వానమామలై వరదాచార్యుల శత జయంతి సభలో …

సుప్రసిద్ధ మహాకవి, “అభినవ పోతన” బిరుదాంకితులు, “పోతన చరిత్రము” మహాకావ్య కర్త – కీ.శే. వానమామలై వరదాచార్యుల శత జయంత్యుత్సవాల ప్రారంభ సభలో పలువురు లబ్ధ ప్రతిష్ఠులైన మహాకవులతోబాటు నాకు సత్కారం చేయడానికి “అభినవ పోతన సాహిత్య సాంస్కృతిక సమాఖ్య” మరియు “శత జయంత్యుత్సవ సమితి” నిర్వాహకులు నిర్ణయించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఆగస్ట్ 31 న హైదరాబాద్ “రవీంద్ర భారతి” లో ఆ మహాకవి స్మృతి చిహ్నంగా సత్కారం అందుకొంటున్న పద్య కవులలో నేనూ ఒకణ్ణి కావడం నాకెంతో గర్వ కారణం. ఆసక్తి గల సాహిత్యాభిమానులు ఆనాటి సభకు విచ్చేసి జయప్రదం చేయడంతోబాటు, నన్ను ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. కోడీహళ్లి మురళీమోహన్
  ఆగ 24, 2011 @ 04:12:30

  హృదయపూర్వక అభినందనలు! ఈ సత్కారానికి మీరు అన్ని విధాలా తగినవారు.

  స్పందించండి

 2. కంది శంకరయ్య
  ఆగ 24, 2011 @ 08:56:17

  సంతోషం! అభినందనలు!
  1979లో ఉద్యోగార్థినై రికమండేషన్ లెటర్ పట్టుకొని బ్లాక్ ప్రెసిడెంట్ గారిని కలవడానికి ‘చెన్నూరు’ వెళ్ళాను. వారు ఊళ్ళో లేరు. రెండురోజుల తర్వాత వస్తారని తెలిసింది. ‘వానమామలై’ వారిని కలిసాను. వారు తమ ఇంట్లో నాకు మూడురోజులు ఆశ్రయ మిచ్చారు. ఆ మూడు రోజులూ నాతో ఆత్మీయంగా సాహిత్య సంభాషణ చేసారు. వారికి నా ‘వరదశతకం’ చదివి వినిపించాను.
  అవకాశం ఉంటే 31 నాటి సభకు వస్తాను. ధన్యవాదాలు.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  ఆగ 24, 2011 @ 23:21:04

  మురళీమోహన్ గారికి్ –
  శంకరయ్య గారికి –
  హృదయపూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: