మరో భగత్ సింగ్ …

మరో భగత్ సింగ్ …

నియంతను నియంత్రించలేనప్పుడు
నిర్మూలనమే మార్గమని యెంచావు –
స్వాతంత్ర్యేచ్ఛతో తెలంగాణలో
మరో భగత్ సింగై అవతారమెత్తావు –
బాంబును విసిరి
భూమిని బ్రద్దలు చేసావు –
ప్రజా గర్జనను
నింగి దాకా ప్రతిధ్వనింపజేసావు –
గురి తప్పినా, గుండె లదరగొట్టావు –
నియంత మనస్థైర్యాన్ని నీరు గార్చావు –

పట్టుబడినా, నీవు పట్టు వీడలేదు –
తల తీస్తామన్నా, నీవు తల వంచలేదు –
నీ త్యాగ నిరతితో
స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తినందించావు –
నీ సాహసంతో
లక్షలాది యువకులకు లక్ష్యాన్ని నిర్దేశించావు –
తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను
తెగగొట్టిన వీరుడవు నీవు !
ఈ గడ్డపై భారత పతాకను
నిలిపిన శూరుడవు నీవు !
కలలు గన్న స్వాతంత్ర్యాన్ని
కళ్ళారా చూసిన ధీరుడవు నీవు !
స్వాతంత్ర్యానికి ముందు, చావుకి సిద్ధపడి
ఉద్యమానికి ఊపిరులూదావు –
స్వాతంత్ర్యానంతరం, బ్రతుకును గెలిచి
స్వేచ్ఛా వాయువులను శ్వాసించావు –

పటాటోపాల లోకంలో
ముఠా మాయగాళ్ళ సమాజంలో
మామూలు మనిషిగా జీవించావు –
నిరాడంబరునిగా ఓ మూల నివసించావు – 

మా ‘ నారాయణరావు పవార్ ‘ !
ఓ ‘ తెలంగాణ భగత్ సింగ్ ‘ !
మరో స్వపరిపాలనోద్యమ వేళ –
మరో సూర్యోదయ వేళ –
అస్తమించావా ?
అమరత్వం పొందావా ?

సమైక్య రాష్ట్రంలో
పాఠ్యాంశాల్లో నీ ప్రస్తావన లేక పోవచ్చు –
కుహనా స్వాతంత్ర్య యోధుల నడుమ
నీకు గుర్తింపు లభించి ఉండక పోవచ్చు –
మా గుండెల్లో మాత్రం నీ వెప్పుడూ
అమరుడవే !
సాటి లేని మేటి
విప్లవ వీరుడవే !
దేశ భక్తుడవే !

( ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు – ‘ తెలంగాణ భగత్ సింగ్‘ 

శ్రీ నారాయణరావు పవార్ మృతికి నివాళిగా … )

– డా. ఆచార్య ఫణీంద్ర 

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. Seenu
  డిసెం 09, 2010 @ 21:47:12

  chaala baagundi mee avedhana, endariko utthejaanni ivvalani ashistu

  స్పందించండి

 2. saamaanyudu
  డిసెం 09, 2010 @ 21:56:06

  Johaar Naaraayanarao Pawar Johaar…

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  డిసెం 09, 2010 @ 22:53:20

  శీను గారు!
  సామాన్యుడు గారు!
  ధన్యవాదాలు!

  స్పందించండి

 4. ramnarsimha
  డిసెం 14, 2010 @ 13:48:17

  Sir,
  Thanks for writing a poem on Naraayana Pawar gaaru.

  స్పందించండి

 5. Dr. Acharya Phaneendra
  మార్చి 25, 2011 @ 08:17:55

  రామనర్సింహ గారు!
  సమాజంలో జీవిస్తూ, కవి యన్నవాడు తన చుట్టూ జరుగుతున్న సంఘటనలపై నిష్పాక్షిక హృదయంతో స్పందించకపోతే – అతడు జీవచ్ఛవంతో సమానమని నా భావన. కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా ఎంచుకొని మరీ, కేవలం కొన్ని అంశాల పైనే స్పందిస్తున్న కవులు – వారి బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైనట్టే కదా!
  “తెలంగాణ రైతాంగ పోరాట సమయంలో ఎందుకు స్పందించలేదు?” అన్న ప్రశ్న ’విప్లవ కవి’ జీవితంలో ఒక శాశ్వతమైన మచ్చే కదా!
  “కష్ట సుఖములకు స్పందించి కదలు
  ఉత్కృష్టమైన కలము నాది!” అని ఎప్పుడో వ్రాసుకొన్నాను. అదే నా ఆశయం.
  ముళ్ళపూడి వెంకటరమణ గారు పరమపదించినా, నారాయణరావు పవార్ గారు పరమపదించినా, సమదృష్టితో స్పందించే లక్షణం ఆ ఆశయ ఫలితమే!
  ఈ రోజు రాష్ట్రంలో అన్ని రంగాలలోలాగే తెలుగు బ్లాగులోకం కూడా సీమాంధ్ర, తెలంగాణ వర్గాలుగా రెండుగా చీలిపోయిందన్నది సుస్పష్టం.
  నేను తెలంగాణ రాష్ట్ర వాదినే కావచ్చు. కానీ ఈ రోజు … రెండు ప్రాంతాలలోని తెలుగువాళ్ళంతా నా వాళ్ళే అనుకొనే, వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే ఒకరిద్దరు బ్లాగర్లలో నేను ఒకణ్ణి అని సగర్వంగా చాటుకోగలను. అదీ … నిజమైన ’ప్రజా సమైక్య వాద’మంటే!
  మీ అభిమానానికి కృతజ్ఞతలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: