చలన చిత్ర కవన ఛత్రపతి

చలన చిత్ర కవన ఛత్రపతి

రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా|| ఆచార్య ఫణీంద్ర

విద్వదుత్తమ కవి – ’ వేటూరి సుందర

రామమూర్తి ’ ఘనుడు వ్రాయగలడు

వడిగ, సుడిగ, తడిగ – పామర, పండిత

రంజకముగ గీత రత్నములను !


” జగము లేలిన వాని సగము నివ్వెరబోయె “

నని కావ్య పరిమళా లద్దగలడు –

” రాలిపోయే పువ్వ! రాగాలు నెందుకే ? “

యంచు విషాదాబ్ధి ముంచగలడు –

” ఆకు చాటున పిందె – కోక మాటున పిల్ల “

యంచు శృంగారాగ్ని పెంచగలడు –

” ఆరేసుకోబోయి పారేసుకొన్నాన “

టంచు ’ మసాల ’ దట్టించగలడు –


’ సీత కోక చిలుక ’, ’ సిరిసిరిమువ్వ ’ లున్

కేళి యాడు నతని గీతులందు !

’ శంకరాభరణము ’, ’ సాగర సంగమ ’

ధ్వనులు మ్రోగు నతని పాటలందు !


వాలి పోయె పొద్దు – వర్ణాలు దు:ఖించె

తోడు నీడ లేని మోడులగుచు –

వీడ, వేల గీత వితతు లల్లినయట్టి

చలన చిత్ర కవన ఛత్రపతియె !


( సినీ గీత రచయిత కీ.శే. వేటూరి సుందర రామమూర్తి దివ్య స్మృతికి నివాళిగా …)

— *** —

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. SRRao
  జూన్ 13, 2010 @ 18:34:21

  ఆచార్య ఫణీంద్ర గారూ !
  సినీ సాహితీ మూర్తికి మీ నివాళి బాగుంది. ధన్యవాదాలు.

  స్పందించండి

 2. రవి
  జూన్ 13, 2010 @ 19:29:40

  వేటూరి పాటలానే అందంగా వ్రాశారండి.

  స్పందించండి

 3. కంది శంకరయ్య
  జూన్ 14, 2010 @ 07:17:59

  ఆచార్య ఫణీంద్ర గారూ,
  వేటూరి వారికి మీ స్మృత్యంజలి మధురంగా ఉంది. నిన్న యూసుఫ్ గూడా కృష్ణకాంత్ పార్క్ లో జరిగిన బ్లాగర్ల సమావేశానికి మీరు వస్తారనుకున్నాను.

  స్పందించండి

 4. Dr.Acharya Phaneendra
  జూన్ 14, 2010 @ 15:18:17

  SRRao గారికి, రవి గారికి కృతజ్ఞతలు

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  జూన్ 14, 2010 @ 15:24:26

  శంకరయ్య గారికి ధన్యవాదాలు.
  బ్లాగర్ల సమావేశం గురించి నాకు ముందుగా సమాచారం లేదు.
  సమాచారమున్నప్పుడు కూడా, ఒకటి రెండు సార్లు వద్దామంటే తీరుబడి లేక రాలేక పోయాను.
  మరెప్పుడయినా రావడానికి ప్రయత్నిస్తాను.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: