” మనుషులకే ఎందుకో ”

“చావా కిరణ్” బ్లాగులో
“పాట ఒకటి వ్రాద్దాం రండి — 3” అన్న శీర్షికలో

ఇచ్చిన సన్నివేశం –

అతను కొన్ని కారణాల వల్ల మనసు గాయపడి అలా బయటకు వెళ్తాడు.ఇతను ఎప్పుడో చదువుకునే రోజుల్లో కవితలు అల్లిన వాడే, కానీ తరువాత సంసారంలో పడి ఆ వైపు కూడా చూడలేదు, కనీసం కవితలు చదవడం కూడా చెయ్యడు గత ముప్పై సంవత్సరాలలో.

మనసు తీవ్రంగా గాయపడి అలా బయటకు వెళ్లి, నీలాకాశంలో ఆనంగా ఈనంగా ఉన్న తెల్లని మేఘాలు, వాటి క్రింద ఎగురుతున్న పక్షులు , నిండు కుండలా పారుతున్న నది, దాని నిండుగా చేపలు, వాటిని భక్షించు పక్షులు, వాటిలో అవే ఆడుతున్న పక్షుల జంటలు, ఎగురుతున్న సీతాకోక చిలుకలు, వాటి జంటలు, తుమ్మెదల జంటల విన్యాసాలు, తీరిక లేని తుమ్మెదల ఆవృతాలు, నర మానవుడి జాడ లేని చోటు, చల్లగ రివ్వున వీచే గాలి, నీటి శబ్దం, పక్షుల అరుపులు, జంతువుల అరుపులు, పచ్చని చెట్లు, నాగరికతకు ఆనవాలుగా నిర్మానుష్యమైన అందమైన నల్లని తారు రోడ్డు, దానికిరువైపునా పూల మొక్కలు, దూరంగా ఉన్న జలపాతపు హోరు, తారు రోడ్డు పక్కన ఎర్రని కాలిబాట, ఎవరూ లేని తాటాకుల పాత గుడిసె, ఏనాటిదో ఒక రాతి మండపం దానిపై అద్భుత శృంగార భంగిమలు, .…..

ఇలా ప్రకృతిని చూస్తూ తన్ను తాను మరచి, తానే ప్రకృతిలో ఒక భాగం అయి, ప్రకృతే గురువు కాగా ఒక అద్భుతమైన పాట పాడతాడు. తనలో ఉన్న మరో తానును కనుగొంటాడు. మనసు తేలికవుతుంది. పాట పాడుతూ, పాడి, మట్టి రోడ్డు తారు రోడ్డు కలిసే దగ్గర కూర్చుండిపోతాడు.

ఆ సన్నివేశానికి నేను వ్రాసిన పాట :

” మనుషులకే ఎందుకో ”

గీత రచన : డా|| ఆచార్య ఫణీంద్ర 

మనుషులకే ఎందుకో
మనసంతా వేదన ?
మానులకు ఉన్నదా ?
మబ్బులకు ఉన్నదా ?       || మనుషులకే ||

ఆ ఎగిరే పక్షిని చూడు –
ఆకాశపుటంచులలో …
హాయిగా రెక్కలు విప్పి
ఆనందం చిందేను !
ఆ వాలే తెమ్మెద చూడు –
అందమైన పూ యెదపై
హత్తుకొని మధురిమలు
ఆస్వాదన చేసేను !             || మనుషులకే ||

ఆ చల్లని గాలిని చూడు –
ఆకులనే మీటుతూ
కొమ్మలనే ఊపుతూ
ఈల పాట పాడేను !
ఆ జలపాతం చూడు –
అద్రి నుండి దూకుతూ
నేలపై తకధిమి.. తకధిమి..
భరత నాట్యమాడేను !         || మనుషులకే ||

మానైనా కాకుండా …
మనిషిని నేనయ్యాను –
ఆమనులను కోల్పోయాను !
అందాలను కోల్పోయాను !
మబ్బైనా కాకుండా …
మనిషిని నేనయ్యాను –
శ్రావణమే కోల్పోయాను !
సంగీతం కోల్పోయాను !       || మనుషులకే ||

అరమరికలు, అసూయలు,
ఆవేశం, స్వార్థాలు,
వేదనలు, రోదనలో
వేసారి పోయాను –
అమ్మలాంటి ప్రకృతీ ! నను
నీ ఒడిలో దాచుకో !
కమ్మనైన జోల పాడి
నన్ను నిదుర పుచ్చుకో !       || మనుషులకే ||

— *** —ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. saamaanyudu
  నవం 07, 2010 @ 20:02:09

  baagundandi..

  స్పందించండి

 2. డా. ఆచార్య ఫణీంద్ర
  నవం 07, 2010 @ 22:00:00

  saamaanyudu గారికి –
  ధన్యవాదాలు!

  స్పందించండి

 3. ramnarsimha
  నవం 08, 2010 @ 15:54:05

  Sir,
  Your poem is very nice.
  Congratulations.

  స్పందించండి

 4. డా. ఆచార్య ఫణీంద్ర
  నవం 08, 2010 @ 18:40:09

  రామనరసింహ! సుకవితా రస పిపాస
  హృదయ! తెలుగు బ్లాగులయందు నేరి, కోరి,
  నాదు పోస్టులన్నియు జూచి, నచ్చి, మెచ్చు
  నీదు సహృదయతకు నభివాద మిదివొ!
  – డా. ఆచార్య ఫణీంద్ర

  స్పందించండి

 5. ramnarsimha
  నవం 10, 2010 @ 14:13:55

  ఆచార్య గారు,
  నా అభిప్రాయంపై స్పందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నను.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: