పుట్టుమయ్య గాంధి ! పుడమి నింకొకమారు !

పుట్టుమయ్య గాంధి! పుడమి నింకొకమారు!

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

బుద్ధుడు పుట్టినాడొ ! మరి పుట్టెనొ క్రీస్తుయె ! శాంతి బోధనా
బద్ధుడునై మరొక్కపరి భారత భూమిని నీదు రూపులో !
ఉద్ధతి కోరి పీడితుల, కుర్విని శాంతియె ఆయుధంబుగా
యుద్ధము సేయ నేర్పితివి – ఓ కరుణాబ్ధి ! మహాత్మ గాంధిజీ !

సత్య, మహింస, శాంతి – భువి స్థాపన జేయగ నుద్భవించి, స
త్కృత్యములాచరించుచును; కీర్తన సల్పుచు ‘నీశ్వ, రల్లలన్’;
నిత్యము బోధ గూర్చితివి – నిర్మల జీవన మార్గమేదొ ! ఔ
న్నత్యమునెంచి మ్రొక్కెద ననారతమున్ నిను – ఓయి బాపుజీ !

వశమయి ఆంగ్ల నేతలకు భారత మాతయె బానిసాయె – ఏ
దిశయును, మార్గమేదియును దేశ జనావళి కానదాయె – ఆ
దశ నరుదెంచి చూపితివి దారిని, సల్పుచు శాంతి యుద్ధమున్ –
యశము, స్వరాజ్యమందె భరతావనిలో జనమెల్ల నీ కృషిన్ !

ఋషి జీవనమును గడుపుచు
కృషితో నెలకొలిపి శాంతి, కీర్తి గొను నినున్ –
విషమును గ్రక్కుచు కూల్చెను
విష హృదయుం డొక్కడు, మీరు విద్వేషముతో !

హింస పెచ్చు మీరె – హెచ్చాయె స్వార్థమ్ము –
ధర్మ మంతరించె ధరణి నిపుడు !
పుట్టుమయ్య గాంధి ! పుడమి నింకొకమారు –
శాంతి, సత్య మవని సంతరింప !

[ విశ్వమందున్న అహింసా ప్రేమికులందరికీ ‘గాంధీ జయంతి’ శుభాభినందనలు !
– డా.ఆచార్య ఫణీంద్ర ]

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. jaggampeta
  అక్టో 03, 2010 @ 21:37:44

  mahatamudu malli puttina neti nethala madhya ayana bathakagalara?

  స్పందించండి

 2. డా.ఆచార్య ఫణీంద్ర
  అక్టో 05, 2010 @ 02:24:20

  jaggampeta గారు !
  నేటి నేతల మధ్య తానూ ఒకడైనా, బ్రతకలేక పోయినా, అతడు మహాత్ముడు కాలేడు కదా !
  ఆ నేతల తీరు మార్చి, మార్గదర్శనం చేసి సరైన మార్గంలో నడిపించగలిగితేనే ఆతడు మళ్ళీ మహాత్మునిగా కొనియాడబడతాడు. ఏమంటారు ?
  మీకు నా ధన్యవాదాలు !

  స్పందించండి

 3. ramnarsimha
  అక్టో 13, 2010 @ 13:38:58

  Abhinandanalu..

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  అక్టో 16, 2010 @ 22:25:02

  ramnarsimha garu!
  thank you!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: