కమ్మనైన భాషరా ఆంధ్రము!

telugu scriptకమ్మనైన భాషరా

ఆంధ్రము

[ లలిత గీతం ]

రచన :

డా. ఆచార్య ఫణీంద్ర

 

కమ్మనైన భాషరా ఆంధ్రము

కవి కోకిలల కళా కేంద్రము

కమనీయ మధు కవితా సాంద్రము

కావ్య తృష్ణ తీర్చే చలివేంద్రము              || కమ్మనైన ||


భారతి నుదుటను దిద్దిన చెంద్రము

హారతి పట్టగ వెలిగిన చంద్రము

భావ కుసుమ నిలయమీ సుధీంద్రము

భాషలన్నిటిలో రాజేంద్రము                  || కమ్మనైన ||


గుసగుసలాడే వేళ మంద్రము

బుస కొట్టే వేళ నాగేంద్రము

సహృదయ జన చర్చలలో సంద్రము

సభలోన సరస మాహేంద్రము               || కమ్మనైన ||

___ *** ___potana

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. Raki
  నవం 08, 2009 @ 20:26:48

  మీ లలిత గీతం కాస్త ప్రౌఢ పదభూయిష్టమై -విద్వత్ జనరంజకమై ఒప్పరు చున్నది .మీకు నా నెనర్లు
  ఒకింత సమయమిడి మిడి మిడి జ్ఞానముతో బుడి బుడి అడుగులతో తడబడుచూ నడయాడే ఈ బుడతని కైతలని-పదాలని కూసింత నిశితపరిశీలనతో మీ మతలబు చెబుతారని ఆశిస్తూ………………………..సదా మీ స్నేహాభి లాషి ,రాఖీ
  http://www.raki9-4u.blogspot.com
  http://www.rakigita9-4u.blogspot.com

  స్పందించండి

 2. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 08, 2009 @ 23:25:37

  రాఖీ గారు !
  ధన్యవాదాలు !

  స్పందించండి

 3. Phani
  నవం 09, 2009 @ 01:33:55

  ఫణీంద్ర గారు చాలా బావుంది. కమ్మనైన తెలుగు బాష గురుంచి కమ్మ కమ్మగా భలే రాసారు.
  ఎవరైనా లలితంగా స్వరకల్పన చెస్తే హయిగా రోజూ పాడుకోవచ్చు.

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 09, 2009 @ 08:03:00

  ఫణి గారు !
  అనేక ధన్యవాదాలు !

  స్పందించండి

 5. రవి
  నవం 09, 2009 @ 09:37:44

  తెలుగంత కమ్మగా ఉంది మీ గీతం. అభినందనలు.

  స్పందించండి

 6. డా || ఆచార్య ఫణీంద్ర
  నవం 09, 2009 @ 16:48:53

  రవి గారు !
  అభివందన పూర్వక ధన్యవాదాలు !

  స్పందించండి

 7. ramnarsimha
  నవం 02, 2010 @ 15:21:10

  Sir,

  Meeku abhinandanalu.

  What`s your opinion on `Teaching in Mother-Tongue`?

  Do you support or oppose?

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: