పూర్ణ ’చంద్రు’నికి అభినందనములు!

పూర్ణ ’చంద్రు’నికి అభినందనములు!

’పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

’ఆకలి రాజ్యమ్ము’ నందు నిరుద్యోగ
     యువత కందించె దివ్యోపదేశ –
మభిమానవతులైన అతివల బ్రతుకుల
     ’అంతు లేని కథ’ల నరయ జెప్పె –
మానవ సంబంధ మాలిన్యముల నల్గు
     ’గుప్పెడు మనసు’ల గుట్టు విప్పె –
అభ్యుదయ సమాజ మందు మార్గాలకై
     ’రుద్ర వీణ’ల నెన్నొ మ్రోగ జేసె –

ఒకొక ’టిది కథ కాదు’ – ’మరో చరిత్ర’! –
యన్న స్థాయిలో ’చిత్రాల’ నతడు తీర్చె –
’దాద ఫాల్కే  పురస్కృతి’ దక్కి, తనకు –
ఆ పురస్కృతియే గర్వ మందె గాదె!

’బాల చంద్రు’డా? కాదయ! భారతీయ
చలన చిత్ర నభో పూర్ణ చంద్రు డతడు!
ఈ పురస్కార మత డొందు నిట్టి వేళ –
అందజేయు దనే కాభినందనములు!
అందజేయు దనే కాభివందనములు!!

              —@@@—

*(ఇది నా ఈ బ్లాగులో 150 వ టపా )

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. dr komalarao
  మే 02, 2011 @ 00:21:11

  చిత్ర సూత్రదారికి పద్య కళా ప్రవీణ వారి పద్య మాలికాభినందనలు బాగున్నాయి.

  స్పందించండి

 2. కంది శంకరయ్య
  మే 02, 2011 @ 06:34:20

  సమకాలీన అంశాలపై మీ కవితా స్పందనలు మా బొంట్లకు మార్గదర్శకాలు.
  ధన్యవాదాలు.

  స్పందించండి

 3. .డా. ఆచార్య ఫణీంద్ర
  మే 02, 2011 @ 20:48:49

  డా. కోమలరావు గారికి,
  శ్రీ కంది శంకరయ్య గారికి –
  మనఃపూర్వక ధన్యవాదాలు

  స్పందించండి

 4. ramnarsimha
  మే 15, 2011 @ 15:42:06

  Nice Post.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: