నా ప్రేమ ప్రేమే కానిచో …

నా ప్రేమ ప్రేమే కానిచో …

[ తెలుగు గజల్ ]

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

నా ప్రేమ ప్రేమే కానిచో

ఆ ప్రేమ సౌధమె కూలనీ !

నా గుండె గుండే కానిచో

అది మండి మసియై రాలనీ !          || నా ప్రేమ ||

తొలి చూపులోనే వలపును

నీ పైన జల్లుగ కురిసిన

నా కళ్ళు కళ్ళే కానిచో

అవి చితికి చిటపట ప్రేలనీ !             || నా ప్రేమ ||

నీ విరహమున మున్నీటిగా

కార్చానులే కన్నీటిని –

ఆ నీరు నీరే కానిచో

అది మురుగు కాల్వను తేలనీ !      || నా ప్రేమ ||

నీ పొందు కోరి తపించిన,

నిను పొందగోరి కృశించిన

నా తనువు తనువే కానిచో

అది వల్లకాటిని కాలనీ !                  || నా ప్రేమ ||

— *** —

ప్రకటనలు

5 వ్యాఖ్యలు (+add yours?)

 1. Bhaskara Rami Reddy
  నవం 21, 2009 @ 21:53:09

  చాలా బాగుంది ఆచార్యా.
  >>అది మురుగు కాల్వను తేలనీ కొంచెం ఇబ్బంది అనిపించింది.

  స్పందించండి

 2. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 21, 2009 @ 23:51:47

  రామిరెడ్డి గారు !
  ” తనువు వల్లకాటిని కాలనీ ” అనుకొనే భగ్న ప్రేమికునికి
  ’ మురుగు కాల్వ ’ అయితే ఏమిటి ? మరోటి అయితే ఏమిటి ?
  సరే ! మీ సెంటిమెంట్ మీది.
  మీకు నా ధన్యవాదాలు !

  స్పందించండి

 3. Bhaskara Rami Reddy
  నవం 22, 2009 @ 00:11:24

  ఆచార్యగారూ, అయ్యో అది నేను సెంటిమెంట్ తో వ్రాసింది కాదండి. బహుసా పూర్తిగా వ్యాఖ్యను వ్రాసి వుంటే బాగుండేది. నా వుద్దేశ్యం ఆ వాక్యం అక్కడ కవిత కు ఎందుకనో అమరినట్టు లేదనిపించింది. కాల్వ బదులు వేరే పదమేమేనా వుంటే బాగుండేదని అనుకున్నాను. ఇది నా అభిప్రాయము మాత్రమే.

  స్పందించండి

 4. Nutakki Raghavendra Rao
  నవం 27, 2009 @ 10:29:41

  ఆచార్యా! యీక్రింది పదాలు అధ్భుతంగా వున్నాయి…..but… కృషించిన …? మీ భావన….. కృశించిన అయితే యింకా బాగుండేదేమో..అభినందనలతో..నూతక్కి

  నీ పొందు కోరి తపించిన,
  నిను పొందగోరి కృషించిన
  నా తనువు తనువే కానిచో
  అది వల్లకాటిని కాలనీ !

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  నవం 28, 2009 @ 16:51:55

  రాఘవేంద్ర రావుగారు!
  ’కృశించిన’ యే Correct. Typographic Error ని సరిచేసాను.
  మీకు నా ధన్యవాదాలు!

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: