విరబూచె ఈ తరువెన్నో … ( గీతం )

విరబూచె ఈ తరువెన్నో … ( గీతం )

రచన : డా || ఆచార్య ఫణీంద్ర

విరబూచె ఈ తరువెన్నో
పూలు –
వెదజల్లెను మన కోసమె
ఎన్నెన్నో పరిమళాలు –            || విరబూచె ||

ఏ పూవు విత్తనమో
ఈ నేల రాలింది –
ఈ నేల పులకించి
మొక్క మొలకలెత్తింది –
కొమ్మ కొమ్మల లోపల
కోరికలెన్నో దాచుకొని …
రెమ్మ రెమ్మల లోపల
ఆశలనెన్నో నింపుకొని …           || విరబూచె ||

తాను కాస్త నీరు త్రావి
త్యాగ గుణం పంచింది –
తనకు ఎండ తాకినా
ప్రజకు నీడనిచ్చింది –
మొగ్గ మొగ్గై చేరును
ఏ మగువల జడలోకో …
పువ్వు పువ్వై చేరును
ఏ దేవుని పూజలకో …             || విరబూచె ||

బ్రతికినన్నినాళ్ళు
పరుల కొరకు బ్రతికేను –
ప్రాణముడిగినాక
వంట చెరుకు అయ్యేను –
మనిషై పుట్టి, మనిషిని
దోచడమే … ఖర్మ !
మ్రానై పుట్టి, మనిషిని సే
వించడమే … జన్మ !!                  || విరబూచె ||

— *** —

2 వ్యాఖ్యలు (+add yours?)

 1. కంది శంకరయ్య
  ఏప్రి 13, 2010 @ 05:56:04

  ఫణీంద్ర కవీంద్రులకు నమస్కారం. చాలా కాలానికి మీ పోస్ట్ కనిపించింది. సంతోషం. “పరోపకారాయ ఫలంతి వృక్షాః” సూక్తిని చక్కగా గేయబద్ధం చేశారు. బాగుంది.

  స్పందించండి

 2. Dr.Acharya Phaneendra
  ఏప్రి 13, 2010 @ 18:16:09

  ఆత్మీయ కవి మిత్రులు కంది శంకరయ్య గారికి నమః
  ఈ మధ్య ఒక ప్రక్క ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండడం, మరో ప్రక్క వరుసగా ’భువన విజయం’ ప్రదర్శనలు, ఇంకో ప్రక్క సాహిత్య సభల నిర్వహణ, సిటీలో..ఇతర పట్టణాలలో సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనడం, నా ’వరాహ శతకం’ ముద్రణ పనులు చూసుకోవడం, మా గురువు గారి పద్యాలతో ఆడియో సి.డి రూపొందించడం … ఇలా…. బ్లాగులను పట్టించుకోలేని స్థితిలో ఉన్నాను. అయినా అడపా దడపా ఇలా కనిపిస్తాను లెండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: