

భవదీయుడు

ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. G.S.Lakshmi
  జన 10, 2012 @ 19:50:34

  హృదయపూర్వక అభినందనలండీ…

  స్పందించండి

 2. padmarpita
  జన 10, 2012 @ 19:59:45

  అభినందనలు ఆచార్య పణీంద్రగారు………

  స్పందించండి

 3. జ్యోతి
  జన 10, 2012 @ 21:02:49

  అభినందనలు. అఫ్పుడు మీ బ్లాగును కూడా చూస్తుండండి.. పాపం దిగులు పెట్టుకుంటుంది..:)

  స్పందించండి

 4. prabhakar
  జన 11, 2012 @ 13:41:29

  i am very thankful to you for releasing blog in Teluu

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జన 11, 2012 @ 18:40:04

  లక్ష్మి గారికి –
  పద్మ గారికి –
  జ్యోతి గారికి –
  ప్రభాకర్ గారికి –
  అనేకానేక ధన్యవాదాలు!

  స్పందించండి

 6. ramunarisimha
  ఫిబ్ర 10, 2012 @ 16:15:17

  Sir,

  Meeku abhinandanalu.

  ramnarsimha,
  nalgonda.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: