‘భువన విజయం’ లో నేను …

download

ఈ రోజు ( 10 నవంబరు 2009 ), తెలుగు భాషకు విశేషమైన సేవ చేసిన ‘ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ‘ జయంతి సందర్భంగా, ‘ సి.పి.బ్రౌన్ అకాడమి, హైదరాబాద్ ‘ వారు ‘ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘ ఆడిటోరియంలో ‘ భువన విజయం ‘ సాహిత్య రూపకాన్ని నిర్వహించారు. అందులో నేను ‘ నంది తిమ్మన ‘ పాత్రను పోషించాను. సుమారు రెండు గంటల పాటు ఈ సాహిత్య రూపకం నాలుగు భాగాలుగా సాగింది. మొదటి భాగంలో రాయల వారి స్తుతి, రెండవ భాగంలో కావ్య గానం, మూడవ భాగంలో కొన్ని సమస్యా పూరణలు, నాలుగవ భాగంలో పెద్దన కవి మాలికా పఠనం తరువాత గండ పెండేర ప్రదానంతో రూపకం పరాకాష్ఠకు చేరుకొని ముగిసింది. మొదటి భాగంలో రాయల వారిపై సీస పద్యంతోబాటు, రెండవ భాగంలో నా కావ్య గానంగా ‘ పారిజాతాపహరణం ‘ లోని కొన్ని రమణీయ పద్యాలను రాగ యుక్తంగా గానం చేసాను.
దత్తాత్రేయ శర్మ ( శ్రీ కృష్ణ దేవ రాయలు ), సాధన నరసింహాచార్యులు ( అప్పాజీ ), జి.ఎం. రామశర్మ ( పెద్దన ), సూర్య నారాయణ మూర్తి ( తెనాలి రామకృష్ణుడు ), కె.వి.ఎన్. ఆచార్యులు ( నరస కవి ) మొదలైన వారు పాల్గొన్న ఈ భువన విజయ రూపకాన్ని తిలకించేందుకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ కులపతి ఆచార్య కొనకలూరి ఇనాక్, ప్రముఖ కవి డా.జె. బాపురెడ్డి, సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య చేకూరి రామారావు మొదలగు సాహితీమూర్తులతోబాటు జంట నగరాలలోని చాలా మంది సాహితీ ప్రియులు విచ్చేసి, ప్రదర్శనానంతరం ప్రశంసల జల్లును కురిపించారు.
పై చిత్రంలో రూపక ప్రదర్శనలో ఒక దృశ్యం, క్రింది చిత్రంలో తిమ్మన పాత్రధారినైన నాకు జరిగిన సత్కారం చూడవచ్చు.
— డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. కొత్తపాళీ
  నవం 11, 2009 @ 04:05:50

  చాలా సంతోషం

  స్పందించండి

 2. vasu
  నవం 11, 2009 @ 04:22:33

  బావుందండీ. రికార్డు చేసి ఉంటే మీ పద్యాలను ఒకటి రెండు ఆడియో క్లిప్స్ గా పెడితే బావుంటుంది.

  స్పందించండి

 3. Amma Odi
  నవం 11, 2009 @ 13:44:58

  చూడగలిగి ఉంటే మరింత సంతోషించే వాళ్ళం.

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 11, 2009 @ 19:57:02

  ’కొత్త పాళీ’ గారు ! ’వాసు’ గారు ! ’అమ్మ ఒడి’ గారు !
  సంస్థ వారు వీడియో తీసారు గాని, చూడాలి ” కాపి ” అందజేస్తారో … లేదో …
  మీ మువ్వురికీ నా ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: