నవ్య భూషణము

నవ్య భూషణము

( ’ లెదర్ బెల్టు ’ పై పద్య కవిత )

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

belt

పరమ శివుని గళముపై నాగు పామట్లు
నరుల నడుము చుట్టు నన్ను గనరె ?
చుట్టుకొని, జనాళి చూపు నాకర్షింతు –
’ బకిలు ’ తోచ, నాగు పడగ వోలె !

నాటి ’ ఒడ్డాణము ’ ను నేను ! నేటి కిట్లు
నూతనావతారము నెత్తి, ప్రీతి గొలుప –
’ బెల్టు ’ నామధేయంబుతో పిలువబడుచు,
నవ్య భూషణంబైతి – నే నరుల కొరకు !

పొట్టపయి ప్యాంటును నిలిపి
పట్టియు నుంచంగ కలిగి పట్టుదలను, నే
గట్టిగ నా ఊపిరి బిగ
బట్టి నరుని నడుము చుట్టు పరివేష్టింతున్ !

’ టిక్కు ’ ను, ’ టాకు ’ గా జనులు ’ డ్రెస్సు ’ ధరించిన లాభమేమి ? నా
చక్కని సోయగమ్మొలుకు చర్మ వినిర్మిత రూప మింక ఇం
పెక్కగ ప్యాంటుపై నిలిపి పెట్టక పోయిన; లోకు లెల్లరున్
ముక్కున వేలు వేసుకొని, ’ ముస్ముసి ’ నవ్వుచు వెక్కిరింపరే ?

చిత్ర చిత్రమైన చిన్నెవన్నెల నొల్కు
మమ్ము ’ షాపు ’ లందు నమ్ముచుంద్రు !
నాసి రకము కొన్ని, నాణ్యమైనవి కొన్ని –
కొనెడి వారలిచ్చు ధనము బట్టి !

పొట్ట నదిమి పట్టి, ’ ఫిట్టు ’ గా నుంతు – నా
పొడుగు చాల దింక పొట్ట పెరుగ !
పొట్ట ప్రజలు పెంచి, పొట్టిదయ్యెనటంచు
నన్ను తిట్టి పోయ న్యాయమగునె ?

జీర్ణమైన వేళ, చింతించకుండ నా
చేసినట్టి గొప్ప సేవ గూర్చి –
అల్లుకొన్నయట్టి అనుబంధమును గూర్చి –
నరుడు పారవేయు నన్ను బయట !

____***____

ప్రకటనలు

3 వ్యాఖ్యలు (+add yours?)

 1. సత్యనారాయణ
  సెప్టెం 21, 2009 @ 20:39:46

  బాగుంది 🙂
  “పొట్ట ప్రజలు పెంచి, పొట్టిదయ్యెనటంచు
  నన్ను తిట్టి పోయ న్యాయమగునె ?”
  Super.. :-))

  స్పందించండి

 2. నరసింహారావు మల్లిన
  సెప్టెం 22, 2009 @ 06:08:44

  చాలా హాయిగా సాగిందండి. బెల్టెప్పుడూ మనకి మన పొట్టను తగ్గించుకోమనే చెప్తుంటుంది పాపం ! మనం మాత్రం దానిని లక్ష్యపెట్టం. ధన్యవాదాలు. ఇటువంటి మణిప్రవాళాలు మీదగ్గఱనుండీ ఇంకా ఇంకా వస్తుండాలని మా కోరిక.

  స్పందించండి

 3. డా || ఆచార్య ఫణీంద్ర
  సెప్టెం 22, 2009 @ 15:10:33

  హృద్య పద్య విద్యా ప్రియులు
  శ్రీ సత్యనారాయణ గారికి, శ్రీ నరసింహారావు గారికి –
  మీ ఆదరాభిమానాలకు నా ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: