‘పద్మభూషణు’నికి అభినందనలు

‘పద్మభూషణు’నికి అభినందనలు

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

ఏల మథించినారొ దివిజేంద్రులు, దైత్యులు క్షీరవారిధిన్

చాల శ్రమించి, తా మమృత సాధనకై? – మధుర స్వరాల, గీ

తాల వరాల రూపమున, ధాత్రిని గాన కళా విరించియౌ

‘బాలు’ గళమ్మునం దమృత భాండములో సుధ జాలువారగాన్!

 

ప్రథిత ‘శ్రీపతి పండితారాధ్య’ కుల మ

హా పయః పయోనిధి సోముడగుచు గాన

మూర్తి ‘బాల సుబ్రహ్మణ్యము’ ప్రభవించె

ధరణి – ‘లలిత గీతాల శ్రీ త్యాగరాజు’!

 

నలుబదేళ్ళ నుండి నవనీత మృదు గాన

మాధురీ మరంద మయములైన

ముప్పదారు వేల గొప్ప గీత సుమాల

పూచినట్టి కల్పభూజ మతడు!

 

నటనను ‘నంది’ని గెలిచెను –

పటుత్వముగ చిత్రములకు స్వరముల గూర్చెన్ –

దిటవుగ గాంధర్వ కళా

స్ఫుట పటిమను జూపి ‘పద్మ భూషణు’డయ్యెన్!

 

ఎన్ని పురస్కృతుల్ గొనియె, నెక్కె మహా శిఖరంబు లెన్నియో –

కొన్నియు నాంధ్ర రాష్ట్రమున, కొన్నియు దేశము, విశ్వ మెల్లెడన్!

ఇన్ని కిరీటముల్ గెలిచి, ఎంతొ వినమ్రత జూపు నాతనిన్

సన్నుతి జేయుదున్ – యశము శాశ్వతమై యలరార గోరెదన్!

[ఆంధ్రుల అభిమాన గాయకులు డా. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని ‘పద్మభూషణ్’ పురస్కారం వరించిన సందర్భంగా అభినందనలతో … ]     

                            — *** —  

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. కొత్తపాళీ
  జన 28, 2011 @ 20:57:01

  మాస్టారు, మొదటి పద్యంలో భావం సలలితంగా బావుంది

  స్పందించండి

 2. .డా. ఆచార్య ఫణీంద్ర
  జన 29, 2011 @ 06:59:17

  కొత్తపాళీ గారికి ధన్యవాదాలు!

  స్పందించండి

 3. కంది శంకరయ్య
  జన 29, 2011 @ 11:29:45

  గీతసుమాలు పూచిన కల్పభూజ మనడం బాగుంది. మీ పద్యరత్నాల నందుకున్న “బాలు” గారు ధన్యులు. వారిపై ఇంత చక్కని పద్యాలు వ్రాసినందుకు మీకు నమోవాకాలు.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జన 29, 2011 @ 19:45:39

  కవి మిత్రులు కంది శంకరయ్య గారు!
  Feb 5 నాడు హైదరాబాదులో బాలు గారికి జరిగే ఒక సన్మాన సభలో ఈ పద్యాలను ఆయనకు అందజేయబోతున్నానని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: