మన్నించుడయ్య!

ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబను
      శ్రీ మహాభారత సిద్ధి నిడిన –
శ్రీ వేంకటేశ్వర శ్రీపాద సేవలో
      తరియింపజేయు కీర్తనల నిడిన –
దేశ భాషలయందు తెలుగు లెస్సయటంచు
      సత్ప్రబంధ కవి పోషణము నిడిన –
సంఘమందున దురాచారాల నణచ, జీ
      వితములనెల్ల అంకితము నిడిన –
ఈ ప్రపంచాగ్నికి సమిధలెన్నొ యిడిన –
విశ్వ నరులార! మహనీయ విబుధులార!
మీదు విగ్రహముల గూల్చు మాదు బుద్ధి
హీన చర్యల దయను మన్నించుడయ్య!

మౌన రోదనలో …
డా.ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

9 వ్యాఖ్యలు (+add yours?)

 1. తెలుగు యాంకి
  మార్చి 13, 2011 @ 01:38:36

  ఆచార్యా,
  ఆ మహనీయులందరకు, ప్రాంతాలకతీతముగా తెలుగు వారందరి తరుపునా మీరడిగన ఈ వేడికోలుకు నా సంపూర్ణ మద్దతు.

  “సుకవి జీవించు ప్రజలనాల్కల మీద”.
  విగ్రహాలు కూలిపోయినా మన హృదయాలలో ఎప్పుడూ కొలువుండే వేలుపులు – ఈ మహనీయులు.

  స్పందించండి

 2. Snkr
  మార్చి 13, 2011 @ 07:43:58

  మొసలి కన్నీరు కార్చండయ్య

  స్పందించండి

 3. .డా. ఆచార్య ఫణీంద్ర
  మార్చి 13, 2011 @ 09:07:48

  తెలుగు యాంకీ గారికి
  ధన్యవాదాలు

  స్పందించండి

 4. .డా. ఆచార్య ఫణీంద్ర
  మార్చి 13, 2011 @ 09:22:40

  Mr. Snkr !

  మీలాంటి రెచ్చగొట్టేవాళ్ళ వల్లే … ఇలాంటి ఉత్పాతాలు జరుగుతున్నాయి.

  ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా కలసి ఉందామన్నది – తెలంగాణ ఉద్యమ లక్ష్యం.

  ప్రజలు కొట్టుకు చచ్చినా, ప్రాంతాలు కలసి ఉండాలన్నది మీలాంటి కుహనా సమైక్యవాదుల సంకుచిత స్వార్థం.

  తోటి తెలుగు సోదరుని ఆవేదనను అపహాస్యం చేసే మీదొక సమైక్యవాదం .. మీరొక సమైక్యవాదులు … సిగ్గు చేటు!

  స్పందించండి

 5. కామేశ్వర రావు
  మార్చి 13, 2011 @ 14:19:29

  తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కావడం వల్లనో తెలంగాణావాది కావడం వల్లనో, ఇది మొసలికన్నీరు అనుకోవడం దారుణం. సమైక్యవాదులందరూ అణచివేతదారులే అని అనుకోడం ఎంత మూర్ఖత్వమో, తెలంగాణావాదులందరూ వేర్పాటువాదులు అనుకోడం అంతే మూర్ఖత్వం.

  ప్రజల మధ్య ఇలా విద్వేషాల చిచ్చుపెట్టి చలికాచుకుంటున్న నాయకులని నిలదీయకుండా గొఱ్ఱెమందల్లా ప్రజలు వాళ్ళని అనుసరించి దీనికి మరింత ఆజ్యం పొయ్యడం మనం చేసుకున్న దౌర్భాగ్యం.

  స్పందించండి

 6. Anon
  మార్చి 13, 2011 @ 14:57:35

  I completely agree with the author on Snkr kind of ppl, there are so many in telugu blogs. I seriously think they want the state to separated but want it to be looked like it was separated because of Telangana agitation

  స్పందించండి

 7. .డా. ఆచార్య ఫణీంద్ర
  మార్చి 14, 2011 @ 01:12:15

  కామేశ్వరరావు గారికి
  Anon గారికి
  ధన్యవాదాలు!

  స్పందించండి

 8. Gannavarapu Narasimha Murty
  మార్చి 14, 2011 @ 02:29:42

  డా.ఆచార్య ఫణీంద్ర గారూ ఇటువంటి సందర్భాలలో మీ గళము గట్టిగా వినిపించాలని నేను కోరుకొంటున్నాను. ప్రజలలో వైషమ్య భావాలు మొలకెత్తకుండా మీ బోటి వారలు ముందుకు వచ్చి కృషి చేయాలి.

  స్పందించండి

 9. .డా. ఆచార్య ఫణీంద్ర
  మార్చి 14, 2011 @ 08:39:43

  గన్నవరపు నరసింహమూర్తి గారు!
  సమైక్య భావన కలిగి ఉండడానికి … ఒకే రాష్ట్రంలో కలసి ఉండనక్కరలేదు. అది గుండె లోతులలో అంకురించి విస్తరించాలి. నాకు ఆంధ్రప్రదేశ్ లోని తెలుగువాళ్ళే కాదు, ఢిల్లీలోని తెలుగువాళ్ళు .. కర్ణాటకలోని తెలుగువాళ్ళు .. తమిళనాడులోని తెలుగువాళ్ళు .. అమెరికాలోని తెలుగువాళ్ళు .. ఆస్ట్రేలియాలోని తెలుగువాళ్ళు .. ఇంగ్లండులోని తెలుగువాళ్ళూ .. ఇలా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళంతా సోదరులే! అలాగని వాళ్ళనందరినీ ఒకే రాష్ట్రంలోనే పట్టి ఉంచాలనుకొంటే సాధ్యమేనా? రాష్ట్రాల ఏర్పాటు అన్నదీ సమకాలీన సామాజిక అవసరాలు, ఆ నేపథ్యంలో నెలకొని విస్తృతమైన ఆకాంక్షల మేరకు – రాజకీయ వ్యవస్థలో చేసే చిన్న మార్పు మాత్రమే. దాని గురించి ఇంతగా విద్వేషాలను ఎగదోసుకోవడం, చిమ్ముకోవడం మూర్ఖత్వం.
  నేను ప్రత్యేక తెలంగాణ వాదినే … కానీ, ప్రజా సమైక్యవాదిని!
  మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: