ఇక్కడో వాగుండేది …

ఇక్కడో వాగుండేది …

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

batukamma - 1

ఇక్కడో వాగుండేది –

ఏమయింది ?


ఇరువయ్యేళ్ళ క్రితం

ఊరికి విడాకులిచ్చి,

నగరంతో కాపురం పెట్టాక

ఇదే చూడడం –

ఇక్కడో వాగుండేది –

ఏమయింది ?


సూర్యుడు వాగుపై

చూపు నిలుపక ముందే

తాతయ్య మూడు కాళ్ళతోబాటు

నా బుల్లి కాళ్ళు రెంటినీ నడిపించి

ప్రతినిత్యం

దంత ధావనం, జల క్రీడాస్నానం

చేసింది ఈ వాగులోనే !


సాయంత్రం బడి వదిలాక

శ్రీను మామయ్యతో

షికారు కెళ్ళినప్పుడు –

మామయ్య స్నేహితుల

చిలిపి ముచ్చట్లతో

వాగు నీటి అలల గలగలలు

పోటీ పడేవి !


’ బతుకమ్మ ’ పండుగ నాడు

ఊరు పట్టుచీర కట్టుకొని

వెండి కోలాటమాడుతూ

వాగు వంక సాగిపోయినట్టుండేది !

వయ్యారి భామలతో

సయ్యాటలాడిన రంగు రంగుల

అందచందాల బతుకమ్మలను

అక్కున జేర్చుకొన్న వాగు –

ఇప్పుడేమయింది ?


ఇప్పుడు ఆదరాబాదరా

బాత్ రూం స్నానం ముగించుకొని

కాన్వెంట్ యూనిఫాం కట్టుకొంటున్న

బాల బాలికలను చూసి –

సాయంత్రం కాగానే

ఊరి కళ్ళు బుల్లి తెరలకు

అతుక్కుపోవడం చూసి –

అరువు తెచ్చుకొన్న నగరం చీరను

ఊరు కట్టుకొని మురిసిపోవడం చూసి –

” బతుకమ్మ పండుగా ? అదేమిటి ? అనే

కొత్తతరం పల్లె పడుచులను చూసి –

వాగు గుండె పగిలినట్టుంది !

వాగు బతుకు ఎండినట్టుంది !!

( 2000  సంవత్సరంలో విజయవాడ ‘ ఎక్స్- రే ‘ సంస్థ

అఖిల భారత స్థాయిలో నిర్వహించిన వచన కవితల పోటీలో

‘ ఉత్తమ కవితా పురస్కారం ‘ పొందిన కవిత )

ప్రకటనలు

6 వ్యాఖ్యలు (+add yours?)

 1. Giridhar Pottepalem
  సెప్టెం 26, 2009 @ 15:24:56

  డా. ఫణీంద్ర గారూ,
  మారుతున్న మన పల్లెల స్వరూపాన్ని, మన సాంప్రదాయాల్ని సుతిమెత్తని కవితా రూపంలొ చూపిన మీ కవిత చాలా బాగుంది.
  – గిరిధర్ పొట్టేపాళెం

  స్పందించండి

 2. jaya
  సెప్టెం 26, 2009 @ 17:57:46

  డా.ఫణీంద్ర గారు, ఇకముందు అందమైన పళ్ళెటూళ్ళు కనిపించవేమో అని దిగులుగా ఉంది. చక్కటి పళ్ళెటూళ్ళు మళ్ళీ ఎలా ఒస్తాయో!

  స్పందించండి

 3. డా || ఆచార్య ఫణీంద్ర
  సెప్టెం 27, 2009 @ 02:18:04

  గిరిధర్ గారు !
  జయ గారు !
  ఒక వైపు నీటి వనరులపై సరైన అవగాహన లేక, వాటిని కాపాడుకోలేకపోతున్నాం.
  మరొక వైపు పల్లెల సంస్కృతి సొబగులు కనుమరుగవుతున్నాయి.
  ఈ రెండు ఆవేదనలు కలగలసి, కలచివేయగా పెల్లుబికిన కవిత అది.
  మీకు నా ధన్యవాదాలు !

  స్పందించండి

 4. Nutakki Raghavendra Rao
  సెప్టెం 27, 2009 @ 07:47:04

  ఆచార్యా ! గ్రామీణ భారతి లో మారుతున్న భూభౌతిక చిత్రాన్ని చక్కగా ఆవిష్కరించారు.ప్రక్రుతిలో కలుగుతున్న వైపరీత్యాలే కాక అనేక సందర్భాలలో,సామాజిక ఆర్ధిక రాజకీయ ధ్రుక్కోణాన్నీ యీ విషయంలో కాదనలేం. ప్రత్యక్షంగా నేను అచ్చెరువందిన ద్రుశ్యం…. మా వూరులో, ఒక్క తాడి చెట్టూ లేకుండా మాసి పోవడం.మా గ్రామం చుట్టు ప్రక్కల ఏ వూరులోనూ అంతటి తాటి వ్రుక్ష సంపద వుండేది కాదు. క్రమేణా జరిగిన పరిణామం కాదని స్తానికులు చెప్పారు..ఒకే ఒక ఏడాది లో కలిగిన ప్రాక్రుతిక విపరిణామం.చూసీ చూడగానే కడుపు తరుక్కు పోయిందంటే నమ్మండి.పల్లెల్లో నగరీకరణ ప్రభావం తో జానపద రీతులు తుడిచి పెట్టుకు పోతూ నగరాల్లో స్థిరపడుతున్నాయి. వీటిని అమెరికాలోనూ మనవారు పాటించాలని ప్రయత్నిస్తున్నారు. అదీ ఓ రకంగా మంచిదే.గ్రామాలు నసిస్తూ పట్టణాలు ప్రబలుతున్న వేళ నగరాలు మన సంస్కుతితో సుసంపన్న మౌతున్నాయి. వెర్రి తలలు వేయనంతకాలం మంచిదే.
  అభినందనలతో…….నూతక్కి

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  సెప్టెం 27, 2009 @ 08:34:26

  నూతక్కి వారికి ధన్యవాదాలు !
  దసరా శుభాకాంక్షలు !!

  స్పందించండి

 6. ramnarsimha
  సెప్టెం 17, 2010 @ 18:10:34

  Mee kavitha chaala bagundi.

  Abhinandanalu.

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: