ఆకలి చావులు

ఆకలి చావులు

రచన: ‘పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

ప్రొద్దున నిద్ర లేవగనె, పొట్టను గూర్చి తలంపు వచ్చి- ” ఓ
ముద్దయె చేతికందు నెటు? మూతికి, చేతికి పొత్తు గూడగా
ఎద్దియు దారి? లేక మరి ఇంతకు ముందటి రోజు వోలెనే
అద్ది లభింపదో? ” యని అనంత మనోవ్యథ గల్గు పేదకున్!

తనతో బాటుగ ఇంకను
తన భార్యకు, పిల్లలకును – దారిద్ర్యమునన్
దిన దినమిటు పస్తులతో
కొనసాగుట చూడ, గుండె కోతయె గాదే?

ఆకలి కన్న ఘోరమగు నాపద, శాపము, శిక్ష గల్గునే
ఈ కలి కాలమందు నరు లెవ్వరికైనను? నీరసంబునై
చీకటు లావరించి, తమ చేష్ట లుడుంగగ నేల కూలి, వా
రాకలి చావు నొందరొకొ – అన్నమొ, గంజియొ దక్కకుండినన్?

‘పాలమూరు‘నందు పలు పేద కూలీలు
పొట్ట కూటి కొరకు, పొలములందు
పనులు దక్కకున్న పస్తులుందురు గదా –
దీన గతిని ఇట్లు దిన దినమ్ము!

‘కృష్ణ‘యు, ‘గోదావరి‘ వ
ర్ధిష్ణువులై ప్రక్కనుండి రిత్తగ బోవన్,
తృష్ణయె దీరక, క్షుద్బా
ధోష్ణములో మాడి మసగుచుం ద్రిట బీదల్!

“పుట్టువు మాసిపోవు నిక ముద్ద లభించక” యంచు బాధతో
పుట్టిన గడ్డయైన ‘మహబూబునగర్‘ పురి వీడి ఎందరో
పొట్టలు చేత బట్టుకొని; మూటలు, ముల్లెలు సర్ది నెత్తిపై –
చెట్టుకు పుట్ట కొక్కరుగ చేరుదురే నగరమ్ము కూలికై!

వేనకు వేలుగ జను లిటు
కానక యే దారిని, తమ కడుపులు నింపన్ –
మానిని, మరి సంతతితో
కానలలో నడచి నడచి, కడు దీనముగాన్ –

ఆకలి, నీరస బాధకు
కేకలు వేయంగ తుదకు కించిత్తైనన్
లేక ఇక శక్తి, నగరపు
వాకిళులన్ సొమ్మసిల్లి పడిపోదురయో!

వలస పక్షులై నగరాన వ్రాలి ఇట్లు
‘ఫుట్టుపాతు‘లపై నిద్రబోవుచుండు
పేద కూలీ కుటుంబాల వెతలు జూడ –
కఠిన శిలలైన కన్నీరు గార్చు గాదె?

అదియొ, ఇదియొ పనిని అందించి ఎవరైన
అక్కు జేర్చుకొన్న అసువులుండు –
అదియు దక్కకున్న ఆకలి చావులే
వారి నుదుటి పైన వ్రాత యగును!

సకలైశ్వర్య విశేష భోగములు, సత్సాహిత్య సంస్కారముల్
ప్రకటంబై, ‘గదవాల‘, ‘ఆత్మకురు‘, ‘వనప‘ర్త్యాది సంస్థానముల్
ఒకనా డద్భుత వైభవమ్మొలికె – ఆ ఊర్లిట్లు దారిద్ర్యమం
దకటా! మ్రగ్గుట కేమి హేతు, వది యే మన్యాయమో దెల్పరే?

—***—

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. Jashuva
  జన 09, 2011 @ 06:30:00

  ఆకలిని, ఆకలి బ్రతుకులను మీ కవిత్వంలో అందంగా అమర్చారు. మెచ్చి చప్పట్లు కొట్టాలా? తిట్టాలా? ‘ఛా’ అని వెనుదిరగాలా?

  స్పందించండి

 2. .డా. ఆచార్య ఫణీంద్ర
  జన 09, 2011 @ 11:51:59

  డూప్లికేట్ ‘జాషువ‘ గారు!
  ‘విశ్వ నరుడు‘గా తనను తాను చాటుకొన్న మహాకవి ‘జాషువ‘ పేరు పెట్టుకొని, ఒక ప్రాంత పేదల ఆకలి సమస్యలను కేవలం మీ ప్రాంత స్వార్థ రాజకీయ దురుద్దేశ్యంతో అంగీకరించలేని దుస్థితిలో మీరుంటే – అది మీ విజ్ఞతకే వదలివేస్తున్నాను. ఇక్కడ చప్పట్లు కొట్టేంత సంతోష పరిస్థితులేమీ లేవు. వాస్తవాలను అర్థం చేసుకొని మెచ్చితే – మీ నిష్పాక్షిక హృదయ వైశాల్యానికి అభినందిస్తాను. తిట్టితే – మీ సంకుచితత్వాన్ని నిందిస్తాను. ‘ఛా‘ అంటే మీ అసభ్య ప్రవర్తనను అసహ్యించుకొంటాను.

  స్పందించండి

 3. ramnarsimha
  మార్చి 22, 2011 @ 13:37:18

  Abhinandanalu.

  స్పందించండి

 4. Dr. Acharya Phaneendra
  మార్చి 24, 2011 @ 08:04:10

  రామనర్సింహ గారు!
  మీకు అనేకానేక ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: