పండంటి నా జీవితం …

పండంటి నా జీవితం …

( ప్రేమ గీతం )

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

Love

పండంటి నా జీవితం
పలుకుతోంది స్వాగతం !  || 2 ||
నా గుండెలోన ఉండిపో –
నిండు వలపు కుండవై !           || పండంటి ||

నీ పేరు విన్న చాలు –
ఒళ్ళంత పులకరాలు !
నీ తోడు ఉన్న చాలు –
మురిపాలు నా పాలు !
నీ తోటి యుగళ గీతం –
హృదయంగమ సంగీతం !  || 2 ||
నా గుండెలోన ఉండిపో –
నిండు వలపు కుండవై !           || పండంటి ||

మన రెండు జీవితాలు
విరబూచినట్టి పూలు !
అవి ప్రేమ పరిమళాలు
వెదజల్లు వేన వేలు !
మన ప్రేమ కథా చరితం –
రస రమ్య సుధా భరితం !  || 2 ||
నా గుండెలోన ఉండిపో –
నిండు వలపు కుండవై !          || పండంటి ||

___ *** ___

ప్రకటనలు

8 వ్యాఖ్యలు (+add yours?)

 1. Giridhar Pottepalem
  అక్టో 25, 2009 @ 17:23:23

  చాలా బాగుంది.

  స్పందించండి

 2. మరువం ఉష
  అక్టో 25, 2009 @ 19:21:58

  హమ్మయ్య కాస్త నా బాణీ కనబడుతుంది 🙂 బాగుంది మీ వ్యక్తీకరణ ఆచార్యా..

  జంటకవితలుగా వ్రాసుకున్నవివి

  http://maruvam.blogspot.com/2009/05/blog-post_05.html
  http://maruvam.blogspot.com/2009/05/blog-post_16.html

  స్పందించండి

 3. డా || ఆచార్య ఫణీంద్ర
  అక్టో 25, 2009 @ 23:27:01

  గిరిధర్ గారికి ధన్యవాదాలు

  స్పందించండి

 4. padmarpita
  అక్టో 25, 2009 @ 23:53:13

  చాలా బాగుందండి! ఉషగారు లెస్స పలికితిరి సుమ!!:)

  స్పందించండి

 5. డా || ఆచార్య ఫణీంద్ర
  అక్టో 26, 2009 @ 19:08:11

  ఉష గారు !
  మీ బాణీ ఏమిటో తెలియదు గానీ, ఇది మాత్రం ఒక హిందీ సినిమా పాట బాణీకి వ్రాసుకొన్న పాట. ” విజయ్ పథ్ ” సినిమాలో ఉన్న ” ఆయేహో మేరీ జిందగీమే తుమ్ బహార్ బన్ కే … ” అన్న పాట అది. దాదాపు పదేళ్ళ క్రితం ఒక marriage day నాడు మా ఆవిడకు ఇష్టమైన ఆ హిందీ పాట రాగంలో ఈ తెలుగు పాటను వ్రాసి, ఆమెకు present చేయడం జరిగింది. అందుకే ఇది నేను వ్రాసుకొన్న పాటలలో నాకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే పాట !
  మీకు నా ధన్యవాదాలు !

  స్పందించండి

 6. డా || ఆచార్య ఫణీంద్ర
  అక్టో 26, 2009 @ 19:11:48

  పద్మార్పిత గారు !
  ధన్యవాదాలు !

  స్పందించండి

 7. tvgupta
  అక్టో 27, 2009 @ 18:40:43

  mee kavitha nachindi, mee photo rasikatvam nachindi, mee javabullo mee udharatvam nachindi.

  స్పందించండి

 8. డా || ఆచార్య ఫణీంద్ర
  అక్టో 30, 2009 @ 19:35:33

  T.V. గుప్త గారు !
  కృతజ్ఞతలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: