గూగులమ్మ పదాలు

గూగులమ్మ పదాలు

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

నీది ఇంటరునెట్టు

నాది పాత మర్రి చెట్టు

జోడు కుదరదు – ఒట్టు!

ఓ గూగులమ్మా!

 

చేసెనెవడో ఐ.డి.

నా పేరునే వాడి –

ఎరుగ ’మెయిలు’ నాడి!

ఓ గూగులమ్మా!

 

ఎవడు చూడు – ’నెట్టు’!

చేయులే కనికట్టు –

నేను మాత్రం ’ఫట్టు’!

ఓ గూగులమ్మా!

 

పెట్టిన ’పాస్ వర్డు’

గుర్తుండడం ’హార్డు’ –

నేను అక్కు’బర్డు’*!           (* అక్కు పక్షి)

ఓ గూగులమ్మా!

 

చేతబట్టి ’మౌసు’

తిప్పుతుంటే ’నైసు’ –

తొలిమెట్టులో ’పాసు’!

ఓ గూగులమ్మా!

 

చేయ ’డబుల్ క్లిక్కు’

ఎక్కెనేమో ’కిక్కు’ –

’ఫ్రేము’లొచ్చెను పెక్కు!

ఓ గూగులమ్మా!

 

వెదుక ’యాహు మెసెంజరు’

’మౌసు’ జరిపితి ’కార్నరు’ –

మాయమయ్యెను ’కర్సరు’!

ఓ గూగులమ్మా!

—- 000 —-  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. padmarpita
  జన 23, 2011 @ 00:04:13

  భలే:) భలే:)

  స్పందించండి

 2. జ్యోతి
  జన 23, 2011 @ 11:45:17

  హా.హా..హా.. ఇంతవరకు రానారె గూగులమ్మ పదాలు రాసేవాడు. చాలాకాలమైంది అతను రాయక, మీరు అందుకున్నారు. సంతోషం. ఇలాగే అప్పుడప్పుడు గూగులమ్మని పలకరించండి…

  స్పందించండి

 3. .డా. ఆచార్య ఫణీంద్ర
  జన 24, 2011 @ 21:41:37

  పద్మార్పిత గారికి,
  జ్యోతి గారికి –
  హృదయ పూర్వక ధన్యవాదాలు!

  స్పందించండి

 4. Jayashree
  అక్టో 03, 2012 @ 23:52:16

  సెహభాష్! వహ్వా! క్యా బాత్ హాయ్! అద్భుతం! అమోఘం! ఇలా చాలా చాలా వచ్చేస్తున్నాయి పెల్లుబుకి మనసులోంచి. దీనిలో అన్నీ నిజాలే! ముఖ్యంగా “నెట్” నేస్తానికి, ‘మెయిల్’ మహారాజు కి, కంప్యూటర్ కజిన్ కి కొత్త కొత్తగా పరిచయం అయిన వాళ్లకి మరీ అనుభవైకవేద్యాలే! ఈ మధ్యలో కవితలన్నా, అవి చదవాలన్నా భయం పుట్టిన సమయంలో ఇది చదవటం తటస్థించింది. భలే నవ్వించారండీ. వెన్నెల్లో గోదారి అందం చూసినంత ఆనందం, ఆహ్లాదం గిలిగింతలు పెట్టాయి. ఆ గూగులమ్మ దీవెనలతో మీరు మరింతమందిని అలరించాలని మనస్పూర్తిగా ఆశిస్తూ…

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  అక్టో 06, 2012 @ 21:18:08

  జయశ్రీ గారికి అనేకానేక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: