” నిన్ను కొంటారు తమ్ముడూ ! “

” నిన్ను కొంటారు తమ్ముడూ ! “

( ప్రబోధ గీతం )

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

happy_man_with_money

నిన్ను కొంటారు తమ్ముడూ !

అమ్ముడు పోతావా ?    ( 2 )

నిన్ను పైకానికో,

లేక బంగారుకో,

విలువ కట్టి మరీ కొంటారు –

అమ్ముడు పోతావా ?                      || నిన్ను కొంటారు ||


ఏ కన్న తండ్రో, నీ కన్న తండ్రిని

నీకై కోరుతాడు – బేరాలాడుతాడు –

’ వర కట్నం ’ అంటూ

అంగడి వస్తువులాగా

ఖరీదిచ్చి మరీ కొంటారు –

అమ్ముడు పోతావా ?                      || నిన్ను కొంటారు ||


ఆడ పిల్లల తండ్రి చెమట రక్తాలను,

ఆడ పిల్లలు కార్చే వేడి కన్నీళ్ళను

కలిపి పైకంగా మార్చి,

వర కట్నంగా ఇచ్చి,

పెళ్ళి పీటలపై కొంటారు –

అమ్ముడు పోతావా ?                     || నిన్ను కొంటారు ||


నీ చదువు, సంస్కారం –

నీ పదవి, హోదా –

అన్నిటినీ మరచి, నీ తండ్రికి వెరచి,

నీ మానం, ప్రాణం,

అన్నీ చంపుకొని –

పెళ్ళి కొడుకువై అందరిలో

అమ్ముడు పోతావా ?                    || నిన్ను కొంటారు ||


__ *** __

ప్రకటనలు

7 వ్యాఖ్యలు (+add yours?)

 1. ఉష
  సెప్టెం 19, 2009 @ 21:44:50

  బాగా వ్రాసారండి. సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్ళినా ఈ ఒక్క సమస్య ఈ తరం యువతీయువకులు పరిష్కరించనిదే తెగదు.

  స్పందించండి

 2. padmarpita
  సెప్టెం 19, 2009 @ 21:45:53

  కొన్నవాళ్ళు కొందరు….
  అమ్ముడు పోయినవాళ్ళు ఎందరో….
  బాగుందండి!!!

  స్పందించండి

 3. Dr.Acharya Phaneendra
  సెప్టెం 20, 2009 @ 08:41:18

  ఉష గారికి, పద్మ గారికి –
  హృదయ పూర్వక ధన్యవాదాలు !

  స్పందించండి

 4. Vishnu
  సెప్టెం 20, 2009 @ 11:35:05

  Wow !!! You Just Summoned up the sickening sale so well… I like the way you narrated it as if you empathize with the sale but the tone of sarcasm comes across So Subtly.

  స్పందించండి

 5. Dr.Acharya Phaneendra
  సెప్టెం 20, 2009 @ 14:01:23

  Thank you Vishnu garu !

  స్పందించండి

 6. aswinisri
  సెప్టెం 20, 2009 @ 19:45:43

  good! nirlajjagaa ammudu poetaadandi baabu!

  స్పందించండి

 7. డా || ఆచార్య ఫణీంద్ర
  సెప్టెం 20, 2009 @ 21:52:42

  అశ్వినిశ్రీ గారు !
  లేదు లెండి ! ఆశావాదులుగా మార్పును ఆకాంక్షిద్దాం !
  ధన్యవాదాలు !

  స్పందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: