ఈ రోజు …

27 జులై .. ఈ రోజు …

నా పుట్టిన రోజు !

1961 వ సంవత్సరంలో ఇదే రోజు ( ఆనాడు గురు పౌర్ణమి ) నేను ’ఇందూరు’ (నిజామాబాదు)లో జన్మించాను. ఈ రోజుతో నాకు 49 సంవత్సరాలు పూర్తయి, ఇది నా 50 వ జన్మదినం.

ఈ రోజు ముందుగా నాకు జన్మనిచ్చి నన్నింతవాణ్ణి చేసిన నా తల్లిదండ్రులను స్మరించుకొని, పరమపదంలో ఉన్న వారిరువురికి అంజలి ఘటిస్తున్నాను.
ఇక … నాలోని సాహిత్యాభినివేశాన్ని గుర్తించి, నన్ను శిష్యునిగా స్వీకరించి, మంచి పద్య కవిగా తీర్చిదిద్దిన మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారికి కూడా వినమ్రాంజలి సమర్పించుకొంటున్నాను
వారిప్పుడు భౌతికంగా నా చెంత లేకున్నా, వారు నాపయి వర్షించిన ఆశీరభినందనలు నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి.

అవి …

విమల కవిత చెప్పు విద్యుల్లతలు పేని –

మానవత్వమునకు మచ్చు తునక!

ఎవని ఎడద కరిగి ప్రవహించు మెదడులో –

అతడు శ్రీ ఫణీంద్ర! అమృత హృదుడు!

ఆత డింజనీరు అణుశక్తి కేంద్రాన –

వృత్తి అది – అతని ప్రవృత్తి కవిత –

కరము పగటి వేళ కర్తవ్యములు తీర్చు!

కలము రేల పసిడి కలలు కనును!

మ్రోయు అతని గుండె వేయి తంత్రుల వీణ –

కమ్మ తెమ్మెరలకు కదల గలదు –

అతని మనసు తెరచినట్టి ద్వారములతో

సౌరభముల కిడును స్వాగతమ్ము!

చూడుమా! ఫణీంద్ర సుకవి మాత్రుడె కాడు –

గుండె పండినట్టి గొప్ప వ్యక్తి!

సాహితీ తపస్వి! సాహిత్య కలశాబ్ధి!

ప్రతిభ రూపు దాల్చు ప్రగతి యోగి!

బ్లాగు మిత్రులు, పెద్దలు … అందరి ఆశీస్సులను, దీవెనలను కోరుతూ …

భవదీయుడు

డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

22 వ్యాఖ్యలు (+add yours?)

 1. Bhaskara Rami Reddy
  జూలై 27, 2010 @ 08:10:23

  ఆచార్యా, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

  స్పందించండి

 2. Manju
  జూలై 27, 2010 @ 08:50:25

  మీకు జన్మదిన శుభాకాంక్షలు

  స్పందించండి

 3. afsar
  జూలై 27, 2010 @ 09:05:55

  ఫణీంద్ర గారు:

  అభినందనలు

  మరిన్ని పుట్టిన రోజులు మరిన్ని పద్యాలుగా చేసుకోవాలని

  అఫ్సర్
  http://www.afsartelugu.blogspot.com

  స్పందించండి

 4. Madhu
  జూలై 27, 2010 @ 09:30:34

  Phaneedraa! Meeku maaa Hrudaya Poorvaka Janma dina Shubha kankshalu.
  Madhu.

  స్పందించండి

 5. narasimharaomallina
  జూలై 27, 2010 @ 10:19:59

  మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాశీస్సులు, మరియు శుభాకాంక్షలు.
  మీ పోస్టు క్రింద నా ఈ మెయిలులో వచ్చిన code అర్థం కాలేదు. వీలైతే విడమర్చి చెప్పండి.

  స్పందించండి

 6. సురేష్ బాబు
  జూలై 27, 2010 @ 12:06:11

  పుట్టినరోజు శుభాకాంక్షలండీ. భగవంతుడు మిమ్ము,మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కొరుకొంటున్నాను.

  స్పందించండి

 7. Satyanveshi
  జూలై 27, 2010 @ 15:39:27

  ఆచార్య ఫణీంద్ర గారూ, జన్మ దిన శుభాకాంక్షలు.

  స్పందించండి

 8. sheshu
  జూలై 27, 2010 @ 17:45:38

  hey,
  gurupurnima is my birthday too. same pinch!!!

  స్పందించండి

 9. kasturimuralikrishna
  జూలై 27, 2010 @ 19:21:19

  congrats on u r 49th birthday.

  స్పందించండి

 10. జ్యోతి
  జూలై 27, 2010 @ 20:28:49

  జన్మదిన శుభాకాంక్షలు.

  స్పందించండి

 11. Srilalita
  జూలై 27, 2010 @ 20:45:52

  ఆచార్య ఫణీందృలకు,
  జన్మదిన శుభాకాంక్షలు

  స్పందించండి

 12. Dr.Acharya Phaneendra
  జూలై 27, 2010 @ 22:50:16

  ఆత్మీయ బ్లాగు మిత్రులు, ’హారం’ నిర్వాహకులు భాస్కర రామి రెడ్డి గారికి –
  మంజు గారికి –
  ప్రముఖ కవి అఫ్సర్ గారికి –
  మధు గారికి –
  కవి మిత్రులు మల్లిన నరసింహారావు గారికి –
  సురేశ్ బాబు గారికి –
  సత్యాన్వేషి గారికి –
  శేషు గారికి –
  ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ గారికి –
  రచయిత్రి, సోదరి జ్యోతి గారికి –
  శ్రీ లలిత గారికి –
  హృదయపూర్వక ధన్యవాదాలు !
  మీ శుభాకాంక్షలు, దీవెనలు నాకు మరింత స్ఫూర్తినిచ్చి,
  ముందుకు నడిపిస్తాయని ఆశిస్తున్నాను

  స్పందించండి

 13. vasanth
  జూలై 28, 2010 @ 00:03:27

  meeku janmadina shubhakankshalu…….
  same dist….sir.

  స్పందించండి

 14. కోడీహళ్లి మురళీమోహన్
  జూలై 28, 2010 @ 09:54:51

  belated greetings. happy birthday to you.

  స్పందించండి

 15. ఫణి
  జూలై 28, 2010 @ 10:36:38

  ఆచార్యా,
  హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

  స్పందించండి

 16. Dr.Acharya Phaneendra
  జూలై 28, 2010 @ 19:55:43

  వసంత్ గారికి –
  మురళీ మోహన్ గారికి –
  ఫణి గారికి –
  హార్దిక ధన్యవాదాలు !

  స్పందించండి

 17. vijayabhanukote
  జూలై 29, 2010 @ 20:25:05

  belated b’day wishes sir 🙂

  స్పందించండి

 18. Dr.Acharya Phaneendra
  జూలై 29, 2010 @ 23:41:10

  Vijaya garu !
  Many many thanks !

  స్పందించండి

 19. annavaram devender
  జూలై 31, 2010 @ 20:49:56

  phanindra ku shubakankshalu

  స్పందించండి

 20. Dr.Acharya Phaneendra
  జూలై 31, 2010 @ 21:23:09

  అన్నవరం దేవేందర్ గారికి ధన్యవాదాలు !

  స్పందించండి

 21. Nutakki Raghavendra Rao
  ఆగ 20, 2010 @ 19:13:01

  ఆచార్యా ! కొంచెం విలంబన జరిగినా అందుకోండి నా నుండి జన్మదిన శుభాకాంక్షలు .శతాధిక జన్మదినోత్సవాలు మీ జీవితపు పుటల్లో నమోదు కావాలని ,నిరంతర సాహితీయానం కొనసాగించాలని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ ..శ్రేయోభిలాషి ..నూతక్కి రాఘవేంద్ర రావు.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: