’ సరదాల దసరా ’

‘ సరదాల దసరా ‘

రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర

mahishasura mardini

స్తంభమ్ములో హరి సాక్షాత్కరించి, దై

త్యాగ్రణిన్ వధియించినట్టి దినము –

రావణాసురుని శ్రీరాముండు నిర్జించి

అవని భార మణచినట్టి దినము –

పాండవ వీరుల పండ్రెండు మాసాల

అజ్ఞాత వాసాంతమైన దినము –

మహిషాసురుని జగన్మాతయే కోపించి

అంతమొందించిన యట్టి దినము –


తరతరాల సంస్కృతిని ఈ తరము ప్రజకు

వారసత్వమున మరల పంచుటకును

’ దసర ’ వచ్చె – తిరిగి సరదాల తెచ్చె –

భారతీయుల కిది మహా పర్వ దినము !


యువకుల్, బాలురు వత్సరాని కొకమా రుత్సాహ సంపన్నులై

శివ పత్నిన్ ఘన భక్తితో కొలచి, ఆశీర్వాదమందన్, ’ మహా

నవ రాత్రోత్సవ ’ మండపాల నమితానందంబుగా నిల్పరే !

చివరన్, నేటి సమాపనం బవనికిన్ చేకూర్చు కల్యాణమున్ !


మామిడాకు తోరణము గుమ్మాల కట్టి,

పిండి వంటలను జనులు ప్రీతిని తిని,

క్రొత్త బట్టలను ధరించి, గుడికి వెళ్ళి,

భగవదర్చన చేతురు భక్తి మీర –


వాహనాధిపతులు వాహన పూజలు,

కార్మికులును ’ కారుఖాన ’ పూజ,

పాఠశాలలందు పంతుళ్ళ పూజలున్

జరుపుచుంద్రు నేడు సంతసమున –


’ దసర వేషము ’ కొందరు దాల్చి, జనుల –

నాడి పాడుచు ’ మామూళ్ళ ’ నడుగుచుంద్రు –

వేడుకలు నలుదెసలను వెల్లివిరియ,

తేజరిల్లు తెలుగునాట తెలుగుదనము !


పాల పిట్టను వీక్షించి ప్రజలు నేడు

’ జమ్మి చెట్టు ’ ను పూజించి, కొమ్మ రిల్లి,

ఆకులను వెంటగొని పంచి అందరకును,

పలుకరించుకొందురు సుహృద్భావమునను –


మతము, భాషల మరచియు మనుజులెల్ల

కలసి చెప్పుకొనుచు శుభ కామనలను

కౌగిలించుకొనుట నేడు కానుపించు –

సామరస్యము పెంచునీ సంబరములు !

_____ *** _____

విశ్వమెల్లెడ విస్తరించియున్న భారతీయులందరికీ

‘ విజయ దశమి ‘ పర్వ దిన శుభాభినందనలు !

ప్రకటనలు

4 వ్యాఖ్యలు (+add yours?)

 1. నరసింహారావు మల్లిన
  సెప్టెం 27, 2009 @ 15:44:09

  సామరస్యము పెంచునీ సంబరములు !
  బాగుందండి.

  స్పందించండి

 2. కోడీహళ్లి మురళీ మోహన్
  సెప్టెం 28, 2009 @ 05:47:54

  మీకు కూడా విజయదశమి పర్వదినము సందర్భంగా నా హృదయపూర్వక శూభాకాంక్షలు!!!

  స్పందించండి

 3. nelabaludu
  సెప్టెం 28, 2009 @ 10:03:43

  ధన్యవాదాలు, ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు!

  స్పందించండి

 4. డా || ఆచార్య ఫణీంద్ర
  సెప్టెం 29, 2009 @ 14:26:54

  నరసింహారావు గారికి –
  మురళీ మోహన్ గారికి –
  ’ నెల బాలుడు ’ గారికి –
  ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: