ఆధిపత్యంపై తిరుగుబాటు

INDIA 1953

ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని విభజించి, ఆంధ్ర రాష్ట్రం ( అప్పటికి తెలంగాణను అందులో కలపాలన్న ప్రసక్తి రాలేదు. ) ఏర్పాటును ఆకాంక్షిస్తూ, 1952 లో ” శ్రీనివాస సోదర ” కవులు వ్రాసిన పద్య కవిత – ” రాష్ట్ర సాధన “

రాష్ట్ర సాధన

ఉన్నతోద్యోగమ్ము లున్నంతవరకును

కేరళుల్, తమిళులు దూరుచుండ,

ప్రాజెక్టులాది యావశ్యకమ్ముల కెల్ల

అరవ దేశంబె ముందడుగు వేయ,

పండించి తిండికై పరులకు చేజాచి

ఎండుచు తెలుగులు మండుచుండ,

తమ పట్టణమునందె తాము పరాయిలై

దెస తోప కాంధ్రులు దేవురింప,


ఆంధ్ర రాష్ట్రము కావలె ననుట తప్పె?

తెలుగు పంట, తెలుగు సొమ్ము, తెలుగు కండ

తెలుగు వారికి గాని ఈ దీన దశను

ఎంత కాలము నలిగి పోయెదము మేము?


మన యింట పరుల పెత్తన మేమియని కాదె

సత్యాగ్రహంబులు సల్పినాము?

మన సొమ్ము నితరులు తినిపోయిరని కాదె

ఉపవాస దీక్షల నూనినాము?

మన కధికారముల్ పొనరలేదని కాదె

సహకార నిరసన సలిపినాము?

మన క్షేమ లాభముల్ మసియయ్యెనని కాదె

కారాగృహమ్ముల జేరినాము?


తలలు కలుపక రండని పలికినపుడు

బ్రిటిషువారిని తెగ విమర్శించినట్టి

పెద్ద లా పాటనే వెళ్ళబెట్టి రిపుడు!

మాట నిలుకడ తప్పి రీ మాత్రమునకె!


మన ప్రధాని మాటె మనకు సిద్ధాంతంబు!

ఆంధ్ర రాష్ట్ర మొకరి నడుగ నేల?

దానమా? ఇదేమి తద్దినమా? మూల్గి,

చీది, ఒక్కడేదొ చేయి విదుప!


ఢంకాపై గొట్టి నిరా

తంకంబుగ హక్కు చూపి, దర్పము మీరన్

అంకించుకొందు మంతే!

ఇంకన్ పెద్దరికములకు నిట తావున్నే?

—***—

ఈ పద్యాలలో ” అరవ ” లేక ” తమిళ ” అని ఉన్నచోట – ” ఆంధ్రా ” అని,

” ఆంధ్ర ” లేక ” తెలుగు ” అని ఉన్నచోట – ” తెలంగాణ ” అని మారిస్తే …

ఇవి తెలంగాణోద్యమ పద్యాలయిపోతాయి. అప్పటి ఆంధ్రా వాళ్ళ మనోభావాలు, ఇప్పటి తెలంగాణా వాళ్ళ మనోభావాలు అచ్చంగా ఒకేలా ఉండడం ఆశ్చర్యకరమే అయినా, కాకతాళీయం మాత్రం కాదు.

ఆనాడు విడిపోదామన్నవారు ” భాషాభేదా ” న్ని ప్రధానాంశం చేస్తే, కలిసుందామన్న వారు ” దక్షిణ భారతీయుల సమైక్యత ” అంటూ ఆదర్శాన్ని వల్లించారు.

ఈనాడు విడిపోదామన్నవారు ” ప్రాంతీయ సంస్కృతి ” ని ప్రధానాంశం చేస్తే, కలిసుందామంటున్న వారు ” భాషా సమైక్యత ” అంటూ ఆదర్శాన్ని వల్లిస్తున్నారు.

నిజానికి ఇవేవీ అంశాలే కావు!

ఆనాడైనా, ఈనాడైనా జరుగుతున్నది ఆధిపత్యంపై తిరుగుబాటు!!

– డా|| ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

20 వ్యాఖ్యలు (+add yours?)

 1. తాడేపల్లి
  జన 26, 2010 @ 22:28:45

  మీ అభిప్రాయంతో ఏకీభించలేకపోతున్నాను. ప్రస్తుత తెలంగాణ వేర్పాటు ఉద్యమం అప్పటి ఆంధ్రోద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా ఇమిటేట్ చేస్తోంది. అలాంటి కారణాలు ఇక్కడ/ ఇప్పుడు valid కాకపోయినా ! అది (ఆ పద్యమాలికలో ప్రస్తావించినది) బలవంతంగా ఒక ప్రెసిడెన్సీగా పరాయి పాలకుల చేత కలపబడ్డ వేఱువేరు జాతుల మధ్య అప్పటికి ఉన్న సంబంధాలు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు వేఱే జాతి కాదు. వారు తెలుగుజాతిలో ఒక భాగం. వాస్తవానికి సమైక్యరాష్ట్రంలో నష్టం జఱిగింది కోస్తాకీ, రాయలసీమకే తప్ప తెలంగాణకి కాదు. సమైక్యరాష్ట్రం వల్ల తెలంగాణ బాగుపడింది. స్వాతంత్ర్యం లేని కాలంలో, ప్రజాస్వామ్యం లేని రోజుల్లో ఆధిపత్యం అనే మాటకు ఒక అర్థం ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం ప్రకారం సర్వహక్కులూ అనుభవిస్తున్న తెలంగాణప్రజలకి అలాంటి క్లెయిముల్ని ఆపాదించడం కేవలం నిరాధారమైన దుష్ప్రచారం అనిపించుకుంటుంది. మీరు రాసినది చాలా నయం. కొంతమంది ఏకంగా ఆంధ్రప్రాంతీయుల్ని బ్రిటీషువారితో పోలుస్తున్నారు.

  తెలంగాణ అనేది ఒక imaginary, unofficial/ un-recognised piece of land. ఆ దృష్టితో ప్రతిదాన్నీ చూడ్డం సమంజసం కాదు. ఆ ప్రాతిపదిక మీద తోటి తెలుగు సోదరుల్ని విలనైజ్ చెయ్యడమూ భావ్యం కాదు. ఆధిపత్యం అంటున్నారు. ఏ ఆంధ్రావాడు ఏ తెలంగాణవాడిమీద జులుమ్ చేశాడో చెప్పండి. నాకు తెలిసి “ఆంద్రోల్లు” చాలా మెత్తటి, నెమ్మదైన జనాభా.

  స్పందించండి

  • హరి దోర్నాల
   జన 27, 2010 @ 23:32:44

   @తాడేపల్లి

   ఇక్కడ ఆచార్య ఫణీంద్ర గారు ప్రస్తావించినది అప్పటి ప్రత్యేకాంధ్ర, ఇప్పటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాల పోలిక గురించి. ఇప్పటి తెలంగాణా వారి భావాలను పైనున్న పద్యాలు సరిగ్గా ప్రతిఫలిస్తున్నాయి. ఇక్కడ జాతుల ప్రస్తావన ఎందుకండీ? తమిళులు కూడా భారతీయులే కదా? ఎందుకు విడిపోవాలను కున్నారో పైనున్న పద్యాలే చెబుతున్నాయి.

   ఉన్నతోద్యోగమ్ము లున్నంతవరకును
   కేరళుల్, తమిళులు దూరుచుండ,
   ప్రాజెక్టులాది యావశ్యకమ్ముల కెల్ల
   అరవ దేశంబె ముందడుగు వేయ

   పై వాక్యాలు ఇప్పటి తెలంగాణా విషయం లో కూడా వాస్తవాలే. కాని మీరు ఒప్పుకోరు. కేరళ వారు, తమిళులు దూరితే అన్యాయం, ఆంధ్రా వారు దూరితే మాత్రం అది వారి ప్రతిభ అనడం ఎంత వరకు సమంజసమో ఆలోచించండి. అలాగే ప్రాజెక్టుల క్రింద ఆరు లక్షల ఎకరాలు ఆంధ్రాలో పారుతుంటే, రెండు మహా నదులు పారుతున్నా నలభై శాతంగా ఉన్న తెలంగాణాలో అరవై ఏళ్ళ తరవాత కూడా కేవలం ఎనభై ఎకరాలే పారడాన్ని ఏమనుకోవాలి?

   తమ పట్టణమునందె తాము పరాయిలై
   దెస తోప కాంధ్రులు దేవురింప

   ఇది చూడండి ఎంత చక్కగా సరిపోయిందో. ఇప్పటికే నిస్సిగ్గుగా ఎంతో మంది ఆంధ్రా నాయకులు ‘హైదరాబాదు మాదే’ అంటున్నారు. హైదరాబాదు తప్పించి మిగతా తెలంగాణా ఇచ్చేస్తామంటున్నారు. ఈనాడు హైదరాబాదులో తెలంగాణా వారు యాభై గజాల నేల కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు.

   తెలంగాణ అనేది ఒక imaginary, unofficial/ un-recognised piece of land కాదు. తెలంగాణా ఒక నిజం. ఒక రాజ్యం. అది 1948 వరకూ స్వతంత్రంగా వున్న దేశం. 1956 వరకు సమర్థవంతంగా పరిపాలించు కున్న రాష్ట్రం.

   ఆంధ్రా వారు విడిపోయినపుడు తమిళులను విలన్లు గా భావించారేమో తెలియదు కాని, మేమలా భావించడం లేదు. ఆంధ్రులు ‘మెత్తని’ వారైతే తెలంగాణా వారు మరింత మెత్తని వారు. అందుకనే తెలంగాణా వ్యాపితంగా ఆంధ్రా వారు లక్షలాది మంది నిర్భయంగా బ్రతుకు తున్నారు. పాకిస్తాను మన శత్రువని అంటే పాకిస్తానీయులంతా కఠిన హృదయులని కాదు.

   మద్రాసు నుండి విడి పోవడానికి మీరెంత తహ తహ పడ్డారో తెలంగాణా వారిలో కూడా అంతే తహ తహ వుందని గుర్తించండి. సహృదయత తో మా ఆవేదనని అర్థం చేసుకుని ఆంధ్రా వారి గొప్ప గుణం నిరూపించుకోండి. అంటే కాని మీ అర్థం లేని అభ్యంతరాలతో పరిస్థితిని మరింత జటిలం చేసి పలుచన కావద్దని మనవి.

   స్పందించండి

   • హరి దోర్నాల
    జన 27, 2010 @ 23:42:29

    క్షమించాలి. పైన ‘ఎనభై ఎకరాలు’ అన్న దానిని ఎనభై వేల ఎకరాలు గా చదువుకో గలరు.

 2. Raghavendra Rao Nutakki
  జన 27, 2010 @ 02:54:42

  I want to discus a lot on this if you permit…NUTAKKI

  స్పందించండి

 3. pannaga
  జన 27, 2010 @ 06:48:01

  ఎంత చక్కగా వాస్తవాన్ని వివరించారండి. అభినందనలు.

  స్పందించండి

 4. Sankar
  జన 27, 2010 @ 08:41:28

  Meaningless & Idiotic comparision!

  Note: Hyderabad State that spreads in to present day Maharashtra, Karnataka in the map. So, present Telangana LOST much more weathy areas to neighbouring states, did anyone fight for this? NO!

  స్పందించండి

 5. సమతలం
  జన 27, 2010 @ 10:05:56

  nijam

  స్పందించండి

 6. Surya
  జన 27, 2010 @ 13:05:20

  It is so sad to see that people have become so weak to give into such divisive feelings. Common man wants to be part of the society’s prosperity, they don’t want it all for themselves alone.

  స్పందించండి

 7. Dr.Acharya Phaneendra
  జన 28, 2010 @ 00:10:45

  తాడేపల్లి గారు !
  ఈనాడు తెలంగాణ పల్లె పల్లెలో ఉద్యమిస్తున్న ప్రజలలో ముప్పావు మందికి మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం గురించి తెలియదనే చెప్పాలి. అలాంటిది వారు దాన్ని అనుకరిస్తున్నారనడం హాస్యాస్పదం.
  ఆంధ్ర రాష్ట్ర విభజన కూడా భారత స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగం ప్రకారం సర్వ హక్కులు అనుభవిస్తున్న కాలంలోనే జరిగిందన్న విషయాన్ని మరచినట్టున్నారు. 1956లో కూడా తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందని 1st SRC చదివితే అర్థం అవుతుంది. తెలంగాణ అన్నది ఇమాజినరీ/ అనఫిషియల్/ అన్ రికగ్నైజ్డ్ లాండ్ అయితే ఫజల్ అలీ దాని గురించి అన్ని పేరాలు వ్రాసే వాడే కాడు. ఇక ఆధిపత్యం ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే మన ప్రథమ ప్రధాని అది ఎలా జరిగే అవకాశం ఉందో వివరించారు. నచ్చక పోతే విడిపోవచ్చని కూడా చెప్పారు. నెహ్రు ఊహించినట్టుగానే ఆధిపత్య ధోరణి మొదటి నుండి కొనసాగుతూనే ఉంది. దీనిని గత పదేళ్ళుగా తెలంగాణ వాదులు వివరిస్తూనే కదా ఒక్కొక్క పార్టీని తమకు అనుకూలంగా మాట్లాడేలా చేసింది. నేను కొత్తగా వివరించనక్కర లేదు. అయినా ఇంకా తెలుసుకోవాలంటే, ఇంతకు ముందు నా టపా ” దోషమె కంఠమెత్తినన్ ? ” చదవండి.
  అంతెందుకు ? మాకిష్టం లేదన్నా, బలవంతంగా కలిసి ఉండాలనడం ఆధిపత్య ధోరణి కాదా ?

  స్పందించండి

 8. Dr.Acharya Phaneendra
  జన 28, 2010 @ 00:33:07

  NUTAKKI GARU !
  MANY THINGS WERE DISCUSSED BY PEOPLE OF BOTH THE REGIONS FOR ALMOST A DECADE.
  HAD THERE BEEN ANY THING WORTH TO BE CONVINCED, TELANGANA MOVEMENT WOULD HAVE BEEN CURBED. BUT IT WENT ON GETTING STRENGTHENED YEAR BY YEAR.
  THAT IS WHY, MANY LEADERS OF PAST LIKE NEHRU, GEORGE FERNANDEZ, VAJPAYEE SUPPORTED IT AND PRESENT LEADERS OF STATURE LIKE SONIA , ADVANI, PRANAB MUKHARJEE, CHIDAMBARAM WERE COMPELLED TO BOW DOWN BEFORE THE JUSTIFIED ASPIRATION OF PEOPLE OF TELANGANA.
  HENCE I FEEL WE NEED NOT WASTE OUR TIME DISCUSSING THE SAME AGAIN.
  IF YOU HAVE ANY NEW POINT TO BE DISCUSSED ABOVE ALL, I WELCOME YOU.

  స్పందించండి

 9. Dr.Acharya Phaneendra
  జన 28, 2010 @ 00:57:14

  పన్నగ గారు ! సమతలం గారు !
  ప్రతి నిత్యం ఇద్దరో, ముగ్గురో ఆత్మాహుతి చేసుకొంటున్న దయనీయమైన స్థితికి చేరుకొన్న తెలంగాణ గంభీర సమస్యను అర్థం చేసుకొన్న మీ సహృదయతకు నా కృతజ్ఞతలు !

  స్పందించండి

 10. Dr.Acharya Phaneendra
  జన 28, 2010 @ 01:23:18

  MR. SANKAR !
  THE POEMS WERE NOT WRITTEN BY ME. THEY WERE WRITTEN BY THEN FAMOUS SATAAVADHANI POETS, IN 1952, BEFORE I TOOK BIRTH.
  IF YOU GO THROUGH WORD BY WORD IN EACH OF THE POEMS, YOU FIND THE SAME, WHAT PRESENT DAY TELANGANA MOVEMENT EXPLAINS.
  IT IS IDIOTIC TO SAY THAT IT IS IDIOTIC COMPARISION, WHEN EVERY THING LOOKS SO SIMILAR.
  FOR JOINING WITH TELANGANA , ANDHRA LOST BARHAMPUR , GANJAM , PARLAKIMIDI , BELLARI , HOSPET, VELLORE , TIRUTTANI , MADRAS etc., AND YANAM WHICH IS WITH PUDUCHHERY.
  WAS IT A REAL SAMAIKYA ANDHRA PRADESH FORMED IN 1956 ? DID ANYONE BOTHER ABOUT THE ANDHRAS LEFT OVER IN THOSE AREAS ? NO.

  స్పందించండి

 11. Dr.Acharya Phaneendra
  జన 28, 2010 @ 01:36:37

  MR. SURYA !
  THE PEOPLE ARE COMING ON TO ROADS FOR AGITATING IN EVERY VILLAGE AND CITY IN TELANGANA , SACRIFICING THEIR DAILY EARNINGS . AROND 200 STUDENTS AND YOUNGSTERS HAVE SHOWN THEIR ULTIMATE PROTEST BY SELF IMMOLATION SO FAR .
  ARE THEY NOT COMMON MEN ?

  స్పందించండి

 12. Dr.Acharya Phaneendra
  జన 28, 2010 @ 01:50:05

  హరి దోర్నాల గారు !
  తాడేపల్లి వారి వ్యాఖ్యకు నేను సమాధానం ఇచ్చే ముందు, మీ సమాధానం చూసి ఉంటే, నేను ఆ ప్రయత్నం చేసి ఉండేవాణ్ణి కాదు.
  నా సమాధానం కన్న మీ సమాధానం చాలా బాగుంది.
  మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

  స్పందించండి

 13. Surya
  జన 28, 2010 @ 10:04:57

  Phaneendra Garu,

  I didn’t find fault with peoples agitation. I only objected to your characterization(Adhipatya pOru) of what is going on.

  As for the agitaion, if peoples problem are not solved, then they will find ways to solve them. They are swayed to the idea that telangana state is the solution for all their problems. How much truth is there in that idea?

  It’s very easy to pose questions than answering them. Don’t forget that we were under socialist regime for more than 50 years after independence. Governments are beginning to be responsive only now.

  People sentiments are very important and can be very powerful, if they are empowered enough.

  స్పందించండి

 14. Raju
  జన 29, 2010 @ 04:21:42

  Well said Phanidra gaaru.

  JAI TELANAGANA

  స్పందించండి

 15. Dr.Acharya Phaneendra
  జన 29, 2010 @ 06:44:05

  SURYA GARU !
  WHEN PEOPLE OF ANDHRA REGION INFORMED OUR FIRST PRIME MINISTER PUNDIT NEHRU ABOUT ” VISALANDHRA ” CONCEPT, DO YOU KNOW HOW HE REACTED ? HE SAID ” IT IS AN IMPERIALISTIC AGGRESSION OVER NEIGHBOUR LAND IN THE DISGUISE OF DEMOCRACY.” DO YOU UNDERSTAND WHAT ” ADHIPATYAM ” HE WAS HINTING ?
  BUT DUE TO CONTINUOUS LOBBYING AND PRESSURE FROM THE LEADERS OF ANDHRA REGION, EVEN NEHRU WHO IS INTERNATIONALLY FAMOUS FOR HIS SCHOLARSHIP, SUCCUMBED TO FORM ANDHRA PRADESH STATE AGAINST THE WILL OF PEOPLE OF TELANGANA . STILL WHILE FORMATION OF ANDHRA PRADESH , HE SAID ” EK MASOOM TELANGANA LADIKIKO EK NATKAT ANDHRA LADKASE SHADI KIYAJARAHA HAI . E CHALE TO CHALE . NAHI TO JUDA HOSAKTE HAI. ”
  DO YOU UNDERSTAND WHAT ” ADHIPATYAM ” HE WAS CAUTIONING ?
  LATER, EVERY THING HAPPENED, AS HE EXPECTED. ” GENTLE MEN^S AGREEMENT WAS VIOLATED BY RIGHT FROM CHIEF MINISTER TO COMMON MAN OF ANDHRA REGION. MULKI RULES WERE VIOLATED INTENTIONALLY . THEN TELANGANA AGITATION ROSE WITHIN TEN YEARS AND REACHED ITS PEAK IN 1969. IT WAS CRUSHED BY THEN CM WHO WAS FROM ANDHRA REGION BY GUNNING DOWN 369 STUDENTS. DON^T YOU SEE ANY ” ADHIPATYAM ” THERE ?
  LATER WHEN SUPREME COURT UPHELD MULKI RULES, WHICH WERE AGREED IN GENTLE MEN^S AGREEMENT. STRANGE ! THE PEOPLE FROM ANDHRA REGOIN , WHO ALWAYS PREACH ” SAMAIKYATA “, STARTED AGITATING FOR DIVISION AND FINALLY GOT THE MULKI RULES ABOLISHED BY CONSTITUTIONAL AMENDMENT IN PARLIAMENT.
  WHEN THEIR INTERESTS ARE FULFILLED, IT IS ” SAMIKYANDHRA ” , OTHERWISE , ” JAI ANDHRA ” … AND STILL YOU DON^T FIND ANY ” ADHIPATYAM ” !
  LATER ” SIX POINT FORMULA ” CAME TO GET VIOLATED, AS USUAL . WITHIN TEN YEARS THE SAME THING WAS BROUGHT TO THE NOTICE TO THEN CM NTR . HE ISSUED 610 G.O. WHICH IS NOT IMPLIMENTED EVEN AFTER 25 YEARS. GIRGLANI COMMISSION CONFIRMED THAT, 2,50,000 GOVT.EMPLOYEES FROM ANDHRA REGION ARE WORKING IN TELANGANA ILLEGALLY . THIS IS ALL ONE ASPECT OF ADHIPATYAM IN THE FIELD OF EMPLOYMENT. THERE ARE MANY MANY FIELDS TO BE EXPLAINED. WE EXPLAIN .. EXPLAIN … AND EXPLAIN . PEOPLE OF OTHER LANGUAGES AND STATES LIKE NEHRU, ADVANI, GEORGE FERNANDEZ , MAYAVATI , SONIA GANDHI ETC. UNDERSTAND BUT, PEOPLE OF ANDHRA REGION, WHO TALK ABOUT ” BROTHERHOOD ” DO NOT UNDERSTAND.
  DURING ELECTION EVERY PARTY HEADED BY A LEADER OF ANDHRA REGION SUPPORTS DIVISION, SAYING THAT THEY STAND FOR JUSTICE. AFTER ELECTION THEY TAKE U -TURN.
  WE PITY OURSELVES AND GET DISGUSTED. THAT IS WHY SO MANY SUICIDES ARE COMMITTED IN TELANGANA REGION TODAY .
  STILL .. STILL … STILL …. YOU AND PEOPLE LIKE MR. TADEPALLY FIND NO ” ADHIPATYAM ” AND NO ” INJUSTICE ” AND SAY ALTERNATE SOLUTION IS TO BE THOUGHT OF.
  YOU SAY ” PEOPLE OF TELANGANA BECAME SO WEAK TO GIVE INTO DIVISIVE FEELINGS “. BUT YOU SHOULD UNDERSTAND THAT THEY TRIED MANY ALTERNATE SOLUTIONS AND GOT DEFEATED FOR LAST FIVE DECADES.
  NOW THEY AND EVEN ANY SCHOLAR OF INDIAN POLITICS, STRONGLY FEEL THAT ONLY DIVISION CAN SAVE THEM.

  స్పందించండి

 16. Dr.Acharya Phaneendra
  జన 29, 2010 @ 06:48:21

  RAJU GARU !
  THANK YOU SIR !

  స్పందించండి

 17. kanred
  ఏప్రి 15, 2010 @ 13:20:02

  phaneendraacharyula vaaaru,
  neenu mee post ki chala late gaa samaadhanam isthunnanu anukuntaa.
  baagudu padya kavitvam ……manamu evarainaa debba tagilithe ammaaa abbaaa ane arusthamu … ade jariginadi …..
  appudu …ippudu….

  i dont agree with the jawahar lal nehru s idea of a maasoom girl and so on…. he was not happy with the division of the madras state then …..may be he was biassed or may be not.
  manam etlaa theesukuntey atlaaney untundi ….

  also tadepally vaari and some others remarks too arent good.

  anyaayam jarigindi kaadananu,,,,
  actually there s no interest shown by the state or andhra or local telanganaa leaders for development ….corruption took its course …..and politics too….

  the result , fight amongst ourselves…..

  ramakanthudu

  స్పందించండి

 18. Dr.Acharya Phaneendra
  ఏప్రి 17, 2010 @ 00:17:18

  Ramakanthudu garu !
  Really there is no fight against ourselves, if one region people’s fundamental right to decide themselves to live together or to live separately, is respected by other region people.
  In Mahabharata also, there would have not been a kurukshetra war, had kauravas agreed to give five villiages to pandavas. Then, Pandavas would have moved friendly and respected them as brothers.
  Alas ! kauravas did not understand this in those days; and now of course the andhras.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: