సౌమనస్యం

సౌమనస్యం

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

అతడు చంద్రుణ్ణి చూసి గాని –

పండుగ చేసుకోడు !

ఇతడు పండుగ చేసుకొన్నాక –

చంద్రుణ్ణి చూడడు !

అయినా …

వాళ్ళిద్దరూ ఒకేరోజు

పండుగ చేసుకొంటున్నారు !

ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొంటున్నారు !

’ అలై బలై ’ తీసుకొంటున్నారు !

అతడందించిన ’ సేమియా కీరు ’

ఇతడు ఆనందంగా సేవిస్తున్నాడు !

ఇతడందించిన ’ ఉండ్రాళ్ళ పాయసం ’

అతడు సంతోషంగా త్రాగుతున్నాడు !

ఇదే హైదరాబాదులో …

మత సామరస్యం !

ఇదీ భాగ్యనగరంలో …

జన సౌమనస్యం !

ఇక్కడ –

’ మక్కా మసీదు ’, ’ గణేశ మంటపం ’

అభిముఖంగా నిలుచొని, పరస్పరం

అభినందనలు తెలుపుకొంటున్నాయి !

అభివందనాలు సమర్పించుకొంటున్నాయి !

ఇప్పుడిక –

ఈ చవితి నాటి నుండి …

నగర వీధులంతా పున్నమి వెన్నెలలే !

’ హుసేన్ సాగర్ ’ నీళ్ళ నీలిమలో మెరుస్తూ

ఏకదంతుని ఏకైక దంత ధవళ కాంతులే !

— # # # —

[ హిందువులందరికీ ’ వినాయక చతుర్థి ’ శుభాకాంక్షలు !

మహమ్మదీయ సోదరులకు ’ ఈద్ ముబారక్ ’ !

– డా. ఆచార్య ఫణీంద్ర ]


ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. padmarpita
  సెప్టెం 10, 2010 @ 22:07:45

  వినాయకచవితి శుభాకాంక్షలు!
  ఈద్ ముబారక్!

  స్పందించండి

 2. savirahe
  సెప్టెం 10, 2010 @ 22:50:33

  chala bagundi sir !!!

  స్పందించండి

 3. కోడీహళ్లి మురళీమోహన్
  సెప్టెం 11, 2010 @ 05:21:17

  మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు!

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  సెప్టెం 11, 2010 @ 23:23:33

  పద్మార్పిత గారికి,
  సావిరహే గారికి,
  మురళీమోహన్ గారికి
  ధన్యవాదాలు ! గణేశ చతుర్థి శుభకామనలు

  స్పందించండి

 5. ramnarsimha
  సెప్టెం 17, 2010 @ 18:05:49

  Mee Kavitha chaala bagundi.

  Abhinandanalu.

  స్పందించండి

 6. Dr.Acharya Phaneendra
  సెప్టెం 30, 2010 @ 06:45:19

  Ramnarsimha garu
  Thank you very much Sir !

  స్పందించండి

 7. Nutakki Raghavendra Rao
  నవం 14, 2010 @ 21:25:48

  సౌమనస్య ధవళ కాంతులలో వెలుగుతున్న భాగ్యనగర సామరస్యం అద్భుతం ఆచార్యా! అభినందనలు…నూతక్కి.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: