విశ్వ సంగీతం

విశ్వ సంగీతం

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

ఆ మనిషి అలపై నిలుచున్నాడు
అతని చేతులు గాలిలో కదలాడుతూ
సంగీత కచేరీని నిర్వహిస్తున్నాయి
ఆ అల –
కుంచెతో గీసిన రంగు రంగుల కల !
రెప్పపాటు అది
హరివిల్లులా మెరిసింది మిలమిల !
కాలం కదలికలు లేని
కొండ కాదు –
అది వాయువులా సాగిపోతుంది
వేగాన్ని పుంజుకొని విజృంభించింది
ఆ అలను నేలకు విసిరికొట్టింది !
రాగాల తీగ తెగిపోయింది
కచేరీ నురగలై విరిగిపోయింది
అంతకు ముందు నిటారుగా
నిలిచున్న ఆ మనిషి
నేలపై చచ్చిన పాములా                                                                                                               చతికిలబడిపోయాడు
ఒక్కసారి ఓపిక తెచ్చుకొని,                                                                                                                              తల త్రిప్పి వెనుకకు చూసాడు –
మరో అల …
మరో మనిషి …
మరో సంగీత కచేరీ …
మరో రంగుల హరివిల్లు …
ఆ మనిషికి అవగతమయింది –
మనిషి సంగీతం ముందు
ఒక మరుగుజ్జని !

( జాన్ ఫుల్లర్ ఆంగ్ల కవితను చదువగా కలిగిన  ప్రేరణతో … )

___ *** ___

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. ramnarsimha
  నవం 06, 2010 @ 14:03:40

  “ఆ అల
  కుంచెతో గీసిన రంగు రంగుల కల”

  మీ కవిత చాలా బాగుంది.
  మీకు అభినందనలు.”

  స్పందించండి

 2. shayi
  నవం 06, 2010 @ 18:58:56

  సంగీతం అనంతమైనది .. జీవితం అశాశ్వతమైనది .. అని చక్కగా వివరించారు.
  అభినందనలు.

  స్పందించండి

 3. డా. ఆచార్య ఫణీంద్ర
  నవం 07, 2010 @ 21:58:48

  ramnarsmha గారికి –
  shayi గారికి –
  ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: