దుఃఖం ముంచుకొస్తోంది…

దుఃఖం ముంచుకొస్తోంది…

రచన : డా.ఆచార్య ఫణీంద్ర

దుఃఖం ముంచుకొస్తోంది

భగభగ మండే పరిస్థితుల అగ్నిగుండంలో
మలమల మాడుతున్న నాకు
దుఃఖం ముంచుకొస్తోంది

దరి జేరే దారి లేక దగ్ధమౌతున్న
నన్ను చూసి నాకే జాలి వేసి
దుఃఖం ముంచుకొస్తోంది

నేననుకొన్నాను –
గతాన్ని మరచిపోయానని –
మరి ఇదేమిటి ..
ఇంకా .. ఇలా ..
దుఃఖం ముంచుకొస్తోంది?

ఎందు కోసం ఈ జీవితం?
ఎవరి కోసం ఈ జీవనం?
నిరాశ నీలిమలో నీరసించిన
నాకు నేనే వేసుకొనే ఇలాంటి ప్రశ్నలకు
దుఃఖం ముంచుకొస్తోంది

నీ కోసం ఎవరైనా దుఃఖిస్తున్నానంటే
నమ్మకు మిత్రమా!
ఎవరి కోసం ఎవరు దుఃఖిస్తారు?
ఎవరి దుఃఖం వారికే పుట్టెడంత!

నా దుఃఖం నాదే –

దుఃఖం ముంచుకొస్తోంది

అవును – పుట్టెడు దుఃఖం ముంచుకొస్తోంది


(ఒక పాత హిందీ సినిమా పాట ప్రేరణతో – )

–***–

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. కోడీహళ్లి మురళీమోహన్
  ఆగ 03, 2011 @ 06:18:04

  మీకు ప్రేరణ కలిగించిన ఆ హిందీ సినిమాపాట ఏమిటో తెలుసుకో వచ్చా?

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఆగ 03, 2011 @ 08:21:05

  మురళీ మోహన్ గారు! – ధన్యవాదాలు!
  ఆ పాటేదో ఎవరైనా చెప్పగలరా?
  లేదంటే … నేనే చెబుతాను.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  ఆగ 04, 2011 @ 17:57:38

  ’కోడీహళ్ళి’ గారు!
  ఆ పాట దేవానంద్ నటించిన ’హమ్ దోనో’ చిత్రం కోసం మహమ్మద్ రఫీ ఆలపించిన ” కభి ఖుద్ పె కభి హాలాత్ పె రోనా ఆయె ”
  ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: