“ఆత్మార్పణము”

‘రంజని తెలుగు సాహితీ సమితి, హైదరబాదు’ వారు, ‘ఆంధ్రప్రభ’ దిన పత్రిక సౌజన్యంతో నిర్వహించిన

2010 రంజని – విశ్వనాథ పద్య కవితా పోటీలలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత :

“ఆత్మార్పణము”

( తెలంగాణ ఉద్యమంకై ఆత్మార్పణ చేసుకొన్న విద్యార్థి కన్న తల్లి ఆత్మ ఘోష – )

రచన : ’పద్య కళా ప్రవీణ’ డా|| ఆచార్య ఫణీంద్ర

చిన్ని చురుకంట ” అమ్మా ! “
యన్నదె నా కెరుక గాని – అయ్యయ్యో ! నా
కన్నా! ఎటు లోర్చితివో –
నిన్నే నీవిటు దహించి నివురై పోవన్ ? 

ఎన్ని క్షేత్రాల తిరిగితి నిన్ను కనగ –
ఎన్ని దేవుళ్ళ మ్రొక్కితి నిన్ను కోరి –
అన్ని ఫలియింప, కలిగితివంచు మురిసి –
నిన్ను పెంచుకొంటిని గదా చిన్ని నాన్న !

అన్నదెల్ల ఇచ్చి అల్లారుముద్దుగా
నిన్ను చూచుకొనెను నీదు తండ్రి !
ఎన్ని కలల మేడ లెక్కి కూర్చుండెనో –
వినియు నీ మృతి, నిలువెల్ల కూలె !

చిన్నతనాన నాన్న నిను చెప్పిన పాఠము ప్రశ్న లేయగా –
దున్నినటున్ జవాబులను తొందర తొందర నీవు చెప్పగా –
” విన్నవటే ! కుమారుని ప్రవీణత – వీడు కలెక్టరౌ ” నటం
చన్నటువంటి మాట – తనయా ! చెవులందున మారుమ్రోగురా !

పెరిగి నీవు విశ్వవిద్యాలయమ్ములో
సీటు పొంది, పట్న సీమ కేగ –
చెప్పుకొంటిమెంతొ గొప్పగా  – ” మా వాడు
పట్నమందు చదువువాడ ” టంచు !

ఏటికి పంపినామొ గద ! ఏ గడియన్ చదువంగ పట్నమం –
దేటిని ముంచినామొ; మరి ఏ దవ కీలల దించినామొ; ఆ
పూట గ్రహించలేక చెడిపోతిమిరా ! ఎరుకాయె నిప్పుడే –
కాటికి పంపినామనుచు కన్న కుమారుని దారుణమ్ముగాన్ !

నీ గూర్చి నీవు తలపవు –
నా గూర్చియు తలపబోవు – నాన్నను గూడన్
నీ గుండియలో తలపవు –
పోగాలం బెట్లు వచ్చి పోతివి తండ్రీ !

చదివిన లాభమేమొ, మరి చక్కగ పట్టము పొందు పిమ్మటన్
పదవిని భావి పొందగల భాగ్యము కల్గునొ, లేదొ గాని – నీ
హృదినిటు రాజకీయముల నేటికి నింపితి చిన్ని నాయనా !
వదలక ఎంత పోరినను వచ్చున ? చచ్చున ? రాష్ట్ర మక్కటా !

ఎందరొ కొల్వు లేక – మరి ఎందరొ కూడును, గుడ్డ లేక – ఇం
కెందరొ గూడు లేక – పడి రీ తెలగాణమునందు బాధటం
చందరి కోసమై మదిని అంతగ వేదన చెందినావు ! ఆ
అందరి తోడు – నాన్నయును, అమ్మను గూరిచి తల్చకుంటివో ?

నీవు చచ్చి ఇట్లు నిరసన తెల్పినన్ –
కఠిన హృదులు కాంచి కరుగ గలర ?
రాజకీయమాడు రాజకీయులు గాని –
రాష్ట్ర సాధనమ్ము వ్రాసి ఇడున ?

ఆ కిరోసి నెత్తినప్పుడైనను గాని –
అగ్గి పుల్ల గీచినపుడు గాని –
రెప్ప పాటు నీవు రెండవ యోచన
చేయకుంటి వేల ? చిట్టి తండ్రి !

రాదో – వచ్చునొ – ఇంకిటు
మీద తెలంగాణ మద్ది మే మెరుగమయా !
“రాదిక నీతో బ్రతు” కను
వేదన మా గుండె జీల్చు వే వ్రక్కలుగా !

— *** —ప్రకటనలు

9 వ్యాఖ్యలు (+add yours?)

 1. srikaaram
  అక్టో 25, 2010 @ 14:26:21

  కన్న తల్లి బాధ ‘తేట తెల్లంగానం ‘ బాగా వినిపించారు!

  స్పందించండి

 2. sravani
  అక్టో 26, 2010 @ 19:50:32

  telangana gunde chappudu chaala adbhutamgaa vinipinchaaru.congrats sir…award function eppudo chebithe naakoo veelu choochukuni vachhi mimmalni abhinandinchaalani undi.

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  అక్టో 27, 2010 @ 06:54:27

  శ్రీకారం గారికి
  ధన్యవాదాలు!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  అక్టో 27, 2010 @ 06:54:57

  శ్రావణి గారు!
  నిర్వాహకుల నుండి సమాచారం అందగానే సభా వివరాలు తెలియజేస్తాను.
  మీ అభిమానానికి అనేకానేక ధన్యవాదాలు!

  స్పందించండి

  • sravani
   నవం 21, 2010 @ 22:19:12

   I think the award function is over by now …I couldn’t make it to come and feel the greatness of ur poetry sir.

   Anyway congrats once again…….

   స్పందించండి

   • Dr.Acharya Phaneendra
    నవం 22, 2010 @ 20:17:48

    SRAVANI GARU!
    TODAY, I HAVE BEEN INFORMED ABOUT THE ‘AWARDS FUNCTION’, BY THE ORGANISORS. IT IS ON 30 NOV 2010 AT 6PM IN ‘RAVINDRA BHARATI MINI HALL'(1st floor).
    PLEASE ATTEND.
    ONCE AGAIN THANKING YOU
    – DR.ACHARYA PHANEENDRA

 5. ramnarsimha
  అక్టో 27, 2010 @ 10:42:22

  Mee avedana andari avedana.

  Konni vishayalapai ela spandinachalo okkosari arthamkani paristithi.

  ramnarsimha(nlg)

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  అక్టో 28, 2010 @ 00:57:53

  రామ నరసింహ గారు!
  మన కవులు ఎక్కడో రష్యా, ఇరాక్ పరిస్థితులపై స్పందిస్తారు. పక్కనో, పరిసరాలలోనో జరిగే విషయాలపై స్పందించరు.
  “సమకాలీన సామాజిక పరిస్థితులపై స్పందించకుంటే ఇక కవిత్వమెందుకు?” అని నా భావన.
  ఏమయినా అన్ని ఆవేదనలకు, అందరి ఆవేదనలకు, అనతి కాలంలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

 7. ramnarsimha
  నవం 02, 2010 @ 15:03:08

  Sir,

  I agree with your opinion.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: