నాయకుండన్న నాతడే నాయకుండు!

నాయకుండన్న నాతడే నాయకుండు!

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

శిరమెత్తి యెవ్వాడు సేయ ధిక్కారమ్ము,
    తిరిగి కోట్ల తల లా దిశను గాంచు –
గళమెత్తి యెవ్వాడు గర్జింప, వెంటనే
    కోట్ల గొంతుక లెల్ల కూడ బలుకు –
బిగియించి యెవ్వాడు పిడికిలి పైకెత్త,
    కోట్ల పిడికిళులుం గూడి లేచు –
ధర్మాగ్రహ మెవండు దాల్చ, నాతని వెంట
    తండోపతండాలు దారి బట్టు –

ధ్యేయ శుద్ధితో నెవ్వాడు దీక్ష బూని,
నిత్యము ప్రజా హితమ్ముకై నిలిచి పోరు –
నాయకుండన్న నాతడే నాయకుండు!
అతడె ‘అన్నా హజారె’! మహాత్ము డతడు!

         ===(*)===

ప్రకటనలు