నిండు సభలో ఆత్మీయంగా సాగిన గ్రంథావిష్కరణ

నిన్న(౩ డిసెంబర్) జరిగిన నా ‘వరాహ శతకము’ ఆవిష్కరణ సభ సాహిత్యాభిమానులు, ఆత్మీయులతో నిండుగా అలరి, వేదిక పైనున్న అతిథులకు, నాకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా, బ్లాగు మిత్రుడు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు నా మీద అభిమానంతో విచ్చేసి ప్రోత్సహించడం మరింత ఆనందాన్ని కలిగించింది. సభాధ్యక్షులు, ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారు; ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డా. కే. వి. రమణ గారు; సుప్రసిద్ధ విమర్శకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ ‘డీన్ ఆఫ్ ఆర్ట్స్’ అయిన నా పి.హెచ్.డి. గురువు గారు ఆచార్య యస్వీ. రామారావు గారు, ప్రముఖ కవి డా. దేవరాజు మహారాజు గారు; ఉస్మానియా తెలుగు శాఖాచార్యులు ఆచార్య మసన చెన్నప్ప గారు, మొదలైన వారంతా మనసు విప్పి మాట్లాడారు.

ప్రసంగాలలో వీరంతా నా పట్ల వర్షించిన ప్రేమ, వాత్సల్యానికి నా హృదయం ఎంతో పారవశ్యంలో తేలియాడింది. ‘వరాహ శతకము’ అనగానే ఇదేదో భక్తి శతకమనుకొన్న సభాసదులు అందులోని అభ్యుదయ భావాలు, అధిక్షేప హాస్య వ్యంగ్యాలను గురించి తెలుసుకొన్నాక, నన్ను మనసారా అభినందించడంతో నా ప్రయత్నం సార్థకమయిందని సంతోషించాను. ఈ రోజు ‘ఈనాడు’, ‘సాక్షి’, ‘ఆంధ్ర జ్యోతి’, ‘ఆంధ్ర భూమి’, ‘ఆంధ్ర ప్రభ’ వార్తా పత్రికలలో ఫోటోలతో కూడిన కథనాలు ప్రచురించబడి, చాలా సంతృప్తిని కలిగించాయి.

సాక్షి :

ఆంధ్ర జ్యోతి :

ఈనాడు :

ఆంధ్ర ప్రభ :

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. ramnarsimha
  డిసెం 05, 2010 @ 15:05:40

  Abhinandanalu.

  స్పందించండి

 2. saamaanyudu
  డిసెం 05, 2010 @ 20:43:42

  Congratulations Sir..

  స్పందించండి

 3. కొత్తపాళీ
  డిసెం 05, 2010 @ 21:08:30

  చాలా సంతోషం. అభినందనలు

  స్పందించండి

 4. జ్యోతి
  డిసెం 05, 2010 @ 21:26:25

  అభినందనలు ఆచార్యగారు, మీరు ఇలాటి పండగలు మరిన్ని జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..

  స్పందించండి

 5. Dr. Acharya Phaneendra
  డిసెం 05, 2010 @ 22:16:42

  RAMNARSIMHA GARU!
  SAAMAANYUDU GARU!
  KOTTA PAALI GARU!
  JYOTI GARU!

  MEE ANDARIKI NAA HRIDAYA POORVAKA DHAYAVAADAALU!

  స్పందించండి

 6. ramnarsimha
  డిసెం 06, 2010 @ 13:52:59

  Sir,

  ‘మాతృభాషలో విద్యాబోధన’ చేస్తున్న ‘చైనా’ లోని 50 విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని అత్యున్నత 500 విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించగలిగాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్న భారతీయ విశ్వవిద్యాలయాలు కేవలం ’02’ మాత్రమే ఈ జాబితాలో స్థానం సంపాదించగలిగాయి. మాత్రుభాషలో విద్యాబోధన ద్వారానే సృజనాత్మకత వికసిస్తుంది..అని నా అభిప్రాయం.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: